తాడేపల్లి (ప్రజా అమరావతి);
ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించటమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే ఆర్కె.
ముఖ్యమంత్రి *వైయస్ జగన్మోహన్ రెడ్డి* ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోస్ పూర్తి చేసుకొని 45 రోజులు గడిచిన వారికి మాత్రమే సెకండ్ డోస్ వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముందుగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కెతెలియచేశారు .శుక్రవారం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లోని తాడేపల్లి కళ్ళం వెంకట్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ కోవేట్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అవసరం ఉంటేనే బయటకు రావాలని ఆయన సూచించారు . అనవసరంగా రోడ్లమీద ద్విచక్రవాహనాలపై తిరిగే వారిని పోలీసులు పట్టుకొని వాహనాలు సీజ్ చేస్తే వదిలిపెట్టమని ఎవరు రికమండేషన్ చేయొద్దని ఆయన సూచించారు అలా ప్రోత్సహిస్తే కారోనా మహమ్మారి కరోనా మహారాణి మన ఇంట్లోకి తెచ్చుకున్న వారు అవుతాము అని ఆయన అన్నారు
అనంతరం వ్యాక్సినేషన్ సెంటర్లో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి ప్రాథమిక వైద్యశాల డాక్టర్ రమేష్ నాయక్ మంగళగిరి తాడేపల్లి కమిషనర్ నిరంజన్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి సి ఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment