పారదర్శకంగా వ్యాక్సిన్ పంపిణీ.
*నియోజకవర్గంలో 4 నిరంతర వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు*
*అందరికీ టీకా మా ప్రథమ కర్తవ్యం*
*చిలకలూరిపేటలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గారు*
*కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్ష సమావేశం*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
నియోజకవర్గంలోని అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాల పంపిణీ పారదర్శకంగా కొనసాగాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. స్థానిక బీఆర్ ఐజీ పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం సబ్ కలెక్టర్ శ్రీవాస్ నపూర్ అజయ్‌కుమార్, డీఎస్పీ విజయభాస్కర్ గార్లు మరియు తదితరులతో కలిసి ఎమ్మెల్యే విడదల రజిని గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగు చోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. చిలకలూరిపేట పట్టణంతోపాటు కావూరు, నాదెండ్ల, యడ్లపాడు గ్రామాల్లో టీకాలు వేస్తారని తెలిపారు. ఇవి నిరంతరం పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారికి మాత్రమే ఈ కేంద్రాల్లో టీకాలు వేస్తారని వెల్లడించారు. కొద్ది రోజుల తరువాత ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుతుందని చెప్పారు. అందరికీ టీకా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
*కరోనా తో ఎవరూ ఇబ్బందులు పడకూడదు*
అనంతరం అక్కడే నియోజకవర్గంలోని అధికారులందరితో కోవిడ్‌పై ఎమ్మెల్యే గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కోవిడ్ విధులకు సంబంధించి ఎదురువుతున్న సమస్యలను ఎమ్మెల్యే విడదల రజిని గారి దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. కోవిడ్ టెస్టుల విషయంలో ఎవరికీ ఇబ్బందులు ఎదురుకాకడదని చెప్పారు. కోవిడ్ సమస్యలపై ఇప్పటికే తాను ఉన్నతాధికారులను కలిసి పలు విజ్ఞాపనలు చేసినట్లు చెప్పారు. ఆ ఫలితంగానే కోవిడ్ పరీక్షలకు సంబంధించి ఇప్పుడు నియోజకవర్గంలో దాదాపు ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. కరోనా చికిత్స విషయంలో కూడా సమస్యలను అధిగమిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో చిలకలూరిపేట ఇంచార్జి తహసీల్దార్ రవికుమార్,ఎడ్లపాడు తహశీల్దార్ శ్రీనివాసరావు, నాదెండ్ల తహశీల్దార్ మల్లిఖార్జున, ఇంచార్జి కమిషనర్ ఫణీంద్ర, డీఈఈ అబ్దుల్ రహీం,అర్బన్ సీఐ బిలాలుద్దీన్, రూరల్ సీఐ సుబ్బారావు,అర్బన్ యస్.ఐ అజయ్,డాక్టర్ గోపి నాయక్, నాదెండ్ల ఎంపీడీఓ మోషే,మెడికల్ సిబ్బంది,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,కౌన్సిలర్లు విడదల గోపి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు మరియు పలువురు ఉన్నారు.
addComments
Post a Comment