రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తు న్నది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బాధితులకు  అండగా నిలుస్తు న్నది.


*ప్రజలందరూ తప్పని  సరిగా మాస్కులు ధ రించి భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నియంత్రణ కు సహ కరించండి : డిప్యూటీ సి.ఎం* 


 *కోవిడ్ కేర్ కేంద్రాల లో బాదితుల వస తుల ఏర్పాటు పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిం చింది : జిల్లా కలెక్టర్* 


 *కోవిడ్ కేర్ సెంటర్ లో తగు వసతుల ఏర్పాటు కు ఒక లక్ష రూపాయలను విరా ళంను జిల్లా కలెక్టర్ కు  అందజేసిన వెదురు కుప్పంకు చెందిన హేమచంద్రా రెడ్డి* 


జి.డి.నెల్లూరు మే 18 (ప్రజా అమరావతి) :


రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బాధితులకు వైద్య సేవ లు అందిస్తూ అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ బాలయోగి గురు కులం (బాలికలు) లో 100 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు మరియు జిల్లా కలెక్టర్ కలిసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా) ఎన్.రాజశేఖర్, ఎం.పి.డి.ఓ శ్రీదేవి, తాహసీల్ధార్ ఇంబు  నాధన్, ట్రయాజింగ్ నోడల్ ఆఫీసర్ డా.రవిరాజు, సంబందిత డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.


 *ఈ సంధర్భంగా డిప్యూటీ సి.ఎం మాట్లాడుతూ* రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కరో నా విపత్కర పరిస్థితు లలో  ప్రజల ను ఆదు కునేందుకు అవసర మైన ఆన్నీ వైద్య సదు పాయాలను ఏర్పాటు చేయడం జరుగు తున్న దని, ఎప్పటికప్పుడు కోవిడ్ పై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ  అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. కరోనా సెకం డ్ వేవ్ లో ప్రజలందరూ మనో దైర్యంతో ఉండా  లని జిల్లా అధికార యంత్రాంగం, డాక్టర్స్,  వైధ్య సిబ్బంది, అధికా రులందరూ దైర్యంగా సేవలు అందిస్తు న్నా రని, ప్రజలందరూ  మనో దైర్యంగా ఉండి కోవిడ్ నియమ నిబం ధనలు తప్పనిసరి గా పాటించాలని తెలి పారు. ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని కోవిడ్ నియంత్రణలో ఎవరికి వారు తగు జాగ్రత్తలతో ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం ఆరోగ్య శ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా కోవిడ్ వైధ్య సేవలు అందించడంతో పాటు బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్య శ్రీ కింద చేర్చడం జరిగిందని తెలిపారు. గంగాధర్ నెల్లూరు(జీడీ నెల్లూరు) నియోజక వర్గంలో ఇదే వరకే కార్వేటి నగరంలో వంద పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, పచ్చికాపళం లో కూడా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు కు చర్యలు చేపడుతున్నామని తెలిపారు..


 *జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ* జిల్లాలో కోవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతున్న దని కోవిడ్ బాధితులకు  వైద్య సేవలు అందించేం దుకు స్విమ్స్, రుయా, జిల్లా ఆసుపత్రి చిత్తూరు,మదనపల్లి,    ఏరియా ఆసుపత్రులు, శ్రీకాళహస్తి, నగిరి వైధ్య సేవలు అందించడంతో పాటు ప్రతి నియోజక వర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ను ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవడం జరుగుతుందని, కోవిడ్ కేర్ కేంద్రాలలో కూడా అన్ని వసతుల ఏర్పాటు పై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.