తిరువూరు నియోజకవర్గంలో కోవిడ్ సేవలు అందించేవారికి పిపిఇ కిట్లు ..


విజయవాడ (ప్రజా అమరావతి);


తిరువూరు నియోజకవర్గంలో కోవిడ్ సేవలు అందించేవారికి పిపిఇ కిట్లు ..కలెక్టర్ ఇంతియాజ్


కరోన మహమ్మారి తో ప్రజలు ఇబ్బందులు ఎదురవ్వడం, వారికి చేయూత గా నిలిచి సేవా కార్యక్రమాలు చేపట్టే వారి కోసం పిపిఈ కిట్లు అందిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.


శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తిరువూరు శాసన సభ్యులు ప్రతినిధికి వి.సురేష్ కు  పీపీఈ కిట్లు బాక్స్ ను కలెక్టర్ అందచేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు స్పందించి ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లాలో కరోన స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్త వహించి, ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలన్నారు. ప్రజలకు ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయకరంగా నిలిచే వారికి తిరువూరు శాసనసభ్యులు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అందుకు సహాయం చేయడానికి ముందుకు వొచ్చే వారి భద్రత కోసం పిపిఈ కిట్లు అందచెయ్యడం జరుగుతోందని ఆయన తెలిపారు.