మంత్రి పేర్ని నాని వారి చొరవతో డివిస్ లేబొరేటరీస్ వితరణ



విజయవాడ (ప్రజా అమరావతి);



మంత్రి పేర్ని నాని వారి చొరవతో  డివిస్ లేబొరేటరీస్ వితరణ


ఆక్సీజన్ సిలిండర్లు కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతగా రూ.65 లక్షలు మేర సహాయం


ముంబయి నుంచి 200 ఆక్సీజన్ సీలిండర్స్ కొనుగోలు..


కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్


కృష్ణా జిల్లా వాస్తవ్యులు దివి మురళీ కృష్ణ ప్రసాద్, తమ సంస్థ తరపున సామాజిక బాధ్యతగా సుమారు రూ.65 లక్షల విలువ చేసే 200 ఆక్సిజన్ సీలిండర్స్ అందించారని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.


శనివారం దివిస్ సంస్థ ద్వారా జిల్లాకు అందించిన ఆక్సిజన్ సీలిండర్స్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నకు చేరాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వారి ప్రత్యక్ష భాగస్వామ్యం వలన జిల్లాకు 200 ఆక్సిజన్ సీలిండర్స్ రావడం జరిగిందన్నారు.వీటిలో 100 విజయవాడలో ని కొత్త ప్రభుత్వ ఆస్పత్రికి, మరో వంద మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి కి కేటాయింపు చెయ్యడం జరిగిందన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించే దిశగా ఆక్సిజన్ సీలిండర్స్ కొరతను నివారించేందుకు ముంబయి నుంచి దివిస్ సంస్థ వీటిని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్క సంస్థ సొంతలాభం కొంత మానుకుని తోటివారికి సహాయ పడవోయి అనే గురజాడ వారి మాటలు స్ఫూర్తి తెచ్చుకోవాలని కోరారు. 


 జిల్లా కోవిడ్ నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఎల్ శివ శంకర్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ  జి. ప్రవీణ్ రాజ్, రెవెన్యూ శాఖ కు చెందిన మురళి, దివిస్ ప్రతినిధి  పరశురామయ్య, తదితరులు పాల్గొన్నారు.


Comments