రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ -పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

విజయవాడ (ప్రజా అమరావతి);


రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ

     -పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు పోటీపడే విధంగా మన విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 61,208 పాఠశాలలు ఉండగా వాటిలో 44,639 పాఠశాలలు అంటే 73 శాతం పాఠశాలలు ప్రభుత్వంచే నడపబడుచున్నాయి. వీనిలో         43 లక్షల మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 6,13,000 విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ప్రవేశం పొందారు. వీరిలో దాదాపు నాల్గు లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు రాగా రెండు లక్షల మంది కొత్తగా ప్రవేశం పొందారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో అదికూడా కరోనా మహమ్మారి ప్రభలి ఉన్న కాలంలో చేరటమైనదే చారిత్రాత్మక విషయంగా చెప్సొచ్చు. ఇంత పెద్ద ఎత్తున పాఠశాలలో చేరిన విద్యార్ధులకు బంగారు భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రానున్న కాలంలో ఈ విద్యార్ధులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుందనే బాధ్యతో ప్రభుత్వం సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. 

 సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ కింద పరీక్షలు నిర్వహించే సంస్థ పాన్-ఇండియా మరియు అంతర్జాతీయ ఉనికిని కల్గిన సంస్థ. ఈ సంస్థలో భారత్ తో పాటు 26 దేశాల్లోని 25,000 పైగా పాఠశాలలు అనుబందంగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, స్వతంత్ర ఆర్థిక పరిపుష్టి కల్గిన ప్రైవేట్ పాఠశాలలు మరియు ఢిల్లీ, ఛంఢీఘర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 

సీబీఎస్ఈ తో ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 44,639 ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా ఈ బోర్డుకు అనుబంధించడం మరియు పాఠశాలల నిర్వాహకులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఆంగ్లమాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్ధ్యాన్ని పెంపొందించడం మరియు మూడు, ఐదు, ఎనిమిదవ తరగతుల విద్యార్ధుల సామర్ధ్యాన్ని అంచనావేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. 

సీబీఎస్ఈ ద్వారా వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో మన విద్యార్ధులు పాల్గొని విజయం సాధించగల్గుతారు. విద్యార్ధులు భట్టీపట్టే విధానం నుంచి భావన నిర్మాణం ద్వారా జ్ఞాన అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన నుంచి విద్యార్ధి కేంద్రీకృత బోధనాభ్యసనంగా మార్చవచ్చు. 

2024-2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్ధులు ఈ సిబిఎస్ఈ బోర్డు ద్వారా ఆంగ్ల మాధ్యంలో పరీక్షలు రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగుచర్యలు చేపడుతుంది.Comments