కరోనా సెకెండ్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి. గోపి
విజయనగరం, మే 07 (ప్రజా అమరావతి) ః కరోనా సెకెండ్ వేవ్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని.. కరోనా వ్యాప్తి చెందకుండా బాధ్యతగా మెలగాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయట తిరగకుండా ఉండాలని.. భౌతిక దూరం పాటించాలని.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పాటించాల్సిన నియమాలపై సూచన చేసేందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న పారాలీగల్ వాలంటీర్లతో ఆయన శుక్రవారం ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. రెండో దశలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని కావున అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయట తిరగరాదని.. ఒక వేశ ఎవరికైనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లయితే హోం క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. మంచి ఆహారం తీసుకోవాలని.. శారీరకంగా.. మానసికంగా దృఢంగా తయారవ్యాలని ఆకాంక్షించారు. 60 శాతం కేసులు భయం వల్లనే తీవ్రమవుతున్నాయని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు. కోవిడ్ నిబంధలను పాటిస్తూ స్వీయ రక్షణ పద్ధతులు పాటించాలని ఆయన చెప్పారు. పారాలీగల్ వాలంటీర్లు ప్రజలకు - న్యాయ సేవా సదన్‌కు వారధిలాంటి వారని పేర్కొన్నారు. వాలంటీర్లు కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ధైర్యం నింపాలని సూచించారు.
addComments
Post a Comment