ఆపద సమయం.. అండగా ఉందాం..
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు.
*ప్రభుత్వాస్పత్రితోపాటు కరోనా చికిత్స కేంద్రంలో సిబ్బందిని పెంచండి*
*ఒక అంబులెన్స్‌ను వెంటనే ఇవ్వండి*
*ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా ఉంచండి*
*కలెక్టర్‌ను కోరిన చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి); నియోజకవర్గంలో కరోనా సమస్య వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు కలెక్టర్ వివేక్‌యాదవ్ గారిని కోరారు. నియోజకవర్గంలో కోవిడ్ కట్టడి చర్యలకు సంబంధించి ఎమ్మెల్యే విడదల రజిని గారు శుక్రవారం కలెక్టర్ వివేక్‌యాదవ్ గారితో ప్రత్యేకంగా
భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గానికి కోవిడ్ విధులు నిర్వహించేందుకు గాను ఇటీవల తన అభ్యర్థన మేరకు 47 మంది సిబ్బందిని ఇచ్చారని, వీరిలో కొంత మంది విధుల్లోకి వచ్చి చేరలేదని, వెంటనే సమస్యను పరిష్కరించేలా చొరవచూపాలని కలెక్టర్‌ను కోరారు. కరోనా వల్ల రోగులకు వైద్య సిబ్బంది కొరత అనే సమస్య ఎదురుకాకూడదని, వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రి, టిడ్కోలోని కరోనా ఆస్పత్రుల్లో పనిచేసేందుకు ఆరుగురు డాక్టర్లను నియమించాలని కోరారు. 12 మంది స్టాఫ్ నర్సులను 12 మంది ఎంఎల్‌వోలు, ఎస్ ఎన్ వోలను నియమించాలని కోరారు. ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి అంబులెన్సును ప్రత్యేకంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేటలో కోవిడ్ చికిత్సకు అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులు బాగానే పనిచేస్తున్నాయని, ఒకటి రెండు ఆస్పత్రుల్లో మాత్రం అధిక ఫీజులు వసూలు ఆరోపణలు వినిపిస్తున్నాయని, వీటిపై నిఘా ఉంచాలని కోరారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఏజెన్సీకి ఆదేశాలు ఇవ్వాలని, వారికి అవసరమయ్యే ఆక్సిజన్ సరఫరాకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.
*కలెక్టర్ స్పందన.. అధికారులకు ఆదేశాలు జారీ*
ఎమ్మెల్యే విడదల రజిని విజ్ఞప్తి మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్ అప్పటికప్పుడు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అంబులెన్స్‌ను అద్దెకు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ శ్రీవాస్నుపూర్అజయ్‌కుమార్‌ను కలెక్టర్ గారు ఆదేశించారు. వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ కు సూచించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆక్సిజన్ సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ చూపుతారని, అందుకు అధికారులు సహకరించాలని సబ్‌కలెక్టర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
addComments
Post a Comment