*రెండేళ్లలో రూ.575 కోట్లు*
*ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళ్లాయి*
*ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గానికే ఇంత మొత్తంలో ప్రజలకు లబ్ధి కలగడం ఒక చరిత్ర*
*సంక్షేమంలో ఇది సరికొత్త విప్లవం*
*అతి తక్కువ కాలంలోనే 94.5 శాతం హామీల అమలు..*
*ప్రజల గుండెల్లో వైఎస్ జగన్ గారు*
*నియోజకవర్గంలో రైతుల ఖాతాల్లోకి రెండేళ్లలో నేరుగా జమ అయిన మొత్తం రూ.134.6 కోట్లు*
*ప్రజల ఆనందం అనంతం.. జగనన్న పాలన సుధీర్ఘం*
*ఏపీలో ఇక ఏ రాజకీయ పార్టీని ప్రజలు ఆదరించరు*
*చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు*
*రెండేళ్ల పాలనపై విలేకరుల సమావేశంలో పలు విషయాల వెల్లడి*
రెండేళ్ల తమ పాలన దేశంలోనే సరికొత్త చరిత్రను సృష్టించిందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని గారు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాము రూపొందించిన మేనిఫెస్టోలో ప్రజలకు మొత్తం 129 హామీలు ఇచ్చామని చెప్పారు. వాటిల్లో 107 వాగ్దానాలు పూర్తిగా అమలయ్యాయన్నారు. మరో 15 హామీలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మరో 7 వాగ్దానాలను మాత్రమే అమలు చేయాల్సి ఉందని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 94.5 శాతం హామీలను నెరవేర్చి... ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నారని పేర్కొన్నారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా రూ.1.32 లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని, ఈ మొత్తంలో ఒక్క నగదు బదిలీ ద్వారానే ప్రజలకు 96వేల కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు. మహిళా మణులకే ఏకంగా రూ.88,040 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరిందని, ఇది చరిత్రలో నిలిచిపోయే అంశమని చెప్పారు. ఒక మహిళగా తమ పరిపాలనను చూసి గర్వంతో పొంగిపోతున్నానని తెలిపారు.
*నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రాకుండా....*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి); నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రాకుండా తమ ప్రభుత్వం కాపాడుతోందని చెప్పారు. ప్రతి అవసరానికి తానున్నానంటూ సీఎం వైఎస్ జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చారని చెప్పారు. ఈ రెండేళ్లలో ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోని ప్రజలకే రూ.575 కోట్లు ఆర్థిక చేయూత అందించారని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా, అన్నదాతలకు సున్నా వడ్డీకే రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ లాంటి పథకాల ద్వారా ఒక్క కర్షకులకు నియోజకవర్గంలో రూ.134.6 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని చెప్పారు. జగనన్న చేదోడు కింద నియోజకవర్గ ప్రజలకు రూ.1.7 కోట్లు, కాపు నేస్తం ద్వారా రూ.1.2 కోట్లు, వసతి దీవెన కింద రూ. 12.9 కోట్లు, విద్యా దీవెన ద్వారా రూ.26 కోట్లు, అమ్మ ఒడి కింద రూ.71 కోట్లు, వాహన మిత్ర ద్వారా రూ.1.2 కోట్లు, నేతన్న నేస్తం రూ.రూ.1.10 కోట్లు, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా అందిన లబ్ధి రూ.24 కోట్లు, తెల్ల కార్డుల దారులకు ప్రత్యేక కోవిడ్ సాయం కింద రూ.7.8 కోట్లు, డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాల ద్వారా 14.7 కోట్లు, వైఎస్సార్ పింఛన్ కానుక కింద నియోజకవర్గంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.192 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ.28 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.38 కోట్లు, వైఎస్సార్ బీమా ద్వారా రూ.9కోట్లు, అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు ప్రత్యేక ఆర్థిక సాయం, అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయం, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, వైఎస్సార్ లా నేస్తం, విదేశీ విద్యా దీవెన కింద నియోజకవర్గానికి రూ.11.2 కోట్ల ఆర్థిక లబ్ధి కలిగిందని ఎమ్మెల్యే గారు వివరించారు. మొత్తం మీద నియోజకవర్గంలోని ప్రజలకు ఆయా పథకాల ద్వారా కేవలం రెండేళ్లలో రూ.575 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని చెప్పారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయమన్నారు. సంక్షేమ విప్లవం ఏపీలో పరఢవిల్లుతోందని చెప్పడానికి ఇది నిదర్శనమని చెప్పారు.
*జెండా ఆవిష్కరణ*
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో రెండేళ్ల విజయవంత పాలన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి నాయకులకు పంచారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, యడ్లపాడు, నాదెండ్ల మండలాల జెడ్పీటీసీ అభ్యర్థులు ముక్తా శ్రీనివాసరావు, కాట్రగడ్డ మస్తాన్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల అధ్యక్షులు దేవినేని శంకరరావు,గొంటు శ్రీనివాసరెడ్డి, కల్లూరి బుజ్జి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, చిలకలూరిపేట మున్సిపాలిటీ అన్ని వార్డుల కౌన్సిలర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment