జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్, స్పందన కార్యక్రమంపై సమీక్ష:.


అమరావతి (ప్రజా అమరావతి);


జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్, స్పందన కార్యక్రమంపై సమీక్ష:.




*కోవిడ్‌–19.*

– ఉపాధి హామీ పనులు. (లేబర్‌ బడ్జెట్‌. గ్రామ సచివాలయాల భవనాలు. ఆర్బీకే భవనాలు, డాక్టర్‌ వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (రూరల్‌). ఏఎంసీయూ, బీఎంసీయూలు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం)

– డాక్టర్‌ వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌

– 90 రోజుల్లో ఇంటి స్థలం కేటాయింపు. ఇళ్ల నిర్మాణం.

– స్పందన కార్యక్రమం, సమస్యల పరిష్కారం

– ఈ ఖరీఫ్‌కు సన్నద్ధత,విత్తనాలు, ఎరువుల పంపిణీ. వ్యవసాయ రుణాలు, 

వీటన్నింటితో పాటు, ఈనెలలో కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష:


*స్పందన సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:*


*1). ఉపాధి హామీ పనులు (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌):*


లేబర్‌ బడ్జెట్‌:

కోవిడ్‌ సమయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మనకు మంజూరయ్యాయి.

వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరాలంటే ప్రతి జిల్లా తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి.

కానీ ఇప్పటి వరకు 4.57 కోట్ల పని దినాల పని మాత్రమే జరిగాయి. 

అందువల్ల జూన్‌ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాల్సి ఉంది.


*గ్రామ సచివాలయాల నిర్మాణం:*

వచ్చే నెల 30 కల్లా అన్ని గ్రామ సచివాలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, మొత్తం 10,929 సచివాలయాల భవనాల్లో పనులు పూర్తైనవిచాలా తక్కువగా ఉన్నాయి. 

కలెక్టర్లు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.


*రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు):*

మొత్తం 10,408 ఆర్బీకే భవనాల నిర్మాణం మొదలు పెడితే, వాటిలో దాదాపు సగం మాత్రమే దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. 

కాబట్టి వాటిపై కూడా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.


*వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు (గ్రామీణ):*

మొత్తం 8,585 గ్రామీణ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణానికి గానూ, ఇంకా చాలా పూర్తి కావాల్సి ఉంది. వాటిపైనా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.


*ఏఎంసీయూ, బీఎంసీయూ:*

వీటికి సంబంధించి 9,899 భవనాలు కట్టాలని నిర్ణయించగా, ఇంకా 348 చోట్ల ఇంకా పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వలేదు.

ఇంకా దాదాపు 38 శాతం భవనాల నిర్మాణాలు ఇంకా మొదలు పెట్టలేదు. కాబట్టి వెంటనే ఆ అనుమతులు ఇవ్వండి. ఆ భవనాల నిర్మాణాలు మొదలు పెట్టండి. 


*అంగన్‌వాడీ కేంద్రాలు:*

నాడు–నేడు కింద అంగన్‌వాడీలను వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నాము.

వాటిలో పట్టణ ప్రాంతాల్లో 1230 ప్రాంతాల్లో స్థలాలు గుర్తించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 404 చోట్ల ఆ స్థలాలు గుర్తించాలి.

తొలి దశలో అంగన్‌వాడీ నాడు–నేడు కింద 8,634 చోట్ల కొత్త భవనాల నిర్మాణంతో పాటు, మరో 3341 భవనాల ఆధునీకరణ చేపడుతున్నాం.

ఇంకా పెండింగ్‌లో అసంపూర్తిగా ఉన్న 3928 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి చేయాలి. 

వెంటనే వాటి అంచనాలు పూర్తి చేసి, సాంకేతికంగా, పరిపాలనాపరంగా కలెక్టర్లు అనుమతులు మంజూరు చేయాలి.

పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలి. వీలైనంత త్వరగా వాటి నిర్మాణాలు పూర్తి చేయాలి.

ఆ మేరకు కలెక్టర్లు చొరవ చూపాలి.



*2). వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు:*


రాష్ట్రంలో మొత్తం 560 అర్బన్‌ క్లినిక్‌లు ఉండగా, వాటిలో 205 భవనాల రూపురేఖలు మారుస్తుండగా, కొత్తగా 355 భవనాలు నిర్మించాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం 519 భవనాల పనులకు మాత్రమే టెండర్లు పిలవడం జరిగింది.

ఇంకా ఇప్పటి వరకు కేవలం 127 భవనాల పనులు మాత్రమే మొదలయ్యాయి. 

కాబట్టి అన్నింటి పనులు టెండర్లు పూర్తి చేసి, వీలైనంత త్వరగా పనులు మొదలయ్యేలా చూడండి.

అందువల్ల కలెక్టర్లు వెంటనే దీనిపై దృష్టి పెట్టి, అన్ని భవనాల పనులు మొదలయ్యేలా చూడాలి.


*3). 90 రోజుల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు:*


ఇళ్ల స్థలాల పంపిణీ:

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ బాగా జరిగింది. అందుకు అందరినీ అభినందిస్తున్నాను.

కానీ టిడ్కో ఇళ్లకు సంబంధించి ఇంకా 4,220 పట్టాలు పంపిణీ (అగ్రిమెంట్‌ లెటర్లు) చేయాల్సి ఉంది.

దీంతో పాటు 17 వేల మంది కొత్త లబ్ధిదారులను ఇంకా గుర్తించాల్సి ఉంది. (మరణాలు, వలసలు, ఇళ్లు తీసుకోవడానికి ఇష్టపడని, అనర్హులకు సంబంధించి) కాబట్టి దీని మీద కలెక్టర్లు ధ్యాస పెట్టాలి.


90 రోజుల్లో ఇళ్ల స్థలాలు:

ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,19,053 అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగింది.

ఇంకా 98,834 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి.

ఇప్పటికే గుర్తించిన అర్హులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. 

వారిలో 10,752 మందిని ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 1,520 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. 

ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో వారికి 10 రోజుల్లో ప్రింటెడ్‌ పట్టాల పంపిణీ మొదలు పెట్టాలి.

ఇక మిగిలిన 1,06,781 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. వెంటనే దీనిపై దృష్టి పెట్టి, వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చొరవ చూపండి.

98,834 పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలన కూడా వెంటనే పూర్తి చేసి, అర్హులను గుర్తించాలి. వారి కోసం భూసేకరణ మొదలు పెట్టాలి.


ఇళ్ల నిర్మాణం:

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా, తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం.

వాటిలో పట్టణ ప్రాంతాల్లో 15.10 లక్షల ఇళ్లుండగా, మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం.

మిగిలినవి కోర్టు తగాదాల్లో ఉండగా, వాటికి ప్రత్యామ్నాయ నివేదికలను పీఎంఏవైకి పంపించడం జరిగింది.

వాటికి సంబంధించి వచ్చే నెలలోగా అనుమతి వచ్చే వీలుంది.

ఇక ఇప్పటికే అనుమతి పత్రాలు కూడా ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలు, మనం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు జూన్‌ 1న పనులు మొదలు పెట్టడం కోసం ఇంకా ప్రిపరేటరీ పనులు మిగిలిపోయాయి.

మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌ కొంత పెండింగ్‌లో ఉంది.

మొత్తం 742 లేఅవుట్లలో ఇంకా 520 లేఅవుట్లలో జియో ట్యాగింగ్‌ జరగలేదు. 

అలాగే ఇళ్ల సరిహద్దుల రాళ్లు పాతడం, వాటిని చదును చేయడం సహా, జియో ట్యాగింగ్‌ వెంటనే పూర్తి కావాలి.

మ్యాపింగ్, జియో ట్యాగింగ్, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయడం వంటి అన్ని ప్రిపరేటరీ పనులను ఈనెల 25వ తేదీలోగా కలెక్టర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలి.

ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణం జూన్‌ 1న ప్రారంభం అవుతుంది.


ఆ ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (బూస్టప్‌) మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి. 

స్టీల్, సిమెంట్‌ వినియోగం పెరుగుతుంది. మరోవైపు ఉపాధి దొరుకుతుంది. వీటన్నింటి వల్ల ఎకానమీ బూస్టప్‌ అవుతుంది.

ఎక్కడ ఇళ్ల నిర్మాణం చేయాలన్నా, నీటి వసతి తప్పనిసరి. ఎందుకంటే నీరు లేకపోతే అసలు ఇళ్లు కట్టడం సాధ్యం కాదు.

కాబట్టి అన్ని లేఅవుట్లలో నీటి కనెక్షన్లు ఉండేలా చూడండి. మొత్తం 8679 లేఅవుట్లలో నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది.

డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో కోఆర్డినేట్‌ చేసుకుని, వెంటనే నీటి సదుపాయం కల్పించాలి. ఆ పనులన్నీ ఈనెల 31లోగా పూర్తి చేయాలి.


అలాగే ప్రతి మండలం, మున్సిపాలిటీలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలి. వారు వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన జరపాలి. ఒకవేళ ఎక్కడైనా నోడల్‌ అధికారుల నియామకం జరగకపోతే, ఈనెల 15లోగా దాన్ని పూర్తి చేయాలి.

ఎందుకంటే ఇప్పటికే పొజెషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన 3.86 లక్షల ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టొచ్చు. 


ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా మోడల్‌ హౌజ్‌ నిర్మించాలి. వాటి నిర్మాణం కూడా తప్పనిసరిగా జూన్‌ 1న ప్రారంభం కావాలి. అప్పుడే మనకు నిర్మాణ వ్యయం కూడా తెలుస్తుంది.

సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్‌ కేబుళ్లు, నీటి సరఫరా వ్యవస్థ, ఫైబర్‌ కేబుళ్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టి పనులు చేయాలి.

ఆ మేరకు అన్నింటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వచ్చే నెల 20 కల్లా సిద్ధం చేసి, పంపాలి. 

ఇక జూన్‌ 1న పనులు మొదలవుతాయి కాబట్టి, అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా చూడండి. అప్పుడే నిరాటంకంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. 


*3). స్పందన. సమస్యల పరిష్కారం:*


స్పందన కార్యక్రమంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే మనం ఆ సమయం నిర్దేశించుకుని ఏం ప్రయోజనం? 

గత ఏడాది జూన్‌ 9 నుంచి ఈనెల 10వ తేదీ వరకు చూస్తే మనకు స్పందనలో మొత్తం 2,25,43,894 ఫిర్యాదులు, అర్జీలు రాగా, వాటిలో 85 శాతం సకాలంలో పరిష్కరించగలిగాం. 

ఆరోగ్యశ్రీ కార్డులు, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డులు, బియ్యం కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాలు.. ఇవన్నీ కూడా నిర్దేశించుకున్న సమయంలో పరిష్కరించాలి.

21 రోజుల్లో తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు, బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు ఇవ్వాలి.

అలాగే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చి తీరాలి.

ఈ విషయంలో ఏ మాత్రం రాజీ లేదు. ఎందుకంటే ఇవి సామాన్య ప్రజలకు సంబంధించినవి.


శానిటేషన్‌ విషయంలో నిర్ణీత వ్యవధి కంటే కొంత ఆలస్యం అవుతోంది. వచ్చిన అర్జీలలో 90 శాతం సకాలంలో పరిష్కరించినా మరో 10 శాతం ఆలస్యం అయ్యాయి.

శానిటేషన్‌లో క్వాలిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే 13 శాతం అర్జీలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి, అదే విధంగా వీధి దీపాలకు సంబంధించి 11 శాతం, తాగు నీటికి సంబంధించి 8 శాతం అర్జీలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి.  


శానిటేషన్, వీధి దీపాలు, తాగు నీరు:

ఈ మూడింటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

వాటికి సంబంధించి ఏ ఫిర్యాదు వచ్చినా చాలా వేగంగా స్పందించాలి. క్వాలిటీతో కూడిన సర్వీసు ఇవ్వాలి.

మొత్తం మీద.. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, పెన్షన్‌ కార్డులు. శానిటేషన్, వీధి దీపాలు, తాగు నీటితో పాటు, ఇంటి స్థలం.. ఈ ఏడు మనకు చాలా ముఖ్యం.


*4). ఖరీఫ్‌కు సన్నద్ధత:*


ఖరీఫ్‌ సాగు మొదలవుతుంది.

గ్రామాల్లో రైతులకు అండగా ఉండేలా మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

మనం ఇచ్చే విత్తనం మొదలు, ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉండాలి. అది ఓ రకంగా మనం ఇచ్చే అష్యూరెన్స్‌.

కాబట్టి కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు. ఆర్బీకేలను ఓన్‌ చేసుకుని, రైతులకు సేవలందించాలి.

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. వాటి స్టాక్‌ పాయింట్స్‌ ఒకసారి చెక్‌ చేసుకోండి,


మే 17న విత్తనాల సరఫరా ప్రారంభం.

వివిధ పంటలకు సంబంధించి మొత్తం 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాము.

కర్ఫ్యూలో వ్యవసాయం పనులు, సరుకుల రవాణాకు మినహాయింపు. కాబట్టి పూర్తి జాగ్రత్తలతో అన్ని పనులు చేసుకోవాలి.


*వీటిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి:*

మరో రెండు, మూడు విషయాలు. కలెక్టర్లు ధ్యాస పెట్టాలి.

ప్రతి జిల్లాలో కలెక్టర్లు నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. 

జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆ పని చేయాలి.


వ్యవసాయ సలహా కమిటీలు. జిల్లా, మండల, గ్రామ (ఆర్బీకేల) స్థాయిలో వెంటనే అన్ని చోట్ల ఏర్పాటు కావాలి.

ఎందుకుంటే గ్రామ స్థాయిలో పంటల ప్లానింగ్‌ మొదలు, ప్రతి అడుగులో ఈ కమిటీలు రైతులతో కలిసి పని చేయాలి.

క్రాప్‌ ప్లానింగ్‌లో వ్యవసాయ సలహా కమిటీలది చాలా కీలక పాత్ర. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆ కమిటీలు చూపాలి.


అదే విధంగా జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కూడా కలెక్టర్లు ఏర్పాటు చేయాలి.

అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది.

రూ.1.13 లక్షల కోట్ల పంట రుణాలు టార్గెట్‌. అది జరగాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. 


*ఈనెలలో కార్యక్రమాలు:*

– మే 13న రైతు భరోసా చెల్లింపు.

దాదాపు 52.50 లక్షల రైతులకు ఈసారి చెల్లింపు. రూ.7500 చొప్పున ఖాతాల్లో జమ.

ఖరీఫ్‌లో సాగు పెట్టుబడి కింద. దాదాపు రూ.4 వేల కోట్ల వ్యయం.

గ్రామాల్లో ఇప్పటికే సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిటింగ్‌) జరుగుతోంది. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.


– మే 25న ఖరీఫ్‌–2020కి సంబంధించిన క్రాప్‌ ఇన్సూరెన్సు చెల్లింపు. దాదాపు 38 లక్షల రైతులకు దాని వల్ల ప్రయోజనం.

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వారి సాగుకు ఆ సహాయం తోడుగా నిలుస్తుంది.


– మే 18న వైయస్సార్‌ మత్స్యకార భరోసా. 

లక్షకు పైగా మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సహాయం.

చేపలవేట నిషేధ సమయంలో ఇచ్చే మొత్తం. దీనిపైనా సోషల్‌ ఆడిటింగ్‌ జరుగుతోంది.

అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమం ముగించారు.


డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాసరావు (నాని), మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణితో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments