జి. కొండూరు పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు ప్రభుత్వానికి సరెండర్... కలెక్టర్ ఇంతియాజ్విజయవాడ (ప్రజా అమరావతి);జి. కొండూరు పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు ప్రభుత్వానికి సరెండర్...

కలెక్టర్ ఇంతియాజ్
విధుల్లో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు నేపథ్యంలో కృష్ణా జిల్లా డిఎం అండ్ హెచ్ఓ జి. కొండూరు పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు ను ప్రభుత్వానికి సరండర్ చెయ్యడం జరిగిందని  కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న  మెడికల్ ఆఫీసర్ డా.ఎన్. రాజు పై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంచాలకులు, ప్రజా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, గొల్లపూడి వారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా డి ఎమ్ అండ్ హెచ్ ఓ డా.ఎం.సుహాసిని ఈ రోజు డైరెక్టరేట్ కు సరెండర్ చేసారని తెలిపారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్  హెచ్చరించారు.