అమరావతి (ప్రజా అమరావతి);
‘స్పందన’లో భాగంగా జిల్లాల కలెక్టర్లతో సీఎం శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్:
*కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, స్పందనకు వచ్చిన వినతులు, ఖరీఫ్‌కు సన్నద్ధతపై సీఎం సమగ్ర సమీక్ష*:
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే..:*
*ఆ ఘటన కలిచి వేసింది:*
కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం : సీఎం శ్రీ వైయస్.జగన్
బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి: సీఎం
నిన్న (సోమవారం రాత్రి) తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచి వేసింది: సీఎం
ఆ ఘటనతో నాకు చాలా బాధ వేసింది:
మనం ఎంత బాగా కష్టపడుతున్నా కూడా, బాగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తోంది:
నిన్న (సోమవారం రాత్రి) జరిగిన ఘటన కూడా అలాంటిదే :
తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందు వలన, ఆక్సిజన్ కొరత ఏర్పడింది:
దీనివల్ల 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు :
ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే... నిన్న (సోమవారం) కూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం:
రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్ లిఫ్ట్ చేశాం:
అక్కడ ఆక్సిజన్ నింపి.. రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం:
విదేశాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసి.. షిప్స్‌ద్వారా తెప్పిస్తున్నాం:
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పడు మనం ఉన్నాం:
ఇంత సమష్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని మన చేతుల్లోలేని అంశాల వల్ల, కొన్ని నష్టాలు జరుగుతున్నాయి:
*పరీక్షా సమయం:*
ఇది మనకు పరీక్షా సమయం:
కలెక్టర్లందరికీ కూడా చెప్తున్నా... జరిగిన ఘటనపట్ల మీరు సడలిపోవాల్సిన పని లేదు, కాని అత్యంత అప్రమత్తత, జాగరూకతతో వ్యవహరించాలి:
ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది:
కోవిడ్ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో, సానుభూతితో ఎదుర్కోవాల్సి ఉంది:
*దురుద్దేశంతో దుష్ప్రచారం:*
రాష్ట్రంలో కావాలనే రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని దుష్ప్రచారం చేస్తున్నారు:
ఇవి ఏస్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం:
వ్యాక్సిన్ల పరస్థితి ఏంటో రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు:
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులు :
ఈ విషయం అందరికీ తెలుసు:
ప్రతిపక్ష నాయకులకీ తెలుసు, ప్రతిపక్షం అధికారంలో లేదని జీర్ణించుకోలేక, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయ పడే ఎల్లో మీడియాకు తెలుసు:
*వ్యాక్సిన్ల ఉత్పత్తి–డిమాండ్:*
దేశంలో నెలకు వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం 7 కోట్ల డోసులు అయితే ఇందులో
6 కోట్ల డోసులు కోవీషీల్డ్‌ను సీరం ఇనిస్ట్యూట్ తయారు చేస్తుంటే, కోటి డోసులు భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తోంది:
ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. భారత్ బయోటెక్ అన్నది ఎవరిది అంటే.. సాక్షాత్తూ ఈ చంద్రబాబుగారి బంధువుది, సాక్షాత్తూ రామోజీరావు గారి కొడుకు వియ్యంకుడిది:
అక్కడ ఏం జరుగుతోందన్న సంగతి వీళ్లందరికీ తెలుసు :
దేశంలో నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే తయారయ్యే పరిస్థితి ఉంటే, దేశం మొత్తానికి ఇప్పటివరకూ ఇచ్చిన డోసులు కేవలం 17 కోట్లు మాత్రమే:
దేశం మొత్తం అవసరాలను చూస్తే.. 45 ఏళ్లకు పైబడిన వాళ్లు 26 కోట్ల జనాభా, వారి లెక్కల ప్రకారమే:
వీరికి 2 డోసులు చొప్పున 52 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది:
18 నుంచి 45 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్లు మరో 60 కోట్లు ఉన్నారు. వారికి రెండు డోసులు చొప్పున మొత్తం 120 కోట్ల డోసులు ఇవ్వాలి:
అంటే 120 కోట్ల డోసులు, 52 కోట్ల డోసులు కలుపుకుంటే 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే.. ఇప్పటి వరకూ కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే ఇవ్వగలిగాం:
అంటే 10 శాతం లోపు మాత్రమే ఇవ్వగలిగాం:
*రాష్ట్రంలో ఆ డిమాండ్:*
ఇక మన రాష్ట్రం విషయానికొస్తే 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవారు, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కలుపుకుని రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు:
వీరికి 2 డోసులు చొప్పున దాదాపుగా 3 కోట్లు డోసులు ఇవ్వాలి:
అదే రకంగా 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారు రాష్ట్రంలో 2 కోట్ల మంది సుమారుగా ఉన్నారు:
వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం:
అంటే 18 ఏళ్ల పైబడి రాష్ట్రంలో ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది:
ఇప్పటివరకూ కేవలం 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి:
ఇవాళ ఈ పరిస్థితి ఉందని అందరికీ తెలుసు:
*కొంటామన్నా ఇవ్వడం లేదు:*
వ్యాక్సిన్ కంపెనీలు కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా వాళ్లు తీసుకోవడంలేదు:
మాకు సప్లై చేయండని చెప్పినా కూడా చేయడం లేదు:
ఎందుకంటే ఇవన్నీకూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నడుస్తున్నాయి:
*కేంద్రమే స్పష్టం చేసింది:*
కేంద్ర సుప్రీంకోర్టుకు అఫడవిట్ కూడా నిన్న దాఖలు చేసింది:
రాష్ట్రాలు ఎంత కొనుగోలు చేయాలంటే అంత వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదు అని కేంద్రం తన అఫడవిట్‌లో పేర్కొంది:
వ్యాక్సిన్ కంపెనీలు మా నియంత్రణలోనే సాగాలి అని చెప్పింది:
మేం ఎంత కోటా కేటాయిస్తే... ఆ కోటా మేరకు వ్యాక్సిన్ కంపెనీలు ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలి, అంతకన్నా ఎక్కవ ఇవ్వకూడదు, డబ్బులు ఇచ్చే రాష్ట్రమైనా, డబ్బులు ఇవ్వని రాష్ట్రమైనా ఒకే మాదిరిగా ఉండాలని
జనాభా ప్రాతిపదికన కోటాను నిర్దారిస్తామని, ఆకోటా మేరకు కంపెనీలు వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని ఏకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫడవిట్ కూడా వేసింది:
*బాధ్యతారహిత విమర్శలు:*
ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి కూడా.. ప్రతిపక్ష నాయకుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటివి చేస్తున్న ప్రచారాలు చూస్తే ఇవాళ కూడా నాకు బాధ అనిపిస్తోంది:
వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఆంధ్రరాష్ట్రం ఇస్తామని చెప్పింది, వ్యాక్సిన్లకు రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి మనసు రావడంలేదు, కమీషన్ల కోసమని చెప్పి.. ఇలా చేస్తున్నారంటూ చాలా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు:
ఆ బాధ్యతా రహితంగా మాట్లాడే మాటలను మళ్లీ ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికల్లో వేస్తారు:
వాళ్లవే వ్యాక్సిన్ కంపెనీలు, ఇదే రామెజీరావు కుమారుడు వియ్యంకుడిదే కంపెనీ:
చంద్రబాబునాయుడుకు తెలుసు తన బంధువులదే కంపెనీ అని:
అక్కడ ఏం జరుగుతుందో వీరికి తెలుసు:
అయినా కూడా వక్రీకరించడానికి, ప్రభుత్వంమీద దుష్ప్రచారం చేయడానికి, కలెక్టర్లమీద దుష్ప్రచారం చేయడానికి, ప్రజల్లో అలజడిని సృష్టించడానికి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సందేశాన్ని అందిస్తున్నారు:
*గొప్పగా చెప్పగలం:*
వ్యాక్సినేషన్ కానివ్వండి, హెల్త్‌కేర్‌కానివ్వండి, ఆక్సిజన్ సప్లై కానివ్వండి... ఎక్కడా కూడా దేశంలో జరగని విధంగా ప్రజలకు సేవలందిస్తున్నాం:
ఈవిషయాన్ని గొప్పగా, గర్వంగా కూడా చెప్పగలుగుతాం:
ఎందుకంటే.. రాష్ట్రానికి టయర్ –1 సిటీ లేదు :
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు లేకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అదించగలుగుతున్నాం:
కోవిడ్ కారణంగా మరణాల రేటు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాం:
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్‌గా ఉన్నాం:
కారణం.. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్, వాలంటీర్ స్థాయి వరకూ ఎంతో కమిట్‌మెంట్‌గా, ఎంతో చిత్త శుద్దితో పని చేస్తున్నాం, అందుకే ఈఫలితాలు వస్తున్నాయి:, సిబ్బంది పనితీరు పట్ల చాలా గర్వపడుతున్నా:
అయినా సరే కొన్ని కొన్ని ఘటనలు జరుగుతున్నాయి:
*సానుభూతితో పని చేద్దాం:*
ఇన్ని మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొందరు రాజకీయ నాయకులు, ఎల్లోమీడియా యాజమాన్యాలు ఉంది, వీరందరినీ మనం ఎదుర్కోవాల్సి ఉంది:
మరింత అప్రమత్తంగా ఉందాం, మరింత మానవత్వంతో సేవలు అందిద్దాం. సానుభూతితో పనిచేద్దాం:
మన బాధ్యత కాకపోయినా.. మానవత్వంతో:
నిన్నటి ఘటనలో మరణించిన వారందరికీ పరిహారం ఇస్తున్నాం:
మన తప్పు కాకపోయినా, పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్ సకాలానికి రాకపోయినా సరే ... బాధ్యత తీసుకుని నిన్నటి రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం:
వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వండి, వారి బాసటగా ఉండండి:
తప్పు ఎవరి వల్ల జరిగినా తప్పు జరిగింది:
ఇలాంటి తప్పులు మళ్లీ జరక్కుండా... భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి:
మన ప్రభుత్వంలో తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు :
*పూర్తి పారదర్శకత:*
ప్రతి అడుగులోనూ పారదర్శకంగా వ్యవహరించే ప్రభుత్వం మనది:
దేశంలో ఎలా ఉన్నా సరే... మన రాష్ట్రంలో పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేశాం:
కోవిడ్ టెస్టుల్లో కాని, ట్రీట్ మెంట్‌లో కానీ దేశం మొత్తానికి మనం ఎంత పారదక్శకంగా వ్యవహరిస్తున్నామో చూపించాం:
ప్రతి అడుగులోనూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం:
*రూ.1600 కోట్లకు వెనకాడతామా?:*
ఈ 23 నెలల కాలంలోనే ఒక్క బటన్ నొక్కితే ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా రూ.87వేల కోట్ల రూపాయలు పేదలకు, అర్హులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి పంపించగలిగాం:
పేదలకు రూ.87వేల కోట్లు ఖర్చు చేసిన ఇలాంటి ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడుతుందా?
అయినా విమర్శలు చేస్తున్నారు. ఇంతటి దారుణమైన వ్యవస్థలో మనం ఉన్నాం:
అయినా సరే మనం మరింత మానవత్వంతో పనిచేయాల్సిన అవసరం ఉంది:
*ఆ వ్యవస్థను ఓన్ చేసుకోవాలి:*
104 వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి:
104కు అనుసంధానంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వ్యవస్థ ఉండాలి:
104కు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదనే మాట రాకూడదు :
సంబంధిత జేసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలి:
104కు కాల్‌చేస్తే మంచి సేవలు అందుతున్నాయనే ప్రజలు భావించాలి:
మందులు ఇవ్వడం, క్వారంటైన్ సెంటర్లో చేర్పించడం, ఆస్పత్రుల్లో బెడ్‌లు ఇవ్వడం ఇవన్నీకూడా మన బాధ్యత:
మొదటసారి దేశంలో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్సను పూర్తి ఉచితంగా ఇస్తున్నాం:
104కు కాల్‌చేస్తే ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది:
104 ద్వారా 16 నుంచి 17వేల కాల్స్ వస్తున్నాయి :
కాల్స్ రిసీవ్‌చేసుకునే కెపాసిటీని కూడా పెంచాం:
దీనికి అనుగుణంగా జిల్లాల్లో అనుసంధాన వ్యవస్థల్లో వనరులను పెంచుకోవాల్సి ఉంటుంది:
*ఆ విధంగా భావించాలి:*
మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన ఆశిస్తామో... .అలాంటి స్పందనే యంత్రాంగం నుంచి ఉండాలి:
టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్, ట్రాన్స్‌పోర్టేషన్.. .ఇవన్నీకూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలి:
3 గంటల్లోకి వారికి సేవలందించే బాధ్యతలను తీసుకోవాలి:
*బెడ్లు–సీసీసీలు:*
ఏపీలో 648 ఆస్పత్రులను ఎంప్యానెల్ చేశాం:
47,947 బెడ్లను అందుబాటులోకి తీసుకు వచ్చాం, 41,315 బెడ్లు భర్తీలో ఉన్నాయి:
ఆస్పత్రి ఆవరణ లో టెంపరరీ జర్మన్ హాంగర్స్‌ను ఏర్పాటు చేయాలి:
దీనివల్ల ఆస్పత్రిలో వేచిచూసే పరిస్థితులు ఉండవు, డాక్టర్లు కూడా వెంటనే వచ్చి వైద్యం చేసే అవకాశం ఉంటుంది:
దీంతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం:
కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఆక్సిజన్ సప్లై అవసరమైనంత మేరకు ఏర్పాటుచేసే ఆలోచనలు అధికారులు చేయాలి:
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల కొనుగోలుపై దృష్టిపెట్టింది:
త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయి:
*వాటిని చెక్ చేయండి:*
ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్ పైపులైన్లను పర్యవేక్షణ చేయండి:
టెక్నికల్ స్టాఫ్‌ను కచ్చితంగా నియమించండి:
నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్ వెళ్లేలా చేయాలి:
అలాగే ఐసీయూలోకూడా ప్రెజర్ బూస్టర్స్‌కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలన చేయండి:
*ముగ్గురు అధికారులకు ఆ బాధ్యతలు:*
కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలనుంచి మనకు ఆక్సిజన్ వస్తోంది:
మూడు రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను పంపిస్తున్నాం:
ఆక్సిజన్ సప్లై పెంచడానికి వీరు దృష్టి పెడతారు:
తమిళనాడుకు కరికాల వలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు ఏకే పరీడాను పంపిస్తున్నాం:
రేపటి నుంచి ఈ వ్యవస్థ పని చేస్తుంది:
*కలెక్టర్లు–మరిన్ని బాధ్యతలు:*
అలాగే జిల్లాల్లో ఆక్సిజన్ వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలి:
ఎస్‌ఓఎస్.. ఎమర్జెన్సీ మెసేజ్ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలి:
ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలి:
కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే... సమర్థవంతంగా ముందుకు సాగే అకాశం ఉంటుంది:
అలాగే జిల్లాల్లో స్టోరేజీ కెపాసిటీలు కూడా ఎక్కడైనా ఉన్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి:
ఎక్కడైనా పరిశ్రమలు ఉన్నాయా? వాటికి సదుపాయాలు ఉన్నాయా? అన్నదానిపై దృష్టిపెట్టాలి:
ఇప్పటికే నేవీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్తున్నాయి:
ఈ సమయంలో వారు చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు:
నేవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను:
నేవీ బృందాల సేవలను బాగా వినియోగించుకోండి:
కోవిడ్ వైద్యం కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకున్నాం:
మంచి ఆహారం అందుతోందా? లేదా? పరిశుభ్రంగా ఉంచుతున్నారా? లేదా? మందులు సక్రమంగా అందుతున్నాయా? రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?అలాగే సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారా? లేదా? చూడండి:
ఈ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఆరోగ్య మిత్ర ఉండేలా చూసుకోండి:
సమస్యలు ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి నంబర్‌ను ఉంచండి:
అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోకూడా 50శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని కోరాం:
దీన్ని కూడా పర్యవేక్షణ చేయాలి:
ఇక్కడకూడా అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా?చూడాలి:
వారికి కావాల్సిన మందులు, ఆక్సిజన్ తదితర వాటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలి:
*నోడల్ ఆఫీసర్లు:*
ప్రతి 2–3 ఆస్పత్రులకు ఒక నోడల్ ఆఫీసర్ కచ్చితంగా ఉండాలి:
648 ఆస్పతులకూ కచ్చితంగా నోడల్ అధికానులను నియమించాలి:
ఆరోగ్య శ్రీ,, ఆక్సిజన్ సప్లై, ఆస్పత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్‌క్వాలిటీ దీనిమీద నోడల్ అధికారులు దృష్టిపెట్టాలి:
మనకు నివేదికలు కూడా అందిస్తారు:
ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతరం తనిఖీలు చేపట్టాలి:
వైద్యులను కూడా వెంటనే నియమించాలి:
దీనికోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను వెంటనే నిర్వహించండి:
*కర్ఫ్యూ:*
మనం కర్ఫ్యూ కూడా విధించాం:
ఉదయం 6 గంటలు నుంచి 12 గంటలు వరకు ప్రజలు వారి వారి పనులు చేసుకోవచ్చు:
అదే సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి:
భౌతిక దూరం పాటించాలి, మాస్కులు వేసుకోవాలి:
12 గంటలు దాటిన తర్వాత మినహాయింపులు ఉన్నవారు తప్ప మిగిలిన వారు కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలి:
12 గంటలు దాటిన తర్వాత నూటికి నూరుశాతం కర్ఫ్యూ పాటించాలి:
*దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి:*
వ్యాక్సినేషన్‌కు సంబంధించిన దుష్ప్రచారాన్నికూడా ప్రతి సందర్భంలో కూడా తప్పికొట్టాలి:
ప్రజలను రెచ్చగొట్టి, వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ... ప్రజలు వాక్సినేషన్ కేంద్రాల వద్ద వద్ద గుమిగూడే పరిస్థితిని సృష్టిస్తున్నారు:
అందరికీ ఉచితంగా టీకా అందుతుందని స్పష్టంగా చెప్పండి:
*ప్రజలకు అవగాహన కల్పించండి:*
వ్యాక్సిన్ల కొరత ఉంది కాబట్టి, కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపులు ప్రకారం వాక్సిన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి, మీ వంతు వచ్చేంతవరకూ ఓపిగ్గా ఉండాలని ప్రజలకు చెప్పాలి:
45 ఏళ్లకు పైబడి రెండో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది:
33 లక్షలకు పైగా వీరు ఉన్నారు :
ఈ నెలలో వీరికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది:
లేకపోతే మొదటి డోసు వేసుకున్నా ప్రయోజనం ఉండదు:
వీళ్లకి మొదటి వేశాక, 45 ఏళ్ల పైబడి ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే వారికీ కంప్లీట్ చేస్తాం:
వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది:
వచ్చే సరఫరాను బట్టి.. ప్రజలకు ప్రాధాన్యతక్రమంలో అందిస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి:
అని సీఎం శ్రీ వైయస్ జగన్ వివరించారు.
డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణితో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment