గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ చేయూతవిజయవాడ (ప్రజా అమరావతి);గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ చేయూతప్రభుత్వ ఆసుపత్రికి 100 ఆక్సీజన్  సీలిండర్స్ వితరణ

-  జి జి హెచ్ పర్యవేక్షకులు డా.కె.శివశంకర్


కరోనా రోగులకు చికిత్స అందించడంలో ఎంతో కీలకమైన ఆక్సిజన్ కొరత నివారణకు ముందుకొచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రాణదాతగా నిలిచారని విజయవాడ జీజీహెచ్ సూపరిండెంట్  శివశంకర్ పేర్కొన్నారు.


ఆదివారం స్థానిక 

జీజీహెచ్ ఆసుపత్రికి గన్నవరం శాసనసభ్యులు తరపున 100 ఆక్సిజన్ సీలిండర్స్ ను అందచేశారు.ఈ సందర్భంగా డా. శివశంకర్ వివరాలు తెలుపుతూ,  కొవిడ్ బాధితులకు నిర్విరామంగా సేవలందిస్తున్న జీజీహెచ్ కు ఆక్సిజన్ కొరత రాకూడదనే ముందుచూపుతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 100 ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చారన్నారు.  రాష్ర్టంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో, తన సొంత నిధులతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో సిలిండర్లు వచ్చేలా గౌరవ శాసన సభ్యులు వంశీ గారు చొరవ తీసుకున్నారని తెలిపారు.

సరిఅయిన సమయంలో   స్పందించి తన వంతు  సామాజిక బాధ్యతగా ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు వితరణగా ఇవ్వడం ఆయన వ్యక్తిత్వానికి  ఒక గొప్ప నిదర్శనం అన్నారు.  సేవలో తనకు ఎవరూ సాటి రారని మరోసారి నిరూపించుకున్నారని పలువురు పేర్కొన్నారు. ఆదివారం ఈ సిలిండర్లను గన్నవరం నియోజకవర్గ వైకాపా నాయకులు అనగాని రవి, ఓలుపల్లి మోహనరంగా, రామవరప్పాడు సర్పంచ్ వరి శ్రీదేవి, మోదుగుమూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి వర్గాలకు అందజేశారు.  కార్యక్రమంలో జీజీహెచ్ ఈఈ పురుషోత్తమ్, డీఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు.