మచిలీపట్నం: మే 30 (ప్రజా అమరావతి);
వైద్య కళాశాల ఏర్పాటతో మారనున్న మచిలీపట్నం రూపురేఖలు !!
వైద్య విద్యను అందించి, వైద్యుల్ని సుశిక్షితుల్ని చేసే విద్యాలయంకు మచిలీపట్నంలో నేడు అంకురార్పరణ జరగనుంది. కృష్ణాజిల్లా విజయవాడ లోనే సిద్ధార్ధ వైద్య కళాశాల, పిన్నమనేని సిద్దార్ధ వైద్య విజ్ఞాన సంస్థలు రెండు నెలకొల్పబడ్డాయి. వైద్య విద్య అంటే కోటి అరకోటి డొనేషన్లు కట్టిన గొప్పింటి పిల్లలు మాత్రమే చదువుకొనే ఖరీదైన చదువు అని చాలామంది భావిస్తారు. టౌన్ సాధారణ గ్రామీణ ప్రాంతాల విద్యార్థినీ విద్యార్థులకు అపారమైన తెలివితేటలూ బహు మేధస్సు ఉన్నా మెడిసిన్ చదవే అవకాశాలు లేక తమ అదృష్టం ఇంతేనని నిరాశతో సాధారణ డిగ్రీలు చదువుకొనే పరిస్థితులు ఉండేవి .
రెండేళ్ల క్రితం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేయడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చదువుకొనేవారికి చదువుకున్నంత విస్తృత అవకాశాలు నలుమూలలు లభ్యం కావడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు వచ్చాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య కళాశాలల నిర్మాణం జరగనుంది. వైద్య కళాశాలల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు. కడప జిల్లా పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైద్య కళాశాలకు రూ.500 కోట్లు మంజూరయ్యయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాలకు రూ.550 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కళాశాలల్లో ఒక్కోచోట 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి.
1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఆరు దశాబ్దాల కాలంలో 11 వైద్య కళాశాలలు నెలకొల్పబడితే, జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్ల కాలంలో 16 మెడికల్ కాలేజీలు మంజూరు కావడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సుపరిపాలనను కీర్తిస్తున్నారు. 14 నూతన వైద్య కళాశాలల పనులకు సిఎం తన స్వహస్తాలతో మే 31 వ తేదీ (సోమవారం) వర్ట్యువల్ విధానంలో శంకుస్థాపన చేయడం ఒక గొప్ప పరిణామం. మచిలీపట్నం మెడికల్ కళాశాలకు రూ.550 కోట్లతో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తికాబడ్డాయి మచిలీపట్నం వైద్య కళాశాలకు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మెడికల్ కాలేజీ గా నామకరణం చేశారు. మరో రెండు మూడు సవత్సరారాలలో తెల్లటి కోట్లు మెడలో స్టెతస్కోప్ వేసుకొని హడావిడిగా తిరిగే విద్యార్థినీ విద్యార్థులను మనం ఇక్కడ చూడనున్నాం.
బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ని సంక్షిప్తంగా ఎంబిబిఎస్ అంటారు. ఎంబిబిఎస్ రెండు మొదటి ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు. యునైటెడ్ కింగ్డమ్ సంప్రదాయమును అనుసరించి వివిధ దేశాలలోని యూనివర్సీటీ వైద్య కళాశాలలు ఔషధ, శస్త్రచికిత్సలో ఈ డిగ్రీ పట్టాలను పట్టభద్రులకు ప్రదానం చేస్తాయి. భారతదేశంలోని వైద్య కళాశాలలు భారత వైద్య మండలి ద్వారా ధృవీకరణ పొందుతాయి, ఇవన్నీ ఎంబిబియస్ టైటిల్ తో డిగ్రీలను ప్రదానం చేస్తాయి. విద్యార్థులు డిగ్రీ కోసం దరఖాస్తు చేసే ముందు తప్పనిసరిగా రోటాటరీ ఇంటర్న్షిప్ ఒక సంవత్సరమును అనుసరించి నాలుగున్నర సంవత్సరాల కోర్సును పూర్తిచేయాలి.
సాధారణంగా వైద్య కళాశాలలు వైద్యంలో డిగ్రీ కోర్సును, మాస్టర్స్ కోర్సును, పి.హెచ్.డి. సదుపాయాన్ని అందజేస్తాయి. ఇంతే కాకుండా వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులను కూడా బోధిస్తాయి. వైద్య కళాశాలలకు అనుబంధంగా హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి ఆ విధంగా దోహదపడనుంది. వైద్యకళాశాలలో దేశం నలుమూలల నుంచి ఉద్దండులైన ప్రొఫెసర్లు మచిలీపట్నంలో ఇకపై కనబడనున్నారు. ప్రాథమిక శాస్త్రం, పారా క్లినిక్, క్లినిక్ విభాగాలు, పెద్ద స్థాయి ఆధునిక చికిత్సా విభాగాలు అనుభవ్జ్ణులైన నిపుణులుతో మచిలీపట్నం వైద్య కళాశాలలో ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకునేందుకు వచ్చిన మెడికోలకు హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం (ఆబ్స్‌టెట్రిక్స్, గైనకాలజీ), ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం (ఇంటర్నల్ మెడిసిన్), కుటుంబ వైద్యం, శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం) తదితర సబ్జక్ట్స్ బోధిస్తారు. ఇవే కాకుండా మచిలీపట్నం వైద్య కళాశాలలో గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి విషయాలకు సంబంధించిన విద్యాబోధనలకై ప్రత్యేక విభాగాలుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా వైద్యకళాశాలలో ప్రవేశానికి అర్హతలు, ప్రవేశ విధానం, బోధనా విధానం, కోర్సు ప్రణాళిక వంటి విషయాలలో పెక్కు వైవిధ్యాలున్నాయి. భారతదేశంలో వైద్య కళాశాలలో ప్రవేశం సిబిఎస్ఇ లేదా ఇంటర్మీడియెట్ విద్యల తరువాత అనుమతించబడుతుంది. కాని ప్రవేశానికి గుర్తింపబడిన ప్రవేశపరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఈ పరీక్షలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది.
addComments
Post a Comment