వైఎస్ఆర్ ఏపీ వన్ గొడుకు కిందకు అన్ని శాఖలు : పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


అమరావతి (ప్రజా అమరావతి);



వైఎస్ఆర్ ఏపీ వన్ గొడుకు కిందకు అన్ని శాఖలు : పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


నైపుణ్యం వల్లే యువతకు ఉద్యోగాలు


పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలకు వారధి నైపుణ్య శాఖ


రెండు శాఖలను ఏకతాటిపైకి తీసుకువచ్చే అంశాలపై చర్చించిన నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ మంత్రి


పరిశ్రమలు, నైపుణ్య శాఖల సంగమంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజంటేషన్


నైపుణ్య, పరిశ్రమల శాఖలలోనే కాకుండా ఇతర శాఖలలో స్కిల్లింగ్ పైనా వర్కౌట్ చేస్తామన్న నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి



 కరికులం అనేది ఎప్పటికప్పుడు పరిశ్రమలు, నవతరం అవసరాలను బట్టి ఉండాలి


సమగ్ర పరిశ్రమ సర్వే, కౌన్సెలింగ్, స్కిల్లింగ్, ప్లేస్ మెంట్స్, రీ స్కిల్లింగ్ లపై మంత్రి ప్రజంటేషన్


పరిశ్రమలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అను చట్టం అమలుపై అన్ని శాఖల సమన్వయం


దీనిపై నోడల్ అధికారిగా జిల్లా ఎంప్లాయ్ మెంట్ అధికారి


పాలసీ తయారీ, పర్యవేక్షణలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ


ఈ ప్రక్రియను పరిశీలించేందుకు, ఎప్పటికప్పుడు నివేదికలు అందించడానికి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు


రీ స్కిల్లింగ్ లో భాగంగా శిక్షకులకు శిక్షణ, అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై చర్చ


జాబ్ మేళా , శిక్షణ ఏజెన్సీల ద్వారా  జిల్లా స్థాయి ప్లేస్ మెంట్లు, అప్రెంటిషిప్,  ఓవర్సీస్ ప్లేస్ మెంట్ల గురించి చర్చించిన నైపుణ్యశాఖ మంత్రి మేకపాటి


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి మంత్రి  మేకపాటి అధ్యక్షతన జరుగుతున్న వర్చువల్ సమావేశం


సమగ్ర పరిశ్రమ సర్వే గురించి మంత్రి ఆరా


కోవిడ్19 కారణంగా కొన్ని ఇబ్బందులున్నా సర్వే కొనసాగిస్తున్నట్లు వెల్లడించిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు


2017లో నైపుణ్య కొరతపై సర్వే జరిగింది


సిమెంట్, ఆటోమేటివ్, నిర్మాణ రంగాలు సహా మొత్తం 10 రంగాలపై పరిశీలించిన అనంతరం నైపుణ్య కోర్సులు ఎంపిక చేశాం


తయారీ కోసం భవిష్యత్ లో సాంకేతికతపైనా పరిశీలన


నైపుణ్యంపై బెంచ్ మార్కు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను సంప్రదించాం, చర్చించాం


హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్,  ఐ.టీ శాఖ జాయింట్ సెక్రటరీ నాగరాజ, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీఎస్ ఎండీ బంగారు రాజు, నైపుణ్య శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీ. హనుమా నాయక్, రామకోటి రెడ్డి, నైపుణ్య శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ సత్యప్రభ, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీ.ఆర్.వీ.ఆర్ నాయక్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్,  సాంకేతిక విద్యా కమిషనర్ నాయక్,  టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, నైపుణ్యశాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, ఉపాధి, శిక్షణకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు , ఏపీ ఈడీబీ ప్రతినిధులు, సీడాప్ సీఈవో మహేశ్వర్ రెడ్డి,  ఓమ్ క్యాప్ ప్రతినిధి స్వామి, బీసీజీ ప్రతినిధి శివ, ఇతర అధికారులు.



Comments