మానవత్వం ప్రదర్శించిన ….... జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.




 మానవత్వం ప్రదర్శించిన ….... జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.



కర్ణాటక రాష్ట్రం  బళ్ళారి  నుండి వచ్చిన ఒక కరోనా పేషంట్ కు సిరియస్ గా ఉండడంతో పోలీసు వేల్పేర్ హాస్పిటల్ నుండి ఆక్సిజన్ సిలిండర్ ను తెప్పించి ఇచ్చిన జిల్లా ఎస్పీ. 



తెలంగాణ రాష్ట్రం నుండి రోజూకు కర్నూలు నగరంలో వివిధ హాస్పిటల్స్ కు వందల సంఖ్యలో  కరోనా పేషంట్లు వస్తుండడంతో మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నాం. 




కర్నూలు , మే 14 (ప్రజా అమరావతి). పుల్లూరు టోల్ గేట్ వద్ద నిలిచిన అంబులెన్స్ లలో ఆక్సిజన్ సిలిండర్లు చివరిదశలో ఉన్న విషయం తెలుసుకుని స్వయంగా జిల్లా ఎస్పీ గారు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళి అంబులెన్స్ ల వారికి శుక్రవారం అందజేశారు.



ప్రాణ ప్రాయంలో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందించడంతో వారికి ప్రాణపాయస్ధితి తప్పిపోయింది.



రోగుల ఆరోగ్య పరిస్ధితి గురించి తెలుసుకున్నారు. 


ప్రాంతాలు, కుల, మతాలు ఏవి మానవత్వానికి అడ్డు రావని ఎస్పీ గారు తెలిపారు.



ప్రాణప్రాయంలో ఉన్న వారిని కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి ఇచ్చామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.



 ఏవరైనా కూడా  మానవత్వంతో వ్యవహరించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.



జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

Comments