శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధినాయకుడే కాదు.. సరిహద్దు సైనికుడు,గొప్ప దేశ భక్తుడు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్ వన్ గా శ్రీసిటీలో క్రయోజెనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ :పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళిక : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
'ఆర్ఐఎన్ఎల్' ద్వారా విశాఖపట్నంలో 1000 పడకల ఆసుపత్రి.
మొదటి విడతలో భాగంగా ఇవాళ 200 బెడ్లు ప్రారంభం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీసిటీని క్రయోజనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ గా గుర్తించింది.
క్రయోజనిక్ సదుపాయాలతో మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్.
కోవిడ్ నియంత్రణలో భాగంగా గత నెల రోజులుగా ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు సామాన్యమైనవి కాదు.
కరోనా విజృంభన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.
రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు.
ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా వైద్య సదుపాయాల కల్పనకు పెద్దపీట.
గత రెండేళ్లుగా కరోనా నియంత్రణ విషయంలో ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ముందు ఉండడం హర్షణీయం.
ఇరవై రోజుల ముందు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ సర్ ప్లస్ లో ఉండడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనం.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా అధికార యంత్రాంగం, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,తదితరులకు అభినందనలు.
ఇకపై వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ.
దేశానికి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ యూఎస్ లో ఒప్పందాలు.
ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం, టెక్నాలజీని బట్టి ఖర్చు.
జీజీహెచ్లో శంకుస్థాపన చేసిన ఆక్సిజన్ ప్లాంట్ కి అయ్యే ఖర్చు రూ.1.2 కోట్లు.
నెల్లూరు జిజిహెచ్ లో శంకుస్థాపన జరిగిన ఆక్సిజన్ ప్లాంట్ కి పీఎం కేర్స్ నుంచి నిధులు.
ఆత్మకూరులో త్వరలో ఏర్పాటయ్యే ఆక్సిజన్ ప్లాంట్ కు రూ.1.5కోట్లు.
జీజీహెచ్లో శంకుస్థాపన చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ..గాలి నుండి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ.
ఆత్మకూర్ లో రానున్నది లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్. ఇది కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే విధానం.
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐ.టీ,పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి , రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు.
addComments
Post a Comment