విజయవాడ (ప్రజా అమరావతి)0
ఆక్సీజన్ సరఫరాపై ఏడు బృందాలు ఏర్పాటు.
*ఉత్పత్తి,కొనుగోలు,రవాణా, *వినియోగం అంశాల* *వారిగా పర్యవేక్షణ*
*జెసి.ఎల్.శివశంకర్*
కోవిడ్ వైద్య సేవల్లో భాగంగా ఆక్సీజన్ వినియోగన్నీ అంశాల వారిగా పర్యవేక్షించేందుకు 7 బృందాలను నియమిస్తూ న్నామని జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) ఎల్.శివశంకర్ వెల్లడించారు.
మంగళవారం నగరంలోని కోవిడ్ కంట్రోల్ కేంద్రంలో ఆక్సీజన్ మానిటరింగ్ టీమ్ అధికారులతో జెసి శివశంకర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రికి ఆక్సీజన్ అవసరాలను అంచనా వేసి,వాటి సరఫరాకు అవసరమైన ఏర్పాటుకు 2 బృందాలు పని చేస్తాయని, ఇవి మూడు షిఫ్టు లుగా 12 మంది పనిచేస్తారన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి కృష్ణా జిల్లా కు కేటాయించిన ఆక్సీజన్ తో కూడిన వాహనాలు ఉత్పత్తి కేంద్రాల నుంచి జిల్లా కు చేరే వరకు ఈ బృందాలు అనుక్షణం పర్యవేక్షిస్టా యన్నారు.
వీరికి సహాయకారిగా రవాణా శాఖ నుంచి ఒక అధికారి సమనవ్య యం చేసుకుంటారన్నారు.గ్రీన్ ఛానెల్లో వాహనాలు జిల్లా కు చేరేలా పోలీసు అధికారులు పనిచేస్తారన్నారు
విజయవాడ, మచిలీపట్నం ల్లోని ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలకు,పిన్నమనేని, నిమ్ర కోవిడ్ ఆస్పత్రిలకు ఆక్సీజన్ సరఫరా, వినియోగం నిల్వలు ఎప్పటికప్పుడు ఈ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు.
లిక్విడ్ ఆక్సీజన్ కేటాయింపు టీమ్ ,ఆక్సీజన్ వాడకం ఆడిట్ టీం,ప్రైవేటు సరఫరాదారు నుంచి కొనుగోలు కు ,చెల్లింపు లకోసం బడ్జెట్ టీం ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి టీంలో 6 గురు మూడు షిఫ్టు ల్లో పనిజేస్తారన్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఒక షిఫ్ట్,మ.2 నుంచి రాత్రి 10 గంటల వరకు, మూడో షిఫ్ట్ రా.10 నుంచి ఉ.6 వరకు పనిచేస్తారని శివశంకర్ చెప్పారు.
తొలి షిఫ్టులో పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ మురళి కృష్ణా,రెండో షిఫ్టులో ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ నాయుడు,మూడో షిఫ్టులో డిప్యూటి తహసీల్దార్ చిట్టిబాబు లు 7 బృందాలను సమన్వయం చేసుకుంటారన్నారని జెసి తెలిపారు.
addComments
Post a Comment