*వైసీపీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
*
దేవరపల్లి మే 30 (ప్రజా అమరావతి): భారతదేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు అన్నారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆదివారం నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె వి కె. దుర్గారావు, నరహరిశెట్టి రాజేంద్ర బాబు, గోపాలపురం ఏఎంసీ చైర్మన్గ గన్నమని జనార్దన్ రావు,కాండ్రురామకృష్ణ, మాధవరపు వెంకటేశ్వరరావు,శాలివేణు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment