చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి మహర్దశ*
ఆరునెలల్లో వంద పడకల ఆస్పత్రిగా రూపాంతరం.
*ముగింపు దశలో పనులు*
*ఆక్సిజన్ ప్లాంట్, బ్లడ్ బ్యాంకు, ట్రామా కేర్ సెంటర్ కోసం కృషి చేస్తా*
*ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపుతాం*
*చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు*
*పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వాస్పత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే విడదల రజిని గారు*
*అధికారులకు పలు సూచనలు*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
కరోనా సమయం లో కూడా అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా 100 పడకల ఆసుపత్రి నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయని,పనులు సంతృప్తికరంగా ఉన్నాయని,మరొక 6 నెలల్లో 100 పడకల హాస్పత్రి అందుబాటులోకి రానున్నది అని,ముఖ్యమంత్రి గారి సహాయ సహకరాలతో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు స్థానిక ప్రభుత్వాస్పత్రిని సోమవారం ఎమ్మెల్యే విడదల రజిని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు, డీఎస్పీ విజయభాస్కర్ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిని 30 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్చబోతున్నామన్నారు. జాతీయరహదారి అనుకుని చిలకలూరిపేట నియోజకవర్గం ఉందని, ప్రమాదాలు సంభవించిన సమయంలో బాధితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గుంటూరు నుంచి ఒంగోలు వరకు మధ్యలో ఎక్కడా సరైన ప్రభుత్వాస్పత్రి లేదని, ఇప్పుడు చిలకలూరిపేటలో నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి ఆ లోటు తీరుస్తుందని వెల్లడించారు.
*65 శాతం పనులు పూర్తి*
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి పనులు ఇప్పటికి 65 శాతం పూర్తయ్యాయన్నారు. దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో ప్రభుత్వాస్పత్రిని నిర్మిస్తున్నామని,దీనికి అదనంగా కావాల్సిన మరొక 11 కోట్లకు కూడా ప్రతిపాదనలు పంపామని త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో 6 నెలల్లో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ వంద పడకల ఆస్పత్రిలో ఆక్సిజన్ పైపు లైన్ల నిర్మాణం, ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రిలో బ్లండ్ బ్యాంకు, ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అని చెప్పారు. ఓగేరు వాగు ముంపు ముప్పు లేకుండా ఉండేందుకు వీలుగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు కూడా మంజూరవుతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ విజయభాస్కర్,ఇంచార్జి కమిషనర్ ఫణి కుమార్,డాక్టర్లు భవాని,మోజేశ్,గోపి నాయక్, సీఐ బిలాలుద్దీన్, ఇంజినీర్లు,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,కౌన్సిలర్ విడదల గోపి, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,మరియు పలువురు నాయకులు ఉన్నారు.
addComments
Post a Comment