విశాఖ ఏజెన్సీలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు రూపురేఖలు మారాయి.

 నాడు - నేడు పై కధనం




    గిరిజన విద్యార్థులలో ఆనందం


విశాఖ ఏజెన్సీలో  నాడు-నేడు కార్యక్రమం  ద్వారా పాఠశాలలు రూపురేఖలు మారాయి.

విశాఖపట్నం (ప్రజా అమరావతి);



విశాఖ ఏజెన్సీలోని గిరిజన బాలుర-బాలికల ప్రభుత్వ పాఠశాలలు గతం లో కంటే నేడు రూపురేఖలు పూర్తిగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా  విద్యకు అధిక ప్రాధాన్యత నిచ్చి పాఠశాల లను పూర్తిగా మారుస్తూ నిర్ణీత మైన చర్యలు చేపట్టి నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా విశాఖ ఏజెన్సీ 11మండలాల ప్రైమరీ,అప్పర్ ప్రైమరీ, ఆశ్రమ

బాలుర, బాలికల 367 పాఠశాలల భవనాలు 104 కోట్ల రూపాయల ఖర్చుతో  ఆధునీకరణ చేపట్టారు. గతంలో( నాడు) ప్రభుత్వ పాఠశాలలు అంటే పడిపోతున్న భవనాలు , విద్యుత్ లేకుండా, తాగునీరు లేకుండా

విద్యార్థులకు కాలికి చెప్పులు లేకుండా, వున్న విద్యార్థులు కూడా హాజరు కాకుండా  పాఠశాలల వాతావరణం చూసి చలించి పోయి న ముఖ్యమంత్రి  అందరూ ఉన్నతమైన చదువులు చదువుకోవాలని  నాడు-నేడు పధకం  ప్రవేశపెట్టి పాఠశాల లో భవనాలు ఆధునీకరణ, (మరమ్మత్తులు ) మరుగుదొడ్లు, నీటి సదుపాయం, విద్యుత్, తాగునీరు, ప్రహారీ గోడలు నిర్మాణం

చేపట్టి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాలని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారు. అంతేకాకుండా పౌష్టికాహారం, మంచి విద్యాబోధన (ఆంగ్ల మాధ్యమం) ద్వారా వున్నతమైన విద్యనందుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా అమ్మ వడి కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జమ ద్వారా ప్రతీ  కుటుంబం నుండి తమ పిల్లలను ప్రతీరోజు పాఠశాల లకు పంపించే ఈ అమ్మవడి వలన మారుమూల గ్రామాలలోకూడా చదువుపట్ల అవగాహన లేని తల్లిదండ్రులు అమ్మవడి ద్వారా లబ్ధి గురించి తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నారు.   ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అందమైన భవనాలుమరియు ఆహ్లాదకరమైన వాతావరణం తో పిల్లలకు కూడా పాఠశాల కు వెళ్ళాలనే శ్రద్ధ కలుగుతోంది. అంతేకాకుండా ప్రతీ విద్యార్థి కీ వేసుకోవడానికి స్కూల్ డ్రెస్,బూట్లు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ లు అందజేయడం వలన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశ పెట్టిన నాడు-నేడు కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. 

అందరికీ విద్య  ఆశయం నెరవేరుతుంది.


Comments