రెమ్ డెసివిర్ దుర్వినియోగం, అధిక ఫీజుల వసూళ్లపై శ్రీ గాయత్రి హాస్పిటల్ కి 10 లక్షల ఫైన్.
*కె ఎస్ కేర్ హాస్పిటల్ లో అనుమతి లేకున్నా కోవిడ్ పేషెంట్ల కు ట్రీట్మెంట్ చేస్తున్నందుకు 20 లక్షల ఫైన్*
*వనమాలి హాస్పిటల్ అనుమతి లేకున్నా కోవిడ్ పేషెంట్ల కు ట్రీట్మెంట్, రెమ్ డెసివిర్ దుర్వినియోగం కారణంగా 10 లక్షలు ఫైన్*
*జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్*
కర్నూలు జూన్ 2 (ప్రజా అమరావతి);
ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా కోవిడ్ పేషెంట్ల దగ్గర అధిక ఫీజులు వసూళ్లు, రెమి డెసివిర్ ఇంజక్షన్ దుర్వినియోగంపై కర్నూలు నగరంలోని గాయత్రి హాస్పిటల్ కు 10 లక్షల రూపాయలు ఫైన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అదేవిధంగా కర్నూల్ నగరంలోని కే ఎస్ కేర్ హాస్పిటల్ నాన్ కోవిడ్ హాస్పిటల్ అయినప్పటికీ కోవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటాన్ని సీరియస్ గా తీసుకుని ఆ హాస్పిటల్ కు 20 లక్షల ఫైన్ విధించామన్నారు..
అలాగే నగరంలోని వనమాలి హాస్పిటల్ యాజమాన్యం లో కూడా రేమిడిసివిర్ ఇంజెక్షన్ దుర్వినియోగం, అనుమతి లేకున్నా కోవిడ్ పేషెంట్ల కు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆ హాస్పిటల్ కు కూడా 10 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, వారం లోపు విధించిన ఫైన్ మొత్తాన్ని చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు..
కోవిడ్ హాస్పిటల్ లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా కోవిడ్ పేషెంట్ల దగ్గర నుంచి అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పత్రికా ప్రకటన ద్వారా హెచ్చరించారు. అనవసరంగా రెమిడీసివర్ ఇంజక్షన్ దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్ ఆసుపత్రులు నిర్వహిస్తే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అని హెచ్చరిక జారీ చేశారు.*
addComments
Post a Comment