11వ PRC బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.....బొప్పరాజు & వైవీ రావులు.

 

AP JAC అమరావతి (ప్రజా అమరావతి):..

    

 11వ PRC బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి.....బొప్పరాజు & వైవీ రావులు.


● CPS రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై వీలైనంత త్వరలో *గౌ౹౹ముఖ్యమంత్రి గారు* సానుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తారనే *నమ్మకం, సంపూర్ణ విశ్వాసం మాకు ఉంది* ... బొప్పరాజు, వైవీ రావులు.

           ***

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ 01/07/2018 నుండి రావాల్సిన 11వ PRC ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిస్తితి.

బకాయివున్న DA లు చెల్లింపు, గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూపులు చూస్తున్న ఉద్యోగులు,

CPS రద్దుకై వేయి కళ్లతో ఎదురుచూస్తున్న లక్షలాదిమంది CPS ఉద్యోగులు తదితర అనేక అంశాలపై ఇప్పటికే AP JAC అమరావతి రాష్ట్ర నాయకత్వం వివిధ సందర్భాలలో రాష్ట్ర గౌ౹౹ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడమైనది.


అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11వ PRC ని అమలు పరచగానే వివిధ ఎలక్ట్రానిక్, సోషల్ మరియు కొన్ని పత్రికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త PRC ఇవ్వడం లేదని దానికొరకు పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు, నాయకులు ఏమీ పట్టించుకోకుండా  ఉన్నారని ప్రచారం జరుగుతోంది.


కానీ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా కారణంగా దాదాపు ఒకటిన్నర  సంవత్సరం నుండి అటు ప్రజలు ఇటు ప్రభుత్వం ఆర్ధికంగా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే.


గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీకి కట్టుబడి;


 ★ *27శాతం IR ని (ఈ బెనిఫిట్ గత 2 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యోగులకు లేదు) విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం* ..


★ *దాదాపు 70,000 మంది RTC కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.* .


★ *పారిశుధ్య కార్మికుల లాంటి చిరు ఉద్యోగుల జీతాలు పెంచటం* ..


★ *తెలంగాణ తో సమానంగా హోంగార్డులు, ఆశా వర్కర్లు లాంటి వారి జీతాలు పెంచటం* ..


 ★ *ఇచ్చిన హామీ మేరకు, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు కల్పించటం* ..


★ *గ్రామ సచివలయాల ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించటం లాంటి అనేక సహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు* .


ప్రస్తుతం, ప్రపంచం, దేశం, రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక అనిచ్చిత పరిస్థితుల్లో, ఆర్ధిక పరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యమైనప్పటికీ, తప్పకుండా మనకు ఆమోదయోగ్యమైన, తెలంగాణ కంటే మెరుగైన 11వ PRC ని పొందగలమని, CPS రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై వీలైనంత త్వరలో సానుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తారనే *నమ్మకం, సంపూర్ణ విశ్వాసం మాకు గౌ౹౹ముఖ్యమంత్రి గారి మీద ఉందని* , ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని AP JAC అమరావతి పక్షాన తెలియచేస్తున్నాము. 


అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు మరియు పొరుగుసేవల ఉద్యోగుల రాయితీలు ప్రభుత్వం నుండి సాధించుకోవడంలో AP JAC అమరావతి నాయకత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలియచేస్తున్నాము. 


గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులు చిరకాలం గుర్తుంచుకొనే విధంగా  పదకొండవ పిఆర్సి ని వెంటనే అమలు పరచాలని, ఉద్యోగుల  చిరకాల కోరిక అయినా సిపిఎస్ విధానాన్ని రద్దు పరచాలని మరియు తక్కువ జీతంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఒప్పంద (Contract employees) ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని అలాగే పొరుగు (Outsourcing employees) సేవల ఉద్యోగుల జీతాలు పెంచాలని AP JAC అమరావతి పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.


 *బొప్పరాజు & వైవీ రావు.*