విద్య, ఉద్యోగం, ఇతర అత్యవసర కారణాలపై విదేశాలకు వెళ్లవలసిన 18 నుండి 45 సంవత్సరాల

  కాకినాడ (prajaamaravati);

         విద్య, ఉద్యోగం, ఇతర అత్యవసర కారణాలపై విదేశాలకు వెళ్లవలసిన 18 నుండి 45 సంవత్సరాల


వయస్కుల కొరకు శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజిలో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ శిభిరంలో 137 మందికి కోవిషీల్డ్ టీకాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. ఇంకా జిల్లాలో  విదేశాలకు వెళ్లవసిన  18 నుండి 45 ఏళ్ల వయస్సు వారేవరైనా ఉంటే మరో మారు ఇటువంటి ప్రత్యేక శిభిరం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.  వ్యాక్సిన్ వేయించుకునేందుకు తమ వివరాలను, డాక్యుమెంటరీ రుజువుల పత్రాలతో డియంహెచ్ఓ కార్యాలయం 3వ ఫ్లోర్  లోని కోవిడ్ వాక్సినేషన్ సెల్ లో ఉదయం 10 గం.ల నుండి మద్యాహ్నం 2 గం.ల వరకూ అందుబాటులో ఉండే అధికారి ఎ.హేమలత ను వ్యక్తిగతంగా సంప్రతించాలని తెలియజేశారు.  అభ్యర్థులు తమ పేరు, అడ్రస్, ఆధార్ నెంబరు,పాస్ పోర్ట్, ఫోన్ నంబరు, ఏ రోజు, ఏ దేశానికి వెళుతున్నది, వివరాలతో పాటు చదువు కోసం వెళ్లేవారు అడ్మిషన్ లెటర్, ఉద్యోగార్ధమైతే అపాయింట్ మెంట్ లెటర్, ఇతర అత్యవసర కారణాలైతే టికెట్ వివరాలను ఇందుకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.  అందిన ధరఖాస్తులను పరిశీలించి ఏతేదీన తదుపరి ప్రత్యేక టీకా శిభిరం నిర్వహించేది తెలియజేయడం జరుగుతుందన్నారు. 

  

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image