ఈ ఏడాది (2021-22) ని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం - మంత్రి కన్నబాబు


అమరావతి (ప్రజా అమరావతి);


ఈ  ఏడాది (2021-22) ని చీని, నిమ్మ సంవత్సరంగా 

ప్రకటిస్తున్నాం - మంత్రి కన్నబాబు


.


నిమ్మ , బత్తాయి (చీని ) అభివృద్ధి కి  ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు చేసేలా ముఖ్యమంత్రి జగన్ గారు దేశానిర్దేశం చేశారు-మంత్రి కన్నబాబు 


రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి  జీవన ప్రమాణ స్థాయి పెరిగేలా  సిఎం గారు  పాలన సాగిస్తున్నారు -మంత్రి కన్నబాబు 


డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్ లో  పాల్గొన్న  మంత్రి కన్నబాబు 


పలువురు ఉన్నాతాధికారులు, శాస్త్రవేత్తలు, నిమ్మ, బత్తాయి సాగు రైతులతో జూమ్ వీడియో ద్వారా మాట్లాడిన మంత్రి కన్నబాబు.


బత్తాయి, నిమ్మ పంటల సాగు, దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ  ఏడాదిని "నిమ్మ, బత్తాయి సంవత్సరంగా" ప్రకటించాలని నిర్ణయించాం -కన్నబాబు 


ధృవీకరించిన నాణ్యమైన మొక్కలు, అంట్లు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉద్యాన శాస్త్రవేత్తలు - ఉద్యాన శాఖ సముక్తంగా  కృషి చేయాలి 


శాస్త్రీయ పరమైన యాజమాన్య సాగు పద్దతులపై రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలి 


ఆర్ బి కె ల ద్వారా నిమ్మ మరియు బత్తాయి సాగు శిక్షణ , సమగ్ర యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పిస్తున్నాం 


సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానంలో వుంది - మంత్రి కన్నబాబు 


మన రాష్ట్ర బత్తాయి , నిమ్మ పండ్ల దేశీయ రకాలకు మరింత ప్రాచుర్యం కల్పించి జాతీయ స్థాయిలో పేరొందెలా చర్యలు తీసుకోవాలి - కన్నబాబు.


సిట్రస్ జాతి కాయలు, పండ్లు రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి, అవి ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవాలి- మంత్రి కన్నబాబు 


వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ జానకి రామ్ , ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి కన్నబాబు 


Comments