జిల్లాలో ఖరీఫ్ 2021 కి 2,25,970 హెక్టార్లలో పంటకు ప్రణాళికలు సిద్ధం.ఏలూరు  (ప్రజా అమరావతి);


జిల్లాలో ఖరీఫ్ 2021 కి 2,25,970 హెక్టార్లలో పంటకు ప్రణాళికలు సిద్ధం..


వరి, మొక్కజొన్న, తదితర పంటలు


జులై 8 డా వై ఎస్ ఆర్ జన్మదినం సందర్బముగా రైతు దినోత్సవం... జేసి వెంకట రమణా రెడ్డి


జులై 8 డా వై ఎస్ ఆర్ జన్మదినం సందర్బముగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవం నాడు వ్యవసాయ పనిముట్ల  పంపిణీ కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు , హబ్ లను  ఏర్పాటు పై ప్రణాళికలు తయారు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి తెలిపారు.


2021 ఖరీఫ్ కోసం రాయితీ పై విత్తన సరఫరా , ఎరువులు ,పురుగు మందులు , వ్యవసాయ రుణాలు , వైఎస్సార్ పొలంబడి , వేరుశెనగ విత్తనాల పంపిణి అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా పూనమ్ మాల కొండయ్య , ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి , అగ్రకల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ , మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న , హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ , కోపెరేటివ్ కమీషనర్ అహ్మద్ బాబు , ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు ,  ఏపీ ఆగ్రోస్ ఎండీ కృష్ణ మూర్తి  13 జిల్లాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు బుధవారం సాయంత్రం  స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ కె. వెంకట్రామరెడ్డి,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేసి వెంకట రమణా రెడ్డి  మాట్లాడుతూ, జిల్లాలో వర్షాలు సకాలం లో కురిసే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి అధికారులకు  మండలాలు వారిగా కావాల్సిన  స్టాకుల వివరాలు, వినియోగం పై ఇండెంట్ తో కూడి రూట్ మ్యాప్ సిద్ధంచేయ్యాలని ఆదేశించామన్నారు.  జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జేసి పేర్కొన్నారు. జిల్లాలో 2,25,970 హెక్టార్లలో పది ప్రధాన పంటల కు ప్రణాలికను అమలు చేయడం చేస్తున్నామన్నారు. జిల్లాలో 1,12,985 క్వింటాల్   విత్తనాలు అవసరం ఉందని, ఏపీ సీడ్స్, ప్రవేటు, గ్రామ స్థాయిలో రైతులనుంచి సేకరణ కు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 2,01,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని, జిల్లాలో ప్రస్తుతం 1,00,334  మెట్రిక్ టన్నుల ఎరువులు మే 24 నాటికి అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుత సంవత్సరానికి రూ.10,800 కోట్ల రుణ ప్రణాళికలు సిద్ధం చేశామని, అందులో ఖరీఫ్ రూ.6480 కోట్ల ఉందని తెలిపారు. సబ్సిడీ పై విత్తనాలు సరఫరా కోసం 19,981 క్విoటాళ్లు ప్రణాళిక రూపొందించగా, అందులో భాగంగా 4,111 క్విటాళ్లు అమ్మకాలు జరిపామన్నారు. 

జిల్లాలో మరింత మంది కౌలు రైతులకు 

సిసిఆర్సీ కార్డులు అందించి వారిని రైతు భరోసా పథకానికి అర్హులు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. క్రాప్ ప్లానింగ్ , ప్రాంతాల వారీగా ఏఏ పంటలకు సానుకూలత , ప్రతికూలత , ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై మరింత దృష్టి సారిస్తున్నామన్నారు. వరికి సంబంధిచి సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.  బోర్ల కింద పండించే వరి పంటలకి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. 


సమావేశంలో భాగంగా రైతు వొచ్చి ఎరువు అడిగినా, విత్తనాలు అడిగినా ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు


ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి గౌషియా బేగం, డిడి ఆర్బికే జగ్గారావు, హార్టికల్చర్ డిడి దుర్గేష్, ఇతర సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..