ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 215వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.*


అమరావతి (ప్రజా అమరావతి);


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 215వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం.*



*బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ,ఏపీ.*

*ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ మాట్లాడుతూ*


మీరు(సీఎం శ్రీ వైయస్‌.జగన్‌) బ్యాంకింగ్‌ రంగానికి మంచి వాతావరణం సృష్టించారు. రైతు భరోసా, సకాలంలో బీమా పరిహారం రైతులకు అందుతుంది. చేయూత, ఆసరాతో పాటు అనేక పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయి. దీంతో క్షేత్ర స్ధాయిలో బ్యాంకర్లకు కూడా ఒత్తిడి తగ్గింది. రెండు, మూడేళ్ల క్రితం అయితే బ్రాంచ్‌ లెవల్‌లో అనేక ధర్నాలు జరిగేవి. మీరు దూరదృష్టితో అనేక పథకాలు ప్రవేశపెట్టారు. గర్భిణీ దశ నుంచి అంతిమదశ వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. వైద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యవసాయం, హౌసింగ్‌ కాలనీలు మీద మీరు తీసుకున్న శ్రద్ధ ప్రశంసనీయం. ఇవన్నీ బ్యాంకింగ్‌ రంగానికి కూడా విలువ జోడిస్తున్నాయి. మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రణాళిక వేసుకున్నారో...  అది త్వరలోనే సాకారమవుతుంది.

Comments