వివిధ దేశాలలో కోవిడ్ 3 దశ ప్రారంభం అయ్యింది

 ఏపీ covid కమాండ్ కంట్రోల్ (ప్రజా అమరావతి);

వివిధ దేశాలలో కోవిడ్ 3 దశ ప్రారంభం అయ్యింది


. కోవిడ్ ప్రారంభదశ మరియు రెండవ దశలో వృద్దులను మరియు పెద్ద వయసు వారిని ఇబ్బంది పెట్టగా,  ఈ కోవిడ్ 3వ దశ  చిన్నారులకు ప్రమాదకరము అని వివిధ దేశాలనుండి అందుతున్న సమాచారము అనుసరించి స్పందించిన కేంద్ర ప్రభుత్వము.


ఈ మూడవ దశలో చిన్నారులు కోవిడ్ ప్రభావితమయి తే దానికి సంబంధించిన చికిత్స మరియు నిర్వహణ పద్దతులను  కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది.


పిల్లలలో  కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకినపుడు వాళ్ళ శరీరములో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అనుసరించి వారిలో  ఎక్కువ మందికి  వ్యాధి లక్షణాలు లేకుండా లేదా స్వల్ప లక్షణాలు కలిగి ఉంటారు. 

 

వీరిలో సాధారణంగా జ్వరం, దగ్గు, శ్వాస సరిగా తీసుకోకపోవడం, ఊపిరి అందని ఫీలింగ్‌, అలసట, కండరాల నొప్పులు, ముక్కు కారడం, గొంతు నొప్పి, విరేచనాలు, వాసన మరియు  రుచి కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. వాటితో పాటు కొద్దిమంది పిల్లలు  జీర్ణశయసంబంధ  మైన సమస్యలతో ఉండవచ్చు.


పైన సూచించినవి   కాకుండా అదనంగా  మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (Multi Inflamatory Syndrome.MIS) అనే కొత్త సిండ్రోమ్ పిల్లలలో కనుగొనడం జరిగింది. కోవిడ్ ఎపిడెమియోలాజికల్ లింకేజ్ వలన ఏర్పడే లక్షణాల తో పాటు 102 డిగ్రీల కు  తగ్గని జ్వరము వంటి లక్షణాలు ఈ మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ కేసులలో  కనబడతాయి.


*ఎటువంటి లక్షణాలు  లేని మరియు తేలికపాటి కోవిడ్ లక్షణాలు గల చిన్నారుల నిర్వహణ.*


సాధారణంగా స్క్రీనింగ్ నిర్వహించినపుడు మాత్రమే కోవిడ్ సోకి ఎటువంటి లక్షణాలు లేని పిల్లలు గుర్తించబడతారు, వీరిని కుటుంబ సభ్యులు  గుర్తించినట్లయితే లక్షణాల అభివృద్ధి మరియు అంచనా వేసిన తీవ్రత ప్రకారం వీరికి  తదుపరి చికిత్స కోసం పర్యవేక్షణ అనేది అవసరం.


తేలికపాటి వ్యాధి గల  పిల్లలలో  గొంతు నొప్పి, ముక్కు కారడం, దగ్గుతో  కూడిన  శ్వాస క్రియ ఇబ్బందులు ఉండవచ్చు. కొద్దిమంది పిల్లలకు జీర్ణశయాంతర లక్షణాలు ఉండవచ్చు వీరికి ఎలాంటి స్క్రీనింగ్ అవసరం లేదు. వీరిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స నిర్వహించవచ్చు. అంతే కాకుండా పుట్టుకతో వచ్చిన  గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, దీర్ఘకాలిక అవయవ పనిచేయకపోవడం, ఊబకాయం వంటి అంతర్లీన సహ అనారోగ్య  పరిస్థితులతో ఉన్న పిల్లలను కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స నిర్వహించవచ్చు.


*హోమ్ ఐసోలేషన్ లో ఉన్న చిన్నారులకు అందించవలసిన చికిత్స.*


జ్వరం కొరకు  పారాసెటమాల్ 10-15 mg / kg / మోతాదు  ప్రతి 4-6 గంటలకు ఇవ్వవలసిన ఉంటుంది. పెద్ద పిల్లలలో మరియు  యువకులకు దగ్గు వస్తున్న సందర్భాల్లో గొంతు ను సెదార్చే సెలైన్ ఏజెంట్లు వంటివి గోరు వెచ్చగా  గార్గిల్ చేయించాలి.  


ద్రవాలు మరియు  ఆహారం శరీరం లో తగిన నీటి అర్ధరీకరణ కు తగినన్ని ద్రవాలను తీసుకోవాలి, మరియు శరీరానికి వ్యాధి నిరోధక శక్తి కొరకు వేళ ప్రకారం తగిన పోషక ఆహారాన్ని అందించాలి..


హోమ్ ఐసోలేషన్ లో  యాంటీబయాటిక్స్ గాని  హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరవిర్, ఐవర్‌మెక్టిన్, లోపినావిర్ / రిటోనావిర్, రెమ్‌డెసివిర్, ఉమిఫెనోవిర్, టోసిలిజుమాబ్, ఇంటర్ఫెరాన్ బి 1 ఎ, కన్వాలసెంట్ ప్లాస్మా ఇన్ఫ్యూషన్ లేదా డేక్సామెతాసోన్ సహా ఇమ్యునోమోడ్యులేటర్లు అవసరము లేదు.


రోజుకు 2-3 సార్లు శ్వాసకోశ చర్యను గమనించి, శ్వాస తీసుకునే రేటును ఒక చార్ట్ ద్వారా పర్యవేక్షించి నిర్వహించాలి. ఛాతీ యొక్క ఉచ్చాశ్వ నిచ్చాశ్వలు , శరీరం లో నీలి రంగు మార్పులు, చల్లని వేలు కొన భాగాలు, మూత్ర విసర్జన, ఆక్సిజన్ సంతృప్తత, ద్రవాలు తీసుకోవడం వంటి పరిశీలనలు  ముఖ్యంగా చిన్న పిల్లలలో నిర్వహించాలి.


ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినపుడు తల్లిదండ్రులు లేదా  సంరక్షకులు తక్షణమే  వైద్యుడిని సంప్రదించాలి.


*కోవిడ్ మిత లక్షణాలు గల చిన్నారుల  నిర్వహణ.*


ఒక పిల్లవాడు, అతడు లేదా  ఆమె కింది లక్షణాలు  కలిగి ఉంటే మితమైన కోవిడ్ -19 కేసుగా వర్గీకరించాలి. 2 నెలల కన్నా తక్కువ వయసు గల చిన్నారులలో శ్వాసకోశ రేటు నిముషానికి 60 కంటే ఎక్కువ,  2 నుండి 12 నెలల మధ్య వయసు ఉన్న చిన్నారులలో శ్వాసకోశ రేటు నిముషానికి 50 కంటే ఎక్కువ,  1 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులలో శ్వాసకోశ రేటు నిముషానికి 40 కంటే ఎక్కువ,  5 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న చిన్నారులలో శ్వాసకోశ రేటు నిముషానికి 30 కంటే ఎక్కువ, కలిగి ఉండి అన్నీ వయసుల వారి రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత 90 నుండి 95 మధ్య ఉన్న చిన్నారులు ఈ కోవకి చెందుతారు.


పై లక్షణాలు తో  ఉన్న పిల్లవాడు స్పష్టమూ గా అనిపించక పోయినప్పటికీ అతను     న్యుమోనియా తో  బాధపడుతూ ఉండవచ్చు. అనుబంధ సహ అనారోగ్య పరిస్థితులు లేకపోతే ప్రయోగశాల పరీక్ష మామూలుగా అవసరం పడదు.


ఈ చిన్నారులను  డేడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్ లేదా సెకండరీ లెవెల్ హెల్త్‌కేర్‌ ఫెసిలిటీలో చేర్పించి క్లినికల్ పురోగతి కోసం పర్యవేక్షించాలి. శరీరం లో తగినంత ద్రవ మరియు ఎలక్ట్రో లైట్ సమతుల్యతను నిర్వహించాలి. నోటి ద్వారా ఆహారము తీసుకోవడాన్ని ప్రోత్సహించాలి, నవ జాత శిశువులలో తల్లి పాలు పట్టించాలి,  నోటి ద్వారా తీసుకోవడం అనేది తక్కువగా ఉంటే ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ థెరపీని ప్రారంభించాలి.


జ్వరం కోసం ఉష్ణోగ్రత> 38 ° C, అనగా 100.4 ° F  ఉన్న సందర్భాల్లో పారాసెటమాల్ 10-15 mg / kg / మోతాదు. ప్రతి 4-6 గంటలకు ఇవ్వవలసిన ఉంటుంది. బ్యాక్టీరియా సంక్రమణ కు సంబందించి బలమైన ఆధారాలు లేదా  అనుమానం ఉంటే యాంటీ బయాటిక్ అమోక్సిసిలిన్ ఇవ్వబడుతుంది. రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత 94% కంటే తక్కువ ఉన్న సమయం లో ఆక్సిజన్ భర్తీ అవసరం


కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ప్రత్యేకంగా వ్యాధి ప్రారంభ మొదటి రోజుల్లో, మరియు  వ్యాధి వేగంగా ప్రగతి శీలముగా ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. తక్కువ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలందరిలో వీటి అవసరం లేదు, సహ అనారోగ్య పరిస్థితులతో బాధపడే చిన్నారులకు దానికి సంబందించి  సహాయక సంరక్షణ చికిత్స ఏదైనా ఉంటే అందించాలి.


*కోవిడ్ వ్యాధి తో తీవ్రంగా బాధపడే చిన్నారుల నిర్వహణ మరియు చికిత్స.*


రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత స్థాయి 90% కన్నా తక్కువ ఉన్న పిల్లలను   తీవ్రమైన కోవిడ్ -19 సంక్రమణ గల వారు గా  వర్గీకరించబడ్డారు.


వీరు తీవ్రమైన న్యుమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, సెప్టిక్ షాక్, మల్టీ-ఆర్గన్ డిస్ ఫంక్షన్ సిండ్రోమ్ లేదా సైనోసిస్‌తో కూడిన   న్యుమోనియా కలిగి  ఉండవచ్చు. అలాంటి పిల్లలు లో  శ్వాస తీసుకునే సందర్భం లో పిల్లి కూతలు,  శ్వాస తీసుకునెప్పుడు  ఛాతీ ఎగిరెగిరి పడడము,  నిస్సత్తువ, మగతగా, సరిగా స్పందించ లేకపోవడం వంటి లక్షణాలు కలిగి  ఉంటారు.


అలాంటి పిల్లలను వెంటనే  డేడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్ / సెకండరీ / తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయంలో చేర్చాలి. కొద్దిమంది పిల్లలకు HDU లేదా  ICU సంరక్షణ అవసరం కావచ్చు. HDU లేదా ICU సంరక్షణ యొక్క అవసరం అంచనా వేయడానికి థ్రోంబోసిస్, హిమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH) మరియు అవయవ వైఫల్యము గురించి పరీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలి.


వీరికి రక్త పరీక్షలు, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు పరీక్షలు, ఛాతీ ఎక్స్-రే వంటి  పరిశోధనలు పూర్తి గా నిర్వహించి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ థెరపీ విధానం లో  చికిత్స అందించవలసి ఉంటుంది.


కార్టికోస్టెరాయిడ్స్ అయిన  డేక్సామెతాసోన్ 0.15 mg / kg (గరిష్టంగా 6 mg) మోతాదు రోజుకు రెండుసార్లు. క్లినికల్ అసెస్‌మెంట్‌ను బట్టి దాని యొక్క సమాన మోతాదును అనుసరించి మిథైల్ప్రెడ్నిసోలోన్ 5-14 రోజులు వాడవచ్చు.


యాంటీవైరల్ ఏజెంట్లు రెమెడిసివిర్  అనేది,  కోవిడ్ బారిన పడిన పిల్లల యొక్క  మూత్రపిండ మరియు కాలేయ పనితీరు సాధారణమూ గ ఉన్నాయని  గుర్తించినపుడు, మరియు అవి రెమిడెసీవీర్ ఉపయోగించినపుడు ఏర్పడే సాధారణ దుష్ప్రభావాల ను  పర్యవేక్షించబడుతున్నాయని  నిర్ధారించిన తర్వాత వ్యాధి లక్షణాలు ప్రారంభమైన మూడు రోజుల్లోపల వాడుటకు  పరిమితం చేయబడిన పద్ధతిలో అనుమతి మంజూరు చేయబడింది.


సూచించిన మోతాదు (శరీర బరువు ఆధారిత): 40 కిలోలు బరువు ఉన్న యువకులకు  1 వ రోజు 200 మి.గ్రా తరువాత 4 రోజులకు 100 మి.గ్రా, 3.5 నుండి 4 కిలోలు బరువు ఉన్న చిన్నారులకు  1 వ రోజు కేజీ కి 5 మి.గ్రా చొప్పున మరియు, 4 రోజులకు రోజుకు కేజీ కి 2.5 మి.గ్రా.


ఈ తరగతి చిన్నారులకు చికిత్సకు సంబందించి హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరవిర్, ఐవర్‌మెక్టిన్, లోపినావిర్ / రిటోనావిర్, ఉమిఫెనోవిర్ యొక్క అవసరము  ఉండదు.


పిల్లలకు అవయవ వైఫల్యము ఏర్పడినప్పుడు లేదా అవయవము  పనిచేయక పోయిన సందర్భాల్లో తగిన అవయవ మద్దతు కల్పించాలి. ఉదా. మూత్రపిండ పునః స్థాపన చికిత్స.


*చిన్నారుల్లో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) నిర్వహణ మరియు చికిత్స:*

చిన్నారులు తేలికపాటి అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) తో బాధపడుతున్న సందర్భాల్లో  , నాన్-ఇన్వాసివ్ వెంటిలేషన్ తో ముక్కు ద్వారా   హై ఫ్లో ఆక్సిజనేషన్ ఇవ్వవచ్చు. తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) తో బాధపడుతున్న సందర్భాల్లో   తక్కువ టైడల్ వాల్యూమ్‌తో యాంత్రిక వెంటిలేషన్ ఇవ్వవచ్చు.


వైద్య పరంగా పిల్లవాడు పరిస్థితి మెరుగుపడని సందర్భాల్లో  హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటరీ వెంటిలేషన్, లేదా ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్ ను ప్రయత్నించాలి.

హైపోక్సెమిక్ గల పిల్లలు వారు తట్టుకో కలిగితే  శ్వాస క్రియకు సంబందించి పాత ప్రొ పొజిషనింగ్ ను ప్రయత్నించవచ్చు.


ఒకవేళ పిల్లవాడు లో సెప్టిక్ షాక్ లేదా మయోకార్డియల్ పనిచేయకపోవడానికి అవకాశం ఏర్పడి అటువంటి సందర్భాల్లో  గుండె పనిచేయకపోవడం వంటి ప్రమాదం ఏర్పడితే క్రిస్టల్లోయిడ్ బోలస్ 10 నుండి 20 మి.లీ / కేజీ 30 నుండి 60 నిమిషాలకు పైగా నిర్వహించాలి.


శరీరం లో అనియంత్రిత  ద్రవాల యొక్క ప్రసరణ ఇతర కారణాల వల్ల వలన ఏర్పడే షాక్ నివారణకు  ఐనోట్రోప్ మద్దతు తో  పర్యవేక్షించాలి.


*పిల్లలు మరియు యువకులలో ఏర్పడుతున్న కోవిడ్ సంబంధిత  మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (Multi Inflammatory Syndrome. MIS) నిర్వహణ.*


0 నుండి 19 సంవత్సరాల వరకూ వయస్సు గల పిల్లలు మరియు యువకులలో ఈ వ్యాధి గమనించడం జరిగింది.  3 రోజులు కంటే ఎక్కువ రోజుల పాటు జ్వరంతో బాధ పడడం తో పాటు ఈ కింది సూచించిన లక్షణాలలో ఏదేని రెండు లక్షణాలు కలిగి ఉంటే మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (Multi Inflammatory Syndrome. MIS) వ్యాధి గా అనుమానించాలి.  


దద్దుర్లు  లేదా రెండు కళ్ళు కండ్లకలక లేదా శ్లేష్మం లేదా గొంతులో  మంట సంకేతాలు, హైపోటెన్షన్ లేదా షాక్, అధిక రక్త స్రావం లేదా రక్తం గడ్డ కట్టలేక పోవడం, తీవ్రమైన జీర్ణ సంబంధ  సమస్యలు (విరేచనాలు, వాంతులు లేదా కడుపు నొప్పి), లేదా ESR, C- రియాక్టివ్ ప్రోటీన్ లేదా ప్రోకాల్సిటోనిన్ వంటి ఎలివేటెడ్ మార్కర్స్ యొక్క వాపు, లేదా బ్యాక్టీరియా సెప్సిస్, స్టెఫిలోకాకల్ లేదా స్ట్రెప్టోకోకల్ షాక్ సిండ్రోమ్‌లతో సహా మరి ఏ ఇతర స్పష్టమైన సూక్ష్మజీవుల కారణం వలన ఏర్పడే వాపు, లేదా COVID-19 (RT-PCR, యాంటిజెన్ టెస్ట్ లేదా సెరోలజీ పరీక్షలో  పాజిటివ్గా నిర్ధారించబడిన  రోగులతో పరిచయం.


*మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (Multi Inflammatory Syndrome. MIS) వ్యాధి చికిత్స విధానాలు.*

పిల్లలకి గుండె పనిచేయకపోవడం, షాక్, కరోనరీ సమస్య, బహుళ అవయవాల పనిచేయకపోవడం వంటివి ఉంటే వాడవలసిన మందులు


స్టెరాయిడ్స్ అయిన మిథైల్ప్రెడ్నిసోలోన్ రోజుకు 1 నుండి 2 మి.గ్రా / కేజీ ఇంట్రావీనస్ గా ఇమ్యునోగ్లోబులిన్ 2 గ్రా / కిలో 24 నుండి 48 గంటల లోపు మరియు వాటితో పాటు యాంటీమైక్రోబయాల్స్ ఇవ్వాలి.


ప్రాధాన్యతా క్రమం అనుసరించి పిల్లలకి ఐసియులో తగిన సహాయక సంరక్షణ అవసరం.  కార్డియాక్, షాక్, కరోనరీ, బహుళ అవయవాల పనిచేయకపోవడం వంటి ఇబ్బందులు లేనపుడు ఒక స్టెరాయిడ్ లేదా ఒక ఐవిఐజిని ఉపయోగించవచ్చు.


పై చికిత్సతో పిల్లవాడు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే లేదా క్షీణిస్తే, ఐవిఐజిని పునరావృతం చేయాలి. అధిక మోతాదు కార్టికోస్టెరాయిడ్స్ మిథైల్ప్రెడ్నిసోలోన్ 10 నుండి 30 మి.గ్రా / కేజీ చొప్పున  3వ రోజు నుండి 5 రోజులు,


థ్రోంబోసిస్ లేదా కరోనరీ అనూరిజం స్కోరు> 2.5 ఉన్న సందర్భాల్లో ఆస్పిరిన్ రోజుకు  3 mg / kg / నుండి 5 mg / kg / చొప్పున రోజుకు  గరిష్టంగా 81 mg /


రక్తం గడ్డ కట్టే కారకం Xa 0.5 నుండి 1 మధ్య రోగికి థ్రోంబోసిస్ / కొరోనరీ ఉంటే అనూరిజం స్కోరు> 10 లేదా LVEF <30% ఉన్నప్పుడూ తక్కువ మాలిక్యులర్ బరువు గల హెపారిన్ (ఎనోక్సపారిన్) రోజుకు రెండుసార్లు 1 మి.గ్రా / కేజీ శరీర చర్మానికి మరియు కండరానికి మధ్య 


వాపు  గుర్తులను పర్యవేక్షించేటప్పుడు స్టెరాయిడ్లను 2 నుండి 3 వారాలకు పైగా టేప్ చేయాలి.


గుండె వ్యాధుల ప్రమేయం ఉన్న పిల్లలకు ప్రతీ 48 గంటకు ECG నిర్వహించండి, మరియు ECHO ని 7 నుండి 14 రోజులు మరియు 4 నుండి 6 వారాల మధ్య నిర్వహించండి. ప్రారంభ ECHO అసాధారణంగా ఉంటే 1 సంవత్సరం తరువాత నిర్వహించండి.


*పిల్లలు మనకు ఎంతో అమూల్యము. వారంటే మనకు ఎంతో ప్రేమ. దేశ భవిష్యత్తుకు వారే పునాది. మనము అజాగ్రత్తతో వ్యవహరించి వారిని ప్రమాదములో పడవేయకూడదు . కోవిడ్ పట్ల చిన్న పిల్లలలో అవగాహన పెంచవలసి ఉంది . పరిశుభ్రత అలవాట్లు మనము  పాటిస్తే మనలను  చూసి వారు పాటిస్తారు. చికిత్స కంటే నివారణే ఉత్తమ మార్గం. మన క్రమశిక్షణే మన చిన్నారుల యొక్క  శ్రీరామ రక్ష.

 *డాక్టర్ అర్జా శ్రీకాంత్* 

ఏపీ కోవిడ్ నోడల్ ఆఫీసర్

Comments