5 లక్షల రూపాయల అక్రమ మద్యం పట్టివేత

 5 లక్షల రూపాయల అక్రమ మద్యం పట్టివేతగుంటూరు (ప్రజా అమరావతి); జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం గురజాల డియస్పి జయరాం ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రూరల్ యస్పి విశాల్ గున్ని గారి ఆదేశాలతో మూడురోల నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని పలువురు గుట్కా వ్యపారుల పై దాడులు చేపట్టి  కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు

అదేవిధంగా పోందుగుల ,బట్రుపాలెం రెండు చోట్ల రాబడిన సమాచారం తో మద్యం అక్రమ రవాణా చేసేవారిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని కృష్ణ నది నుండి పడవలో దాటించి రెండు ఆటోల్లో బట్రుపాలెం నుండి తుల్లూరు మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుని వారి వద్ద 500 మద్యం బాటిల్లు, ఆటోను సీజ్ చేయటం జరిగిందని మద్యం విలువ సుమారు 65 వేల రూపాయలు ఉంటుందని ఇదేవిధంగా పోందుగుల చెక్ పోస్ట్ వద్ద కారులో  మిర్యలగూడ నుండి నకరికల్లకు తరలిస్తున్న 1188 బాటిల్లు మద్యం,ఒక వ్యక్తి ని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేయటం జరిగిందన్నారు  ఈరెండు కేసులో ముద్దాయిలని రిమాండ్ కి పంపుతున్నట్ల తెలిపారు 


మద్యం విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందన్నారు 


ఎంతో చాకచక్యంగా  మద్యం రవాణాకు అడ్డుకట్ట వేస్తున్న యస్ఐ నాగిరెడ్డి, సిబ్బంది ని అభినందించారు 


ఎవరైనా అక్రమ సంపాదనకు అలవాటుపడి చట్టవ్యతిరేకమైన మద్యం కౌనీ గుట్కా వంటి అమ్మకాలు జరిపినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమవేశంలో సిఐ ఉమేష్, యస్ఐ బాల నాగిరెడ్డి సిబ్బంది ఉన్నారు