ఇళ్ల నిర్మాణాల్లో లో కర్నూలు జిల్లా ముందుండాలి.

 ఇళ్ల నిర్మాణాల్లో  లో కర్నూలు జిల్లా ముందుండాలి.

 **జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్*




కర్నూలు జూన్ 7 (ప్రజా అమరావతి): ఇళ్ళ నిర్మాణంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కర్నూలు జిల్లా ముందుండాలని  జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నవరత్నాలు పేదలకు ఇల్లు పథకం కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ పిడి వెంకట నారాయణ ,ఈ ఈలు,డి ఈ లు, ఏఈ  లతో  కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల ప్రగతిలో జిల్లా వెనుకబడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.



ఇళ్ల నిర్మాణం ప్రగతిపై కలెక్టర్ సమీక్షిస్తూ,ఇళ్లను మ్యాపింగ్ చేయడం లోనూ, లబ్దిదారులను రిజిస్ట్రేషన్ చేయడంలోనూ, జియో ట్యాగింగ్ లోనూ జిల్లా ముందుందన్నారు.. కానీ జాబ్ కార్డుల మ్యాపింగ్ లో కొన్ని నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయన్నారు... పత్తికొండ నియోజక వర్గం లో 85 శాతం, నంది కొట్కూర్  నియోజకవర్గం లో  82 శాతం చేశారన్నారు.. పాణ్యం, డోన్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాలు జాబ్ కార్డుల మ్యాపింగ్ లో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు.   పురోగతి లో వెనుకబడిన నియోజక వర్గాల  డి ఈ లతో కలెక్టర్ మాట్లాడారు..కొంతమంది లబ్దిదారులు ఆర్థిక సమస్యల వల్ల ముందుకు రావడం లేదన్న డీ ఈ ల సమాధానం పై కలెక్టర్ సంతృప్తి చెందలేదు.. ఆర్థిక సమస్యలు అన్ని చోట్లా ఉన్నాయని, ఆ కారణంతో ఇళ్ళ నిర్మాణాలు అగిపోకూడదన్నారు..   డి ఆర్ డి ఎ సహకారం తీసుకుని మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం, ఇతర మార్గాలను అన్వేషించి, తద్వారా లబ్దిదారులను ఇళ్లు నిర్మించుకునేలా మోటివేట్ చేయాలన్నారు..

ఈ రోజు సాయంత్రం లోపు జాబ్ కార్డుల మ్యాపింగ్ లో పురోగతి సాధించాలని కలెక్టర్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు..


అన్ని నియోజక వర్గాల్లో ఇళ్ళ నిర్మాణాల grounding పూర్తయి  completion మీద ఫోకస్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. 


ప్రస్తుతం 177 లే అవుట్ లలో నీటి  సరఫరా పనులు పూర్తయ్యాయని, మిగిలిన అన్ని లేఅవుట్ లలో  కూడా పనులు పూర్తి కావాలని  ఆర్ డబ్ల్యు ఎస్ ఈ ని  ఆదేశించారు....  అలాగే అన్ని లేఅవుట్ లలో విద్యుత్ సరఫరా పనులు కూడా పూర్తి కావాలన్నారు..  విద్యుత్ మెటీరియల్ అవసరమైతే అదనంగా  తెప్పిస్తామన్నారు.  క్షేత్ర స్థాయిలో భూమి, ఇసుక సమస్యలు ఏమైనా వుంటే పరిష్కరిస్తామన్నారు.



కర్నూల్ జిల్లాకు జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా నియమితులైన ఎన్.మౌర్య కూడా టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొ ని, హౌసింగ్ ప్రగతి గురించి తెలుసుకున్నారు..


Comments