కరోనా కష్టకాలంలో బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్‌ అన్నదమ్ములకు బాసటగా వైఎస్సార్‌ వాహన మిత్ర*


అమరావతి (ప్రజా అమరావతి);


*నేడే (15వ తేదీ, మంగళవారం) వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం విడుదల*


*కరోనా కష్టకాలంలో బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్‌ అన్నదమ్ములకు బాసటగా వైఎస్సార్‌ వాహన మిత్ర*


*తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*‌


*2,48,468 మంది లబ్దిదారులకు రూ.248.47 కోట్ల ఆర్ధిక సాయం, నేరుగా రూ. 10,000 చొప్పున జమ*కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనా. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు వరసగా మూడో ఏడాది నెల రోజులు ముందుగానే వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 42,932 వేల మంది ఈ పధకానికి దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది లబ్ది పొందిన 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేడు (15 వ తేది) ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. మొత్తం 2,48,468 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ పధకంలో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నారు. 


*లబ్ధిదారుల్లో అధిక సంఖ్యలో బీసీలే..*


ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2,48,468 మంది లబ్ధిదారుల్లో 59,692 మంది ఎస్సీలు, 1,38,372 మంది బీసీలు,  9,910 మంది ఎస్టీలు ..40,494 మంది ఓసీలకు లబ్ది...మొత్తం లబ్దిదారుల్లో 83 శాతం బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల వారే.