జగనన్న కాలనీ లు అంటే ఒక్క హౌసింగ్ శాఖ పని మాత్రమే కాదు..అన్ని శాఖల భాగస్వామ్యం ఉండాలి - కలెక్టర్*

 కర్నూలు  (ప్రజా అమరావతి);


*జగనన్న ఇళ్ళ కాలనీలను  అన్ని వసతులతో,  స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన అందించే కొత్త  గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్*


*జగనన్న ఇళ్ల కాలనీలలో వసతుల ఏర్పాటుపై జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఎన్ మౌర్య, హౌసింగ్, ఇతర శాఖల అధికారులతో  జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్**జగనన్న కాలనీ లు అంటే ఒక్క హౌసింగ్ శాఖ పని మాత్రమే కాదు..అన్ని శాఖల భాగస్వామ్యం ఉండాలి - కలెక్టర్*


*అన్ని శాఖల అధికారుల సమన్వయంతో  సమగ్రమైన గ్రామ, పట్టణాభివృద్ధి తో కూడిన భవిష్యత్ కర్నూలు ప్రణాళిక ను రూపొందించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్*   


*జగనన్న కాలనీల్లో నివసించే ప్రజలకు అన్ని వసతులను సమకూర్చి, నాణ్యమైన జీవితాన్ని అందిద్దాం - కలెక్టర్*


 *ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలి ..నిధులు, నిర్వహణ గురించి ఆలోచించొద్దు.. ముందు సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రచించండి- నిధులు వనరుల గురించి మేము ఆలోచిస్తాం : కలెక్టర్**జగనన్న ఇళ్ళ కాలనీలకు రిసోర్సెస్ మొబెలై జేషన్ ప్లాన్ ,  వాటర్ సప్లై ప్లాన్ , పవర్ సప్లై ప్లాన్,  రోడ్ కనెక్టివిటీ ప్లాన్,  గ్రీనరీ ప్లాన్,  సోషల్  ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్,  livelihood ప్లాన్ లను రూపొందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశం**జగనన్న ఇళ్ళ కాలనీల నిర్మాణానికి ఇసుక, ఇటుకలు, మెటల్ తదితర నిర్మాణ మెటీరియల్ స్థానికంగా లభ్యమవుతుందా లేక ఎక్కడనుంచి సేకరించాలి అని లేఅవుట్ వారీగా, సెక్రటేరియట్ వారీగా మండల వారీగా, ఏ ఈ వారీగా, డిఈ వారీగా,నియోజక వర్గం వారీగా డీటెయిల్ గా ప్లాన్ చేసుకోవాలి*


*వనరుల కోసం ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి*


*వాటర్ సప్లై ప్లాన్ కింద నీటి వనరుల వివరాలతో పాటు కొత్తగా  ఉపాధి హామీ కింద  నీటి వనరులను అభివృద్ధి చేసే అవకాశం ఉందా పరిశీలించాలి - కలెక్టర్*


*ప్రతి లేఅవుట్ కు తాగునీటి సరఫరా తో పాటు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ వర్షపు నీటి నిర్వహణ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు ను ప్రణాళికలో చేర్చాలి - కలెక్టర్*


*1008 లేఅవుట్లలో పవర్ సప్లై ప్లాన్ పకడ్బందీగా ఉండాలి ..మెటీరియల్ కొరత ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలి.. ఎంత పవర్ కావాలి ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలి తదితర వివరాలతో ప్లాన్ను రూపొందించాలి..కలెక్టర్**ఎలక్ట్రిక్ పవర్ తో పాటు హైడల్, విండ్ ,సోలార్ పవర్ ల  వినియోగానికి సంబంధించిన ప్లాన్ కూడా రూపొందించాలి..కలెక్టర్*


*జగనన్న ఇళ్ళ కాలనీల్లో అంతర్గత రోడ్లతో పాటు రోడ్ కనెక్టివిటీకి  అప్రోచ్ రోడ్లు, సిసి రోడ్ల నిర్మాణానికి  ప్లాన్ ను రూపొందించాలి..అలాగే స్ట్రీట్ లైట్, ఇంటర్నెట్, తదితర వసతులను కూడా ప్లాన్లో చేర్చాలి.. కలెక్టర్*


*సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా ప్రతి కాలనీ కి హాస్పిటల్ స్కూల్, అంగన్వాడి సెంటర్ తో పాటు కమ్యూనిటీ హాల్, దేవాలయం ,మాస్క్ ,చర్చ్ స్మశాన వాటిక ల ఏర్పాటును కూడా ప్లాన్ లో  రూపొందించాలి*


*వసతుల ఏర్పాటుతో పాటు ఆర్థిక స్వావలంబన దిశగా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రతి లేఅవుట్ ఎం ఎస్ ఎం ఈ గాని  స్మాల్ స్కేల్  ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించి ప్రణాళిక రూపొందించాలి*

*భవిష్యత్తులో ఉపాధి లభించేలా ఈ ప్లాన్ లు ఉండాలి..  skill డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయాలి.. పరిశ్రమలశాఖ, drda, mepma, సంక్షేమ శాఖల అధికారులు ఈ దిశగా ప్లాన్ చేయాలి : కలెక్టర్ జి.వీర పాండియన్.