గ్రామాల్లో ఉన్న అన్ని తాగునీటి ట్యాంకులను మూడు రోజుల్లోపు క్లోరినేషన్, క్లీనింగ్ చేయించాలి.

 గ్రామాల్లో ఉన్న అన్ని తాగునీటి  ట్యాంకులను మూడు రోజుల్లోపు క్లోరినేషన్, క్లీనింగ్ చేయించాలి.*క్లోరినేషన్, క్లీనింగ్ అంశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు*


*జగనన్న  ఇళ్ళ కాలనీల లేఅవుట్ లలో  వంద శాతం నీటి సరఫరా పనులు పూర్తి కావాలి*


*జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి*


*వాటర్ గ్రిడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి*


*తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో పనులను చేపట్టి సమస్యలను పరష్కరించాలి*


*జూమ్ కాన్ఫరెన్స్ లో  అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్*


కర్నూలు జూన్ 9 (ప్రజా అమరావతి): గ్రామాల్లో  ఉన్న OHSR, GHSR ల తోంపాటు అన్ని రక్షిత నీటి పథకాలకు సంబంధించిన నీటి ట్యాంక్ లను  మూడు రోజుల లోపు క్లోరినేషన్, క్లీనింగ్ చేయించాలని జిల్లా కలెక్టర్ జి .వీరపాండియన్ డి పి ఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు . బుధవారం  jal jeevan mission , జగనన్న  ఇళ్ళ కాలనీ లలో నీటి సరఫరా పనుల పురోగతి, వాటర్ గ్రిడ్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్  జిలానీ సామూన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, ఈ ఈలు, డి ఈ లు, ఏ ఈ  లు, డి పి ఓ,  ఈవోపీఆర్డీ లతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు..


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ   నిర్దేశించిన సమయం లోపు వాటర్ ట్యాంకులను క్లోరినేషన్, క్లీనింగ్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.. జిల్లాలో కోసిగి, పాణ్యం కోడుమూరు,  కౌతాలం తదితర మండలాల్లో నీరు కలుషితమై కొన్ని మరణాలు సంభవించాయన్న విషయాన్ని  కలెక్టర్ గుర్తు చేశారు..  అయినప్పటికీ  నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను ప్రశ్నించారు.. ఈ అంశంలో నిర్లక్ష్యంగా ఉంటే  సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు . జిల్లాలో  నాలుగు వందల 91 నీటి ట్యాంక్ లను మూడు రోజుల లోపల క్లోరినేషన్, క్లీనింగ్ చేయకపోతే  సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని అని కలెక్టర్ హెచ్చరించారు..ఇకముందు క్రమం తప్పకుండా  క్లోరినేషన్, క్లీనింగ్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటిదాకా ఈ అంశం లో నిర్లక్ష్యం వహించిన అధికారులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ను  కలెక్టర్ ఆదేశించారు.


అలాగే సమగ్ర నీటి రక్షిత పథకాలు, సింగిల్ విలేజ్ స్కీమ్ మల్టీ విలేజ్ స్కీమ్  లను  రెగ్యులర్గా పర్యవేక్షించాలని, నిబంధనల ప్రకారం టెస్టింగ్ ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి పథకాల వ్యవస్థ మొతాన్ని పరిశీలించి, ఎక్కడెక్కడ   పైప్ లైన్ వ్యవస్థ దెబ్బతిని ఉందో సర్వే చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు.  కొన్ని ఏళ్ళ కిందట పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయటం వల్ల  దెబ్బతిని ఉండవచ్చు ఉన్నారు. ఎక్కడైనా మురికి నీరు మంచినీటిలో కలవడం లేదా ఇతర  రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్ పైప్ లైన్ వ్యవస్థలోకి వెళ్లడం జరుగుతోందా   సర్వే చేసి గుర్తించాలన్నారు.. ఏం చేస్తే నీరు కలుషితం కాకుండా ఉంటుందో దానికి ఎంత ఖర్చు అవుతుంది  అన్న విషయాలపై  ఒక నెల లోపల తనకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు*జగనన్న  ఇళ్ళ కాలనీల లేఅవుట్ లలో  వంద శాతం నీటి సరఫరా పనులు పూర్తి కావాలి*


నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జగనన్న ఇళ్ళ కాలనీ ల్లో  100% నీటి సరఫరా పనులు పూర్తి కావాలన్నారు. ఉన్నత స్థాయిలో ఈ అంశంపై నిరంతర పర్యవేక్షణ జరుగుతున్నందున ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 472 లేఅవుట్లలో నీటి సరఫరా పనులు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు ..ఆదోని డివిజన్ లో 166 పనులు పూర్తి కావలసి వుందని , వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


*జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి*


 ప్రతి నివాసిత ప్రాంతంలో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేసేందుకు  జల్ జీవన్ మిషన్  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని,    ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం సమీక్షించాలని,  ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, డి పి ఓ ,జడ్పీ సీఈవో సమన్వయంతో పనిచేసి  జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలన్నారు.  మండల స్థాయిలో ఎంపీడీవో, గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రెటరీ ఈ అంశాన్ని పర్యవేక్షించాలని తెలిపారు.ఈ పథకం  కింద ఇప్పటివరకు టెండర్లు పూర్తి చేసిన 228 పనులను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలన్నారు. అలాగే మిగిలిన పనులు కూడా టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్   ఎస్ ఈ ని ఆదేశించారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే త్వరితగతిన పరిష్కరించి పనులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు .అలాగే అయిదు లక్షల లోపు విలువ గలిగిన 148 పనులను కూడా వచ్చే 15 రోజుల లోపల పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు . jal jeevan mission పథకంలోకి కన్వర్ట్ అయిన ఎన్ ఆర్ డి డబ్ల్యూ పి పనులను కూడా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.


*వాటర్ గ్రిడ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి*


 డోన్ నియోజకవర్గం లో ఏర్పాటు చేస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు .రాష్ట్రంలో పులివెందుల, డోన్ ,ఉద్దానం ఈ ప్రాంతాల్లో మాత్రమే వాటర్ గ్రిడ్ మంజూరు అయిందన్నారు. ఏ మాత్రం నీటి వనరులు లేని డోన్ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల  తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.  6 మండలాల్లోని  138 నివాసిత ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతొందన్నారు.

అలాగే తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఎస్ డి ఆర్ ఎఫ్ కింద పనులను చేపట్టి,  సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు..

Comments