విజయవాడ (ప్రజా అమరావతి);:
రాబోయే రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయ
ని.. వాటిని అందిపుచ్చుకునేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం విజయవాడ బెంజ్ సర్కిల్ లో ప్రముఖ ఐటీ సంస్థ జీఎన్వీ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన శాఖతోపాటు లైఫ్ సైన్సెస్ ల్యాబ్ ను చల్లా మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ ఉద్యోగాలు పొందడాకికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం జీఎన్వీ ఐటీ సొల్యూషన్స్ ఏపీఎస్ఎస్డిసీతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల్లో స్థానికంగా ఉండే యువతకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చట్టం చేశారన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగానే ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆఫ్ లైన్ శిక్షణా కార్యక్రమాలు నిలిచిపోయినా.. విద్యార్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్ ద్వారా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చల్లా మధుసూదన్ రెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమం లో ఎపిఎస్ఎస్ డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డితోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.విజయ్ మోహన్ కుమార్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, జీఎన్వీ ఐటీ సొల్యూషన్స్ ఎండీ కల్యాణి, డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment