కాకాణి చేతుల మీదుగా నూతన గృహల శంకుస్థాపన

  కాకాణి చేతుల మీదుగా నూతన గృహల శంకుస్థాపన
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, "నవరత్నాలు పేదలందరికీ ఇల్లు" కార్యక్రమం కింద సరస్వతి నగర్ లోని "వై.యస్.ఆర్.జగనన్న కాలనీ" లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


సరస్వతి నగర్, వై.యస్.ఆర్.జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.


ఇళ్లు నిర్మించుకునే లబ్దిదారులకు కొత్తగా మంజూరైన కరెంటు మీటర్లను అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.
 పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించడంతో పాటు, 28 వేల కోట్ల రూపాయలతో 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభపరిణామం.


 సర్వేపల్లి నియోజకవర్గం లో ఒక్కొక్క ఇంటికి ఒక్క లక్ష 80 వేల రూపాయలు వెచ్చించి, తొలిదశలో 7,422 ఇళ్లు 134 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 20 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం.


 ఇళ్ల నిర్మాణానికి మూడు రకాల పద్ధతులు అనుసరిస్తున్నాం.


 మొదటి పద్ధతిలో ఇంటి నిర్మాణ సామాగ్రి సరసమైన ధరలకు ప్రభుత్వం ఇప్పించి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో అందించడం.


 రెండవ పద్ధతి ఇళ్ల నిర్మాణ బాధ్యత పూర్తిగా లబ్ధిదారుడే, భరిస్తే విడతలవారీగా ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి బిల్లులు చెల్లించడం.


 మూడో పద్ధతి లబ్ధిదారునికి సంబంధం లేకుండా, పూర్తి బాధ్యతలను అధికారులకు అప్పగించి, నాణ్యత ప్రమాణాలు పాటించి, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం.


*"వైయస్సార్ జగనన్న కాలనీ"* లలో ఇళ్లు మంజూరుతో పాటు, సొంత స్థలాలు, నివేశన స్థలాలు కలిగి ఉన్న వారు కూడా ఇళ్లు కావాలని కోరుకుంటే మంజూరు చేస్తాం.


 కాలనీలలో కేవలం ఇళ్లు నిర్మించి వదిలివేయడం కాకుండా, ఇళ్ల నిర్మాణంతో పాటు రోడ్లు, తాగునీరు, కరెంటు లాంటి అన్ని సదుపాయాలు కల్పిస్తాం.


 "వైయస్సార్ జగనన్న కాలనీ"* లలో ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఒక లక్షా 80వేలు వెచ్చిస్తే, సరాసరి ఒక్కొక్క ఇంటికి మౌలిక వసతుల కల్పన కోసం ఒక లక్షా 50 వేలు ఖర్చు చేస్తున్నాం.


 ఇళ్ల స్థలం అందించి, ఇంటిని నిర్మించి ఇవ్వడంతో ఒక్కొక్క కుటుంబానికి 5లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరే అవకాశం కలిగింది.


 తెలుగుదేశం ప్రభుత్వంలో మాదిరిగా జన్మభూమి కమిటీ సిఫార్సుతో ఇళ్లు మంజూరు చేసే విధానానికి స్వస్తి పలికి, పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి, అర్హత కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం.


 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వడంతోపాటు, ఆ ఇంటి స్థలాన్ని రిజిస్టర్ చేసి లబ్ధిదారునికి సర్వహక్కులు కలుగజేసి, అనుభవించుకోగలిగే ఆస్తిగా అందించాలని యత్నిస్తే, చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అడ్డుకోవడం దుర్మార్గం.


 ఇళ్ల స్థలాలు రానివారు ఎవరైనా ఉంటే, ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాల పట్టా అందించే బాధ్యత నాది.


 ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.


 అర్హత కలిగి ఇళ్ల స్థలం రానివారు ఇప్పుడు నమోదు చేసుకున్నా, 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తాం.


 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతోపాటు, కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడకుండా కరోనా నివారణకు ఆనందయ్య ఆయుర్వేద మందును ప్రతి ఇంటికి పంపిణీ చేస్తాం.


 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 2 సార్లు శాసన సభ్యునిగా అవకాశమిచ్చి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించే భాగ్యం కల్పించినందుకు, చేతులు జోడించి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.