ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

 

అమరావతి (ప్రజా అమరావతి);


*వైయస్సార్‌ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభోత్సవం*

*క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్ధాపన చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌


.


*అనసూరి దుర్గ, లబ్దిదారు, ఆలమూరు, తూర్పు గోదావరి జిల్లా.*


*మాది చాలా పేద కుటుంబం, మేం నలుగురం అక్కా చెల్లల్లం, మాకు అన్న లేడు. నువ్వే మాకు అన్నవి... మాకు ఆడపడుచు కట్నం కింద ఒక రూ.15 లక్షలు ఆస్తి ఇచ్చావు. చాలా ఆనందంగా ఉంది అన్న.*


నమస్తే జగనన్న బాగున్నావా ? సంవత్సరాల తరబడి నుంచి మేం పూరి గుడిసెల్లో పడి ఉన్నా, మమ్మెల్ని ఎవరూ పట్టించుకోలేదు. మంచినీళ్లు కూడా లేవు. వర్షం వస్తే తడిసిపోవడమే. అన్నా.. నువ్వు సీఎం అయిన తర్వాత మా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్న వచ్చి అమ్మా జగనన్న సీఎం అయ్యారు. మీ ఇంటి కల నెరవేరుతుంది అని చెప్పారు. అన్నట్టే మీరు పంపిన వలంటీరు వచ్చి అమ్మా మీకు ఇళ్లు శాంక్షన్‌ అయింది. రూ.1 లక్షా 80 వేలు గ్రాంట్‌ శాంక్షన్‌ అయింది అని చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాలాంటి పేదలకు ఇది కల. మేము ఎప్పటికీ ఇళ్లు కట్టుకోలేం. డిసెంబరు 25న పట్టాలు పంపిణీ చేశారు. ఆ రోజు క్రిస్మస్‌ పండగ... అది ప్రతి సంవత్సరం వస్తుంది...ఇళ్ల పట్టాల పంపిణీ పండగ ఎప్పుడూ రాలేని పండగ. మాకు ఇంటి సైట్‌ ఎమ్మార్వో ఆఫీసు పక్కనే మెయిన్‌రోడ్డుకి ఆనుకుని వచ్చింది. సైటు విలువ రూ.10 లక్షలు ఉంటుంది. అలాంటిది మేం కొనుక్కుని కట్టుకోలేం. మాలంటి పేదవాళ్లకి అలాంటి గొప్ప ఇళ్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇంత ఆస్ధికి వారసులవుతామా అన్న ఆలోచన చాలా బాగుంది అన్న.  మేం భార్యాభర్తలం కష్టపడితేనే రోజు గడవని మేం.. ఇలాంటి ఇళ్లు కట్టుకుంటున్నాం. కాలనీలో రోడ్లు, మంచినీటి సరఫరా, కరెంటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 

మాది చాలా పేద కుటుంబం, మేం నలుగురం అక్కా చెల్లెల్లం, మాకు అన్న లేడు. నువ్వే మాకు అన్నవి... మాకు ఆడపడుచు కట్నం కింద ఒక రూ.15 లక్షలు ఆస్తి ఇచ్చావు. చాలా ఆనందంగా ఉంది అన్న. 70 సంవత్సరాలు వయస్సు వచ్చినా గతంలో మా నాన్నగారికి పించన్‌ రాలేదు, మీరు ముఖ్యమంత్రి అయ్యాక పించన్‌ తీసుకున్నారు. ఆయన నా తరపున మీకు కృతజ్ఞతలు చెప్పమన్నాడు. 

అన్నా మా తరమే కాదు, మా పిల్లలు తరంలో కూడా నువ్వే ముఖ్యమంత్రి కావాలని మా ఆడపడుచులందరం కోరుకుంటున్నాం. అన్నా. 


*అమరావతి, లబ్దిదారు, పుంగనూరు, చిత్తూరు జిల్లా*


*నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంతింటి కల నెరవేరింది అన్నా, నా పిల్లలు కూడా మా మేనమామ ఇళ్ళు ఇచ్చారు అని సంతోషంగా ఉన్నారు. నాది ఒక చిన్న కోరిక అన్నా...దసరా నాటికి నా ఇంటిని పూర్తిచేస్తాను అన్నా, మీరు మా గృహప్రవేశానికి రావాలని కోరుకుంటున్నా అన్నా* 


అన్నా మిమ్మల్ని చూస్తుంటే నోట మాట రావడం లేదు. నేను నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను, నేను పుంగనూరులో గత పదిహేను ఏళ్ళుగా అద్దె ఇంటిలో నివాసం ఉన్నాను, నాకు సొంత ఇల్లు లేదన్న భాద ఉండేది, నా పిల్లలు కూడా అడిగేవారు మనకి సొంత ఇల్లు లేదా అని, కానీ నేనే సర్ధిచెప్పుకునేదానిని. మీరు పాదయాత్రలో పేదలందరికీ ఇళ్ళు ఇస్తామన్నారు, నేను మీరు గెలవాలని కోరుకున్నా, మీరు గెలిచారు, నాకు 4 లక్షల రూపాయల విలువైన ఇంటి స్ధలం ఇచ్చారు, అలాగే ఇళ్ళు కట్టుకోవడానికి సామాగ్రి అంతా ఇచ్చారు. మా లే అవుట్‌ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నా ఇల్లు నేనే కట్టుకోగల ధైర్యం వచ్చింది మీ వల్లే అన్నా. గతంలో చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు వెళ్ళారు కానీ ఎవరూ ఇంత సాయం చేయలేదు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంతింటి కల నెరవేరింది అన్నా, మీరు చేతల ముఖ్యమంత్రి అన్నా, నా పిల్లలు కూడా మా మేనమామ ఇళ్ళు ఇచ్చారు అని సంతోషంగా ఉన్నారు. నాది ఒక చిన్న కోరిక అన్నా...దసరా నాటికి నా ఇంటిని పూర్తిచేస్తాను అన్నా, మీరు మా గృహప్రవేశానికి రావాలని కోరుకుంటున్నా అన్నా 


*గంధం అపరంజని, లబ్దిదారు, మార్టేరు గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా*


*నేను ఏ నాయకుడి దగ్గరకు వెళ్ళలేదు, మా వలంటీర్‌ దగ్గర దరఖాస్తు చేయగానే వెంటనే ఇల్లు మంజూరు అయింది. ఈ కరోనా కాలంలో కూడా మేం తినగలుగుతున్నామంటే మీ వల్లే అన్నా*


జగనన్నా మీరు సంక్షేమ పాలన దిగ్విజయంగా రెండేళ్ళు పూర్తిచేసుకున్నందుకు ముందుగా శుభాకాంక్షలు. అన్నా మాది పేద కుటుంబం, అద్దె ఇళ్ళలో ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో మీటింగ్స్‌కు వెళ్ళి దరఖాస్తు చేశాను, కానీ అడుగు భూమి ఇవ్వలేదు. కానీ మీరు మా పేదల పాలిట దేవుడిలా మాకు ఇళ్ళపట్టా ఇచ్చారు, నేను ఏ నాయకుడి దగ్గరకు వెళ్ళలేదు, మా వలంటీర్‌ దగ్గర దరఖాస్తు చేయగానే వెంటనే ఇల్లు మంజూరు అయింది. ఈ కరోనా కాలంలో కూడా మేం తినగలుగుతున్నామంటే మీ వల్లే అన్నా, నేను ఇల్లు స్వయంగా కట్టుకుంటున్నా, నా ఇంటి గృహప్రవేశానికి మీరు రావాలని కోరుకుంటున్నా అన్నా, మీరు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉన్నారు అన్నా, మీరే మా దేవుడు అన్నా.


*లక్ష్మీ పార్వతి, లబ్దిదారు, బెజ్జుపురం, లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా.*


*మీరిచ్చిన డబ్బులు మేం వృధా చేయకుండా టైలరింగ్‌ ఇతర పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నం సర్‌. మా పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాం. మేం ఇలా సంతోషంగా ఉండటానికి కారణమైన మీరు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండాలి.* 

 

మాది ఉమ్మడి కుటుంబం, చిన్న ఇళ్లు. చాలా ఇబ్బంది పడుతున్నాం. నవరత్నాల కానుకగా పేదలందరికీ ఇళ్లు ఇచ్చారు. మిమ్నల్ని ఎప్పుడూ మా హృదయాల్లో ఉంచుకుంటాం. సెంటున్నర ఇంటి స్ధలం ఇచ్చారు. మీకు రుణపడి ఉంటాం. కావాల్సినంత ఇసుక ఉచితంగా ఇచ్చినందుకు ధన్యవాదములు. సిమెంటును కేవలం రూ.230కే ఇవ్వడం సంతోషంగా ఉంది. మా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటాం. మా హృదయాల్లో ఉంచుకుంటాం. మీరు ఇంటికి వచ్చి మా చేతి వంట ఒక రోజు తింటే మాకు చాలా సంతోషం. మాకంటూ ఒక సొంతిళ్లు ఉందని గర్వంగా చెప్పుకుంటాం. అలా చెప్పుకునేటట్టు మీరు చేశారు జగనన్న..  మీరిచ్చిన డబ్బులు మేం వృధా చేయకుండా టైలరింగ్‌ ఇతర పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నం సర్‌. మా పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాం. మేం ఇలా సంతోషంగా ఉండటానికి కారణమైన మీరు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండాలి. మీరు మా హృదయాల్లో ఉంటారు. జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం సర్‌. జీవితాంతం మీరే సీఎంగా ఉండాలి. ధాంక్యూ జగనన్న.

Comments