ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు బాసటగా వైఎస్సార్ వాహన మిత్ర.

 


అనంతపురం జిల్లా (ప్రజా అమరావతి);


*ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ లకు బాసటగా వైఎస్సార్ వాహన మిత్ర*



*: కరోనా కష్టకాలంలో ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న డ్రైవర్ అన్నదమ్ములు*


అనంతపురం, జూన్ 15 :


*సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం బాసటగా నిలుస్తోంది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకుఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్, మరమ్మత్తులు, ఇతర అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి ఏటా 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడంలో భాగంగా వరుసగా మూడో ఏడాది బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించడం జరిగింది. అనంతపురం జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద 12,420 మంది లబ్ధిదారులకు రూ.12.42 కోట్లు బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో సైతం ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి డ్రైవర్ అన్నదమ్ములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.*


*1)ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం..*

*: ఎస్.  చందన (ఎస్సి), ఓబులదేవర నగర్, అనంతపురం జిల్లా.*


నేను 10 వ తరగతి వరకు చదివాను మాది నిరుపేద ఉమ్మడి కుటుంబం. కుటుంబ పోషణ కొంత వరకు నా పై ఆధారపడి ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన సమయంలో ముచ్చటగా మూడో సారి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా రూ. 10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నందునకు మాలాంటి పేదలు ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని అనంతపురంలోని ఓబులదేవర నగర్ కు చెందిన లబ్ధిదారురాలు ఎస్.చందన తెలిపింది. కుటుంబ పోషణ కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎనలేనిదని తన అభిప్రాయంను తెలిపింది.


*2) కష్టకాలంలో ఆదుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు..*

*: హుస్సేనప్ప, ఎఎస్ఆర్ నగర్, అనంతపురం జిల్లా.*


కరోనా కారణంగా గత సంవత్సరకాలం పైగా మాలాంటి ఆటో, క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ లు ఎంతో నష్టపోయాం. సరైన ఆటో బాడుగ లేక సంసారాన్ని గడపడానికి అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొంటున్నాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆదుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఆందోళన చెందుతున్న మాలాంటి అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మా కష్ట సుఖాలు గుర్తిస్తున్న జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్, ఫిట్నెస్ మరమ్మతులు ఇతర అవసరాల నిమిత్తం రూ. 10,000 నేరుగా ఖాతాల్లోకి జమ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పథకం ద్వారా మాకు ఆర్థిక భరోసాతో పాటు ఊరట లభిస్తుందని తన ఆనందాన్ని లబ్ధిదారుడు వ్యక్తంచేశారు.


*3)అన్ని వర్గాలను ఆదుకుంటున్న సీఎంకు కృతజ్ఞతలు*

*: జె. మాధవ, నారాయణపురం పంచాయతి, అనంతపురం జిల్లా.*


వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఎస్సీ ,ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల్లోని లబ్ధిదారులకు వరుసగా మూడో ఏడాది రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాహన యజమాని హక్కులను బదలాయింపు పొందిన నాకు కూడా ఈ సంవత్సరం లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఎంతో హర్షించదగ్గ విషయం. దేశంలో ఎక్కడలేని విధంగా సొంత వాహనాలు ఉన్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ లబ్ధిదారులకు ప్రతియేటా ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఘనత దక్కుతుంది. 


*4)ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంకు ధన్యవాదాలు*

*: హమీదాబాను, రాజుకాలనీ, అనంతపురం జిల్లా.*


ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఆటో డ్రైవర్ల సమస్యలను కష్టాలను స్వయానా చూశారని, అధికారంలో రాగానే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా న్యాయం చేకూర్చుతున్నారు. వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత వాహనాలు కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఇబ్బందులను గుర్తించి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం చాలా ఆనందంగా ఉంది. తాను మూడవ సారి లబ్ది పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  కష్టకాలంలో కూడా మాలాంటి పేద బతుకుల్లో జగనన్న ప్రభుత్వం వెలుగు నింపుతున్నందుకు  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 


*5)ఇలా ఎవరు ఆదుకోలేదు..*

*: దాదా ఖలందర్, పాపంపేట, అనంతపురం జిల్లా.*


 వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి... ఆటో డ్రైవర్ అయిన నాకు 10 వేల రూపాయల చొప్పున ఇప్పటికే రెండు సార్లు బ్యాంకులో అకౌంట్లో జమ చేశారు. ప్రస్తుతం మూడో సారి కూడా ఈరోజు నా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో పదివేల రూపాయలు జమ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆటోడ్రైవర్ల బాధలు అర్థం చేసుకోలేదు. ఆదుకోలేదు ప్రతి ఏటా ఆటోడ్రైవర్లకు రూ.10,000 అందజేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబ్బులతో  ఆటో ఇన్సూరెన్స్, సీట్లు, కవర్లు, ఆటో రంగులకు ఉపయోగిస్తాను. గతంలో చేతినుంచి డబ్బులు పెట్టుకునే వాళ్ళము. ముందుగానే తేది చెప్పి ఈ  సాయం అందిస్తుండడం గొప్ప విషయం. ఒకపక్క కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి సాయం చేస్తుండటం చాలా గొప్ప విషయం.



Comments