జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పధకం

  కాకినాడ (prajaamaravati);

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకం మొదటి దశ క్రింద జిల్లాలోని జగనన్న హౌసింగ్ కాలనీలలో గృహనిర్మాణ పనులను కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు గ్రామం, ఎర్రకాలనీలో  ఈ నెల 3వ తేదీ గురువారం ఉదయం 11 గం.లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. 

జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పధకం మొదటి దశ క్రింద 825 లేఅవుట్లలో ఒక్కక్కటీ లక్షా 80 యూనిట్ వ్యయంతో మొత్తం 1,48,526 గృహాలను మంజూరు చేశారు.  ఈ గృహాలను 2,673 కోట్ల నిధులతో నిర్మిస్తుండగా, మరో 41 కోట్ల 12 లక్షల నిధులతో జగనన్న కాలనీలలో అన్ని మౌళిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకూ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న వెఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాల ద్వారా జిల్లాలో అన్ని నియోజక వర్గాలలో ఒక లేఅవుట్ చొప్పున  మొత్తం 10,050 గృహాలకు శంకుస్థాపన చేస్తున్నారు.   

నియోజ వర్గాల వారీగా శంకుస్థాపన కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయిః

కొత్తపేట నియోజక వర్గం పరిధిలో ఆలమూరు గ్రామం, ఎర్రకాలనీ లే అవుట్ లో 340 ఇళ్లు, కాకినాడ రూరల్ పరిధిలో నేమాం-3 లేఅవుట్ లో 800, పెద్దాపురం నియోజక వర్గం పరిధిలో సామర్లకోట లేఅవుట్ లో 800, రాజమహేంద్రవరం సిటీ నియోజక వర్గం, వెలుగుబంద లేఅవుట్ లో 100, అమలాపురం నియోజక వర్గం పరిధిలో, అమలాపురం, చిందాడగరువు-1  లేఅవుట్ లో 120,  ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో చొల్లంగి లే అవుట్ లో 420, రాజోలు నియోజక వర్గం పరిధిలో రాజోలు, పొదలాడ లేఅవుట్ లో 170, పి.గన్నవరం నియోజక వర్గం పరిధిలో మొగలికుర్రు లేఅవుట్ లో 25, పిఠాపురం నియోజక వర్గం పరిధిలో, కుమారపురం లేఅవుట్ లో 950, రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో వేమగిరి-2 లేఅవుట్ లో 400, రాజానగరం నియోజక వర్గ పరిధిలో మునికూడలి లేఅవుట్ లో 750, జగ్గంపేట నియోజక వర్గ పరిధిలో కాట్రావులపల్లి లేఅవుట్ లో 750, ప్రత్తిపాడు నియోజక వర్గ పరిధిలో ఒమ్మంగి లేఅవుట్ లో 650 , తుని నియోజక వర్గ పరిధిలో తొండంగి మండలం, ఏ.కొత్తపల్లి లేఅవుట్ లో 700, రామచంద్రపురం నియోజక వర్గ పరిధిలో, ద్రాక్షారామం లేఅవుట్ లో 775, అనపర్తి నియోజక వర్గ పరిధిలో బిక్కవోలు మండలం, కొంకుదురు లేఅవుట్ లో 1000, మండపేట నియోజక వర్గ పరిధిలో  వేములపల్లి-10ఏ లేఅవుట్ లో 1100, కాకినాడ సిటీ నియోజక పరిధిలో కొమరగిరి లేఅవుట్ లో 200 చొప్పున గృహాలకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.