పల్నాడు ప్రాంతాన్ని నీటితో శశ్యస్యామలం చేస్తాం*

 *త్వరగా వరికెపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం*

*-పల్నాడు ప్రాంతాన్ని నీటితో శశ్యస్యామలం చేస్తాం*

*-తాగు, సాగు నీటిని పుష్కలంగా అందిస్తాం*

*-ప్రాజెక్టు నిర్మాణంలోని అన్ని అంశాలను పూర్తి చేసుకుంటూ అడుగులు వేస్తున్నాం*

 *-నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు*

*-ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని  పరిశీలించి, వరికెపూడిశెల ప్రాంతాన్ని సందర్శించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,  కలెక్టర్‌  వివేక్‌ యాదవ్‌*

మాచర్ల (ప్రజా అమరావతి);


పల్నాడు ప్రాంత ప్రజల 7దశాబ్ధాల కల వరికెపూడిశెల ప్రాజెక్టును అత్యంత  త్వరగా పూర్తిచేసి పల్నాడును నీటితో శశ్యస్యామలం చేస్తామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడుకి తాగు, సాగు నీటిని పుష్కలంగా అందించే  వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో ఇమిడి ఉన్న అన్ని అంశాలను పూర్తి  చేసుకుంటూ అడుగులు వేస్తున్నామని, 2024 ఎన్నికల్లోపే ప్రాజెక్టును పూర్తి చేసి నీరందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు.  ప్రాజెక్టు నిర్మాణానికి  సేకరించాల్సిన అటవీ భూమిని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పనులు చేపట్టబోయే ప్రాంతాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, అధికారులు  సందర్శించారు.  

ఎంపీ  శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వల్ల దిగువ ప్రాంతాలకు నీరందుతోంది కానీ, ఎగువ ప్రాంతాల పరిస్థితి  అత్యంత  దయనీయంగా ఉందని ఆవేదన  వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో  ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను, అవసరాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించామని..ఆనాడే ఈ ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం ఎన్నో ముందడుగులు వేసిందన్నారు. మొదటి దశ నిర్మాణానికి రూ.350కోట్లు కేటాయించందని, ఇప్పటి వరకు మొత్తం రూ.1623 కోట్లకు ఆమోధం తెలిపినట్లు చెప్పారు. రెండో దశలో డీపిఆర్‌కు రూ.2కోట్లు కేటాయించినట్లు  చెప్పారు. ఈ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన విషయం.. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు  భూమి సేకరణ.. ఈ ప్రక్రియను కూడా త్వరగా  పూర్తి చేసేందుకు  కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌తో కలసి ఈరోజు  సందర్శించినట్లు తెలిపారు. ప్రాజెక్టు  కోసం సేకరించాల్సిన 28 ఎకరాలకు  బదులు.. అటవీ శాఖకు ఇవ్వాల్సిన 56 ఎకరాల పరిహార భూమిని సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఈ సందర్భంగా ఎంపీ కోరారు. అటవీ అనుమతుల నివేదికలు కేంద్రానికి పంపితే క్లియరెన్స్‌కు 6నెలల కాలం పడుతుందని తెలిపారు. పల్నాడు జలప్రధాయని అయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి  ప్రజలకు నీటి కొరత లేకుండా  చూస్తామని స్పష్టం చేశారు.

Comments