అమరావతి (ప్రజా అమరావతి);
*వరుసగా రెండో ఏడాది జగనన్న తోడు పథకం
*
*చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణం మంజూరు చేసే జగనన్న తోడు కార్యక్రమానికి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా 3.7 లక్షల అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లో నేరుగా రూ.370 కోట్లు జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్*
*వైయస్‌ఆర్ జగనన్న తోడు రెండో దశ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ....:*
ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 9.05 లక్షల మంది నిరుపేదలు, రోడ్లమీద, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ, బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక, అవస్ధలు పడుతూ.. అష్టకష్టాలు పడుతున్న వారికి... మంచి చేసే కార్యక్రమం జగనన్న తోడు రెండోదశకు దేవుడి దయతో శ్రీకారం చుడుతున్నాం.
*పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశాను.*
వ్యవస్థలను, బ్యాంకులను పేదవాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకుని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లుగా ఖచ్చితంగా భావించాలి. నా పాదయాత్రలో కూడా పేదలకు సంబంధించి ఎన్నెన్నో కథలు చూశాను. పేదలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వంద రూపాయలకు రోజుకు పది రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి వారిది. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీకి, వడ్డీలేని రుణాలు వారికి దొరుకుతాయా అంటే... ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించ లేదు. అటువంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధికవడ్డీలకు అప్పులు తీసుకుని వందరూపాయలకు రోజుకు పదిరూపాయలు కడుతూ జీవితాన్ని నడుపుతున్నారు. ఇవన్నీ చూసిన తరువాత పాదయాత్ర సమయంలో వీరి తలరాతలు మార్చే అవకాశం దేవుడు ఇస్తే, ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పాను. అదే విషయాన్ని మేనిఫేస్టోలో పెట్టాను. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తుండటం సంతోషం కలిగిస్తోంది.
*తొలివిడతలో 5.35 లక్షల లబ్ధిదారులు*
గతంలో 5.35 లక్షల మందికి బ్యాంకులు ఇచ్చే రుణాలకు ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది, ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది, మీరు రుణాలు ఇవ్వండి, వారు సకాలంలో చెల్లిస్తారని చెప్పాను. జగనన్న తోడు కింద మొత్తం 9.05 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, తొలివిడతలో 5.35 లక్షల మందికే బ్యాంకుల నుంచి రుణాలు వచ్చాయి. మిగిలిన 3.70 లక్షల మందికి బ్యాంకులతో మళ్లీ మాట్లాడి, వారిపై ఒత్తిడి తెచ్చి, బ్యాంకుల నుంచే కాకుండా ఆప్కాబ్, స్త్రీ నిధి వంటి బ్యాంకులను కూడా రంగంలోకి తీసుకువచ్చి, మిగిలిన 3.70 లక్షల మందికి ఈ రోజు రుణాలు ఇప్పిస్తున్నాం.
వారి దరఖాస్తులను కూడా వెరిఫికేషన్ చేయించి, అర్హత ఉంది అని తేలిన ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ... అడుగులు ముందుకు వేయగలిగాం అని సగర్వంగా తెలియచేస్తున్నాను.
*అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న తోడు*
ఈ పథకం ద్వారా దాదాపుగా రుణాలు ఎవరికి అందుతున్నాయి... అర్హులు ఎవరని చూస్తే... గ్రామాలు, పట్టణాల్లో సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు స్థలం, అంతకన్నా తక్కువ స్థలంలో శాశ్వత, తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు అర్హులు. అలాగే పుట్ పాత్‌లు, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు, సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలివీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు చేసేవారు, లేస్, కళంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడిన చిరు వ్యాపారులందరికీ జగనన్న తోడు కింద పదివేల రూపాయలు వడ్డీలేని రుణాలు అందచేస్తున్నాం.
*చిరువ్యాపారులకు రివాల్వింగ్ పద్దతిలో రుణం*
బ్యాంకుల నుంచి లభించిన రుణాలను వడ్డీతోసహా సకాలంలో చిరువ్యాపారులు బ్యాంకులకు చెల్లిస్తే, వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. దీనివల్ల రుణం తీసుకున్న వారికి తిరిగి సకాలంలో చెల్లించాలనే క్రమశిక్షణ వస్తుంది. ఆ తరువాత బ్యాంకులు ఎంత అయితే చిరువ్యాపారులు తిరిగి రుణం బ్యాంకులకు చెల్లిస్తారో, అంతే రుణంను తిరిగి వారికి మళ్లీ ఇస్తారు. ఈ రకంగా ఈ పదివేల రూపాయలు రివాల్వింగ్ పద్దతిలో ఈ సొమ్ము చిరు వ్యాపారులకు అందుబాటులో ఉంటుంది. ఇది వీరి జీవితాలను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
*రెండోవిడతలో రూ.370 కోట్ల మేరకు రుణాలు*
రుణం మొత్తం తీరిన తరువాత ఇదే లబ్ధిదారులకు మళ్ళీ వడ్డీలేని రుణాలు పొందే అవకాశం ఉంది. బ్యాంకులు వారికి మళ్లీ వడ్డీలేని రుణాలు ఇస్తాయి. లబ్ధిదారులకు సున్నావడ్డీని వర్తింప చేస్తున్న ప్రభుత్వం ఆ కట్టిన వడ్డీ సొమ్మును లబ్ధిదారులకు తిరిగి చెల్లించే కార్యక్రమం చేస్తుంది. ఈ రోజు 3.70 లక్షల మంది చిరువ్యాపారులకు బ్యాంకుల నుంచి వారి ఖాతాలకు పదివేల చొప్పున ఈరోజు రూ.370 కోట్లు రుణం జమ చేయడం జరుగుతోంది. ఈ రోజు ఈ మూడువందల డెబ్బై కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించడమే కాకుండా తొలి విడతలో 5.35 లక్షల మందికి ఇచ్చిన రుణాలకు వారు సకాలంలో బ్యాంకుకు చెల్లించిన వడ్డీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాలో, రేపో జమ చేయడం జరుగుతుంది.
*జగనన్న తోడుకు దరఖాస్తులు నిరంతర ప్రక్రియ*
9.05 లక్షల మందికి ఈ పథకం పూర్తిగా ఉపయోగపడుతోంది. చిరువ్యాపారులకు ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు చొప్పున రివాల్వింగ్ పద్దతిలో వారు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఈ వడ్డీలేని రుణం ఉపయోగపడుతుంది. దీనిలో ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా 1902 అనే నంబర్‌కు ఫోన్ చేస్తే వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేపడుతుంది. ఏ ఒక్కరికైనా అర్హత ఉండి రుణం రాలేదనే పరిస్థితి ఉంటే, ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు, వారి సమీపంలోని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు, లేదా వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసినా సరిపోతుంది. దీనిపై సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో వలంటీర్లు పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో చూసి, వాటిని పరిశీలించి, ఆరునెలలకు ఒకసారి తిరిగి వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. తమకు ఈ పథకం రాలేదని ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. ఇప్పడు రాకపోయినా, తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఆరు నెలల్లో వారికి సున్నావడ్డీ రుణాలు లభిస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా 9.05 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపాలని, జగనన్న తోడు కార్యక్రమం చేసే అవకాశం నాకు ఇచ్చినందకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనివల్ల పేదింటి అక్కచెల్లెమ్మలు, పేదింటి అన్నదమ్ములకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
అనంతరం కంప్యూటర్‌లో బటన్ నొక్కడం ద్వారా 3.7 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.370 కోట్లు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
*పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి*
*జగనన్న తోడు ద్వారా చిరువ్యాపారులకు పెద్ద సాయం*
*సీఎం శ్రీ వైయస్ జగన్ చేసే ప్రతి పని పేదల కోసమే*
*సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు*
*మేనిఫేస్టోలో ఇప్పటికే 96శాతం నెరవేర్చారు*
ప్రజలకు ఇచ్చిన మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా మంచి పాలన సాగుతుందో ఏపీలో జరుగుతున్న పాలన దానికి నిదర్శనం. గతంలో అనేకమంది సీఎంలు వచ్చారు. ఎన్నికల ముందు చెప్పిన హామీలను, అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది మరచిపోయేవారు. చివరికి వారి పార్టీ వెబ్‌సైట్ నుంచి కూడా సదరు హామీలను తొలగించడం చూశాం. కానీ చెప్పిన మాట కోసం పట్టుదలగా, పేదవారికి ప్రభుత్వం సాయం చేయాలి, ప్రతి పేదవారి కష్టాన్ని తీర్చాలనే తపనతో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు పనిచేస్తున్నారు. దానిలో భాగంగా చిరువ్యాపారుల కష్టాలను తీర్చాలన్న ఆయన ఆలోచనలు నేడు కార్యరూపం దాలుస్తున్నాయి. ఇప్పుడు సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అందిస్తున్న ఈ పదివేల రూపాయల రుణం చిన్నదిగా కనిపిస్తున్నా... చిరువ్యాపారులకు మాత్రం చాలా పెద్ద సహాయం. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం శ్రీ వైయస్ జగన్ పాలన ఆదర్శంగా నిలుస్తోంది. రెండేళ్ళ పాలనలో సీఎం శ్రీ వైయస్ జగన్ ఏం చేసినా అది పేదల కోసమే ఆలోచించి చేస్తారనే మాట మరోసారి రుజువవుతోంది.
ఎన్నికల ముందు శ్రీ వైయస్ జగన్ గారు దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి... పేదల కష్టాలను, వారి సమస్యలను విని అర్థం చేసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు మేనిఫేస్టోలో పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 96 శాతం నెరవేర్చారు. వాటిల్లో భాగంగానే నేడు జగనన్న తోడు కింద 9.05 లక్షల మంది చిరువ్యాపారులకు అండగా నిలిచారు. తొలి విడతగా 5.35 లక్షల మంది చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రూ.పదివేల చొప్పున రుణాలు ఇప్పించారు. వారు సకాలంలో బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తరుపున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మిగిలిన 3.70 లక్షల మంది చిరువ్యాపారులకు నేడు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆప్కాబ్ పర్సన్ ఇంఛార్జ్ ఎ.బాబు, గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్ నారాయణ భరత్ గుప్త, సెర్ప్ సీఈఓ రాజాబాబు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, ఆప్కాబ్ ఎండీ శ్రీనాధరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment