క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తిచెప్పాలని నిర్ణయం.*వైఎస్‌ఆర్‌ బీమాపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష*


*కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్‌ బీమాలో మార్పులు చేర్పులు*

క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తిచెప్పాలని నిర్ణయం.


*వైయస్సార్‌ బీమాపై సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ కీలక నిర్ణయాలు*

*మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం*

*కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం*

*అదే సంపాదించే వ్యక్తి, 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5లక్షల ఆర్థిక సహాయం*

*జులై 1  నుంచి కొత్తమార్పులతో వైయస్సార్‌బీమా అమలు* 

*ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన వారి క్లెయిములను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం*

*జులై 1లోగా ఈ క్లెములన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం*

*రైతుల మరణాలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులు మరణించినా తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీకూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని సీఎం ఆదేశం*

*దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం*


అమరావతి (ప్రజా అమరావతి);


– వైయస్సార్‌ బీమాపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమగ్ర సమీక్ష

– పథకంలో అమల్లో సాధకబాధకాలను వివరించిన అధికారులు

– గతంలో ఇది గ్రూప్‌ ఇన్సూరెన్స్‌గా ఉండేదన్న అధికారులు

– ప్రీమియంలో సగం కేంద్రం చెల్లించేందన్న అధికారులు

– ఈ స్కీంనుంచి కేంద్రం వైదొలిగిందని తెలిపిన అధికారులు

– దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 1.41 కోట్ల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆదుకునేలా వైయస్సార్‌ బీమాను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపిన అధికారులు 

– కాని, బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం, బీమాకు లింకేజి చేయడం, తీరా లింకేజి చేసిన తర్వాత ఆ క్లెయిములు పరిష్కారం కాకపోవడం తద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వెల్లడించిన అధికారులు

– రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ప్రీమియంను చెల్లించినా సరే ఖాతాలను తెరిచి, బీమాకు అనుసంధానం చేయడంలేదని తెలిపిన అధికారులు.

– బీమా కింద అర్హతకోసం ఎన్‌రోల్‌చేయించుకునేందుకు లక్షలకొద్దీ అప్లికేషన్లు ఇంకా బ్యాంకు బ్రాంచీల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడి.

– బీమాకు లింకేజి చేసిన తర్వాతకూడా 45 రోజులు లీన్‌ పీరియడ్‌గా తీసుకుని, ఆ కాలంలో కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదన్న అధికారులు.

– ఇలా 12,039 మంది మరణిస్తే.. వారి కుటుంబాలకు పరిహారం అందలేదన్న అధికారులు.

– ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ఉదారంగా ముందుకు వచ్చి ఆదేశాలు ఇచ్చారని, దీని ద్వారా ఆయా కుటుంబాలకు బీమా పరిహారం కింద రూ.254.72 కోట్లు చెల్లించిన విషయాన్ని గుర్తుచేసిన అధికారులు.

– చాలా ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకూ 60 లక్షల బ్యాంకు ఖాతాలను మాత్రమే తెరిచారని, మరో 58 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని తెలిపిన అధికారులు.

– క్లెయిముల పరిశీలన, వాటి డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయడం, సకాలంలో బీమా కంపెనీలకు వాటిని పంపడంలో బ్యాంకులు తీవ్ర జాప్యంచేస్తున్నాయని సీఎంకు వివరించిన అధికారులు.

– ఇప్పటివరకూ 6,173 క్లెయిములు వస్తే, అందులో కేవలం 2,839 క్లెయిములకు సంబంధించి డాక్యుమెంట్లను మాత్రమే అప్‌లోడ్‌ చేశారని, అందులోనూ సెటిల్‌ చేసిన క్లెయిములు అంటే పరిహారం కేవలం 152 కుటుంబాలకే ఇచ్చారని తెలిపిన అధికారులు. 

– అంతేకాక బీమా కంపెనీలతో బ్యాంకులకున్న ఒప్పందాలను కూడా తిరిగి పునరుద్ధరించుకునే విషయంలో కొన్ని బ్యాంకులు సందిగ్ధ స్థితిలో ఉన్నాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 2021–22కు సంబంధించి సీజీజీబీ, ఆప్కాబ్‌ లాంటి బ్యాంకులు తమ బీమా కంపెనీలతో ఒప్పందాలనుకూడా చేసుకోలేదని తెలిపిన అధికారులు. 

– పథకం అమల్లో ఉన్న ఈసమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రతిపాదనలు చేశామని తెలిపిన అధికారులు. 


*నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు:*

– ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే వైయస్సార్‌ బీమా పథకం కింద పరిహారాన్ని చెల్లించాలని సీఎం

 సమీక్షా సమావేశంలో నిర్ణయం. 

– కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్‌ బీమాలో మార్పులు చేర్పులు

– క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తిచెప్పాలని నిర్ణయం

– మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం

– కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం

– అదే సంపాదించే వ్యక్తి, 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5లక్షల ఆర్థిక సహాయం

– జులై 1  నుంచి కొత్తమార్పులతో వైయస్సార్‌బీమా అమలుకు నిర్ణయం.


*సీఎం ఏమన్నారంటే...:*


– జులై 1 లోగా అర్హులైనవారి వివరాల జాబితా తయారుచేసుకోవాలని సీఎం ఆదేశం. 

– జులై 1లోగా కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు మరణిస్తే.. వారి క్లెయిములను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

– జులై 1లోగా ఈ క్లెములన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

– ఇవేకాకుండా  రైతుల మరణాలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులు మరణించినా తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీకూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని సీఎం ఆదేశం

– దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం

– నెలరోజుల్లోగా క్లెయిములను పరిష్కరించి బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలన్న సీఎం.

– అన్నిరకాల ఇన్సూరెన్స్‌ క్లెయిములకు సంబంధించి ప్రతి 3 నెలలకు కలెక్టర్లు కచ్చితంగా నివేదిక ఇవ్వాలని ముఖమంత్రి ఆదేశం.

– ఎన్ని క్లెయిములు వచ్చాయి? ఎన్ని పరిష్కరించాం? ఎంతమందికి పరిహారం చెల్లించామన్నదానిపై పర్యవేక్షణ చేయాలన్న సీఎం

– ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు వారికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి

– దీంట్లో జాప్యం ఉండకూడదు, ఎవ్వరికీ పట్టని వ్యవహారంగా ఉండకూడదన్న సీఎం

– ఇన్సూరెన్స్‌ దరఖాస్తుల స్క్రీనింగ్‌ బా«ధ్యతను, గ్రామ,  వార్డు సచివాలయాలను అప్పగించాలన్న సీఎం


*చివరిగా...*


కేవలం కంప్యూటర్‌లో ఒకే ఒక్క బటన్‌ నొక్కడం ద్వారా డీబీటీ రూపంలో లబ్దిదారులకు రూ. 95 వేల కోట్లు బదిలీచేశాం, ఇవికాక ఇళ్ళపట్టాలు, సంపూర్ణ పోషణ, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కలిపితే రూ. 1.35 లక్షల కోట్లు బదిలీచేశాం, ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఈ బదిలీ జరిగింది. ఇవన్నీ విజయవంతంగా జరిగాయి అంటే ఆర్ధికశాఖ అధికారుల శ్రమ వల్లే, వారిని ప్రత్యేకంగా అభినందించాలి. కోవిడ్‌ కారణంగా మనం ఆశించిన ఆదాయం రాకపోయినా ఏ కార్యక్రమం కూడా ఆగకుండా అనుకున్న సమయానికే పూర్తిచేసుకుంటూ ముందుకెళుతున్నాం.


హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్, కార్మికశాఖ స్పెషల్‌ సీఎస్‌ అనంతరాము, గృహనిర్మాణ శాఖ సెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కార్మికశాఖ స్సెషల్‌ కమిషనర్‌ రేఖారాణి, సెర్ప్‌ సీఈవో రాజాబాబు, వైఎస్‌ఆర్‌ బీమా స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాజా ప్రతాప్, ఇతర ఉన్నతాధికారులు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image