నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పర్యటించా


నెల్లూరు (ప్రజా అమరావతి);


నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పర్యటించా


రు. కోవిడ్ 1st, 2వ వేవ్ లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోవిడ్ తో మరణించిన ప్రజల పార్థివ దేహాలను.., మహాప్రస్థానానికి తీసుకువెళ్లి అంత్యక్రియల నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామ్యులైన 13 మంది మున్సిపల్ సిబ్బందిని, శానిటరీ సిబ్బందిని.., మున్సిపల్ కమీషనర్ శ్రీ కె.దినేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ సన్మానించి.., వారి సేవలను కొనియాడారు. కోవిడ్ తో మరణించిన వారికి ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడంలో కార్పొరేషన్ సిబ్బంది అత్యుత్తమ సేవలందించారన్నారు. 

రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఆ వ్యాధుల లక్షణాలు కొన్ని కోవిడ్ వ్యాధి లక్షణాల వలే ఉంటాయని.., అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా కోవిడ్ రాకుండా నివారించవచ్చని, ఒకవేల కోవిడ్ వచ్చినా తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఏర్పడవని, త్వరగా కోలుకుంటారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. పబ్లిక్ హెల్త్ కి ప్రాధాన్యం ఇవ్వాలని, శానిటైజేషన్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. 


ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ ఎ. ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ పి.వెంకటరమణ, మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీ కె.హేమావతి, తదితరులు పాల్గొన్నారు. 



Comments