- మధ్య తరగతి ఇళ్ల స్థలాలకు భూసేకరణ వేగవంతం చెయ్యండి
..
- రైతుల నుంచి కొనుగోలు చేసే భూములకు మార్కెట్ ధర కెంటే 1.5 రెట్లు అదనంగా చెల్లిద్దాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)
గుడివాడ, జూన్ 3 (ప్రజా అమరావతి): గుడివాడ పట్టణంలో మద్యతరగతి ప్రజల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు.
గుడివాడ ఆర్డోవో కార్యాలయంలో గురువారం మద్యతరగతి ప్రజల ఇళ్ల స్థలాల భూసేకరణ అంశంపై జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టర్ మాధవీలత అధ్యక్షతన మంత్రి కొడాలి నాని రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఇళ్లులేని మధ్యతరగతి ప్రజలకు ఇళ్లస్థలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందని, ఈ మేరకు గుడివాడ పట్టణంలో ఇళ్లులేని మధ్య తరగతి వారికి సుమారు 400 ఎకరాల వరకు అవసరమవుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని త్వరిత గతిన సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులు భూసేకరణ ప్రక్రియపై రైతులతో సమావేశాలు నిర్వహించి భూసేకరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్య తరగతి ప్రజల ఇళ్లస్థలాలు కోసం రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న భూమికి మార్కెట్ ధర కంటే 1.5 రెట్లు అదనంగా చెల్లించడం జరుగుతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కే. మాధవీలత, ఆర్డీవో జి. శ్రీనుకుమార్, తహశీల్దారు శ్రీనివాసరావు, డిప్యూటి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, మండల సర్వేయరు, గ్రామ రెవిన్యూ అధికారి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment