మచిలీపట్నం :
జూన్ 8 (ప్రజా అమరావతి);
మహిళలపై హింస, అణిచివేత అమానుషం !!
-- మంత్రి పేర్ని నాని
ఎందరో మహిళలు పుట్టుక నుంచి చావుదాకా అడుగడుగునా తమ భర్తల చేతులలో దారుణంగా హింసించబడుతూ తమ జీవిత కాలమంతా ఆంక్షలతో, అభద్రతతో, హింసను ఎదుర్కొంటూ జీవించాల్సిన దుస్థితికి నెట్టబడుతున్నారని ఇది ఎంతో అమానుషమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళ వారం ఉదయం తన కార్యాలయంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి పేర్ని నాని కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసు కొన్నారు.
తొలుత 6 వ డివిజన్ (చిలకలపూడి)కి చెందిన పడమట నాగలక్ష్మి నాంచారమ్మ అనే మహిళ మంత్రి పేర్ని నాని వద్దకు తన తండ్రితో వచ్చి తన కష్టాన్ని చెప్పుకొంది.
మచిలీపట్నం మండలం తాళ్ళపాలెం గ్రామానికి చెందిన పడమట రమేష్ బాబు అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహమైందని తన భర్త హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడని, ఏడాదిన్నర బాబు, మరో 7 నెలల బాబు తమకు జన్మించారని చెప్పింది.
కూకట్ పల్లి సమీపంలో నిజాంపేట కాలనీలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేద్దామని తనతో అంటే తన తండ్రికి చెప్పి లక్షలాదిరూపాయల డబ్బు తెచ్చి తన భర్తకు ఇచ్చేనని కొనుగోలు చేసిన ఫ్లాట్ లోనికి తన అన్నయ్య వదిన దీవెనలతో వెళ్ళిపోదామని గృహప్రవేశం అంటూ హడావిడి తన భర్త చేస్తుంటే, కరోనా సమయంలో వద్దని కొన్నాళ్ల తర్వాత మీ తల్లితండ్రులు, నా తల్లి తండ్రుల దీవెనలతో గృహప్రవేశం చేద్దామని చెప్పినందుకు ఆగ్రహించి నీవు నాకు చెప్పేంత పెద్దదానివయ్యావా అంటూ తన తల వెనుక భాగంలో ఇనుప వస్తువుతో బలంగా కొట్టాడని,
దాంతో రక్తం విపరీతంగా పోవడంతో నేలపై పడిపోయి గంటసేపు సృహ కోల్పోయాయని తెలిపింది.
గత శనివారం సాయంత్రం 6 గంటలకు తనపై ఆ దాడి జరిగితే, 9 గంటలకు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని తలపై 11 కుట్లు పడ్డాయని, వైద్యులకు బాత్రూమ్ లో కాలు జారిపడినట్లు చెప్పమని తనపై వత్తిడి తెచ్చారని ఆమె తెలిపింది.
తన భర్త పలుమార్లు దాడి చేస్తున్నాడని తనకు ప్రాణరక్షణ కల్పించాలని మంత్రి పేర్ని నాని వద్ద వేడుకొంది.
మచిలీపట్నం ఈడేపల్లి నారాయణపురం స్కూల్ సమీపంలో నివసించే పిన్ని విజయలక్ష్మి అనే మహిళ మంత్రి పేర్ని నాని వద్ద తన ఇబ్బందులు చెప్పుకొంది.
తన భర్త 5 నెలల క్రితం చనిపోయారని, డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న కుమారుడు ఉన్నాడని తమకు ఎటువంటి ఆస్తపాస్తులు లేవని అద్దె ఇంట్లో బతుకు ఎంతో దుర్భరంగా గడుపుతున్నామని,
ఈ కష్టాలకు తోడు తనకు కడుపులో కణితి వచ్చిందని తనకు ఏమైనా అయితే, తన బాబు అనాధ అవుతాడని తమ కుటుంబాన్నీ మీరే రక్షించాలని ఆ మహిళ వద్ద కన్నీరు పెట్టుకొంది.
ఈ సమస్యపై స్పందించిన మంత్రి పేర్ని నాని అమ్మ ...మీ ఆరోగ్యం విషయం ఆందోళన చెందకండి మంచి వైద్యుల చేత చికిత్స చేయిస్తానని మీరేమి ఆందోళన చెందవద్దని దైర్యం చెప్పారు.
-
addComments
Post a Comment