జండా ఏదైనా ఒకే ఎజెండా పై ఉద్యమిద్దాం.

 


రాజమండ్రి (ప్రజా అమరావతి);


జండా ఏదైనా ఒకే ఎజెండా పై ఉద్యమిద్దాం. 


అన్యాయ మైపోతున్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం. 


ప్రకృతి వనరులును రక్షించుకుందాం ! ఆరోగ్యం గా జీవిద్దాం. 


ప్రత్యామ్నాయ రాజకీయ వేదికే శరణ్యం. 


రణమా ! మరణమా తేల్చుకుందాం. 

ఇప్పుడు కూడా మౌనంగా వుంటే చరిత్ర క్షమించదు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. 


భయం, బలహీనతలతో దోపిడి పాలకులు ను ప్రశ్నిచకపోతే ఆంధ్రప్రదేశ్ లో బూడిద కూడా మిగలదని, విభజన ముందు, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేసుకుంటే నా నాటికి దిగజారిపోతున్న ఆంధ్రుడి బ్రతుకు కళ్ల ముందు  అర్థమైతుందని, వ్యక్తిగత భద్రత లేదు, కుటుంబ భవిష్యత్ లేదు, మన బిడ్డలకు భవిష్యత్ లేదు , భావితరాలకు భవిష్యత్ వుంటుందా ! అనే ఆందోళనతో బిక్కు బిక్కు మని జీవితాలను గడిపేస్తు కట్టు బానిసలుగా  బ్రతికేస్తు ఆంధ్రుడి చారిత్రిక పౌరుషాన్ని  గతించి బ్రతికేస్తున్నామని ఆయన ఆవేదన చెందారు. 


ఆనాటి నుండి నేటి పాలకుల వరకు అభివృద్ధి చేసింది 

ఏ దైనా వుందా ! చేసింది చిటికన వేలంత అయితే దోచుకుంటున్నది కొండంత అని, సంపద అంతా అతి కొద్దిమంది సొంతంకి  చేస్తు మెజార్టీ ప్రజలను బిచ్చగాళ్లగా మారుస్తున్నారని 

రాజ్యాంగ బద్దమైన విద్యా, వైద్యం ను ఖరీదైన వ్యాపారం గా మార్చేసారని, ఉపాధి మార్గాలను బానిస బ్రతుకులుగా మార్చేసారని, ప్రకృతి వనరులను విషపూరితంగా మార్చేసారని, ఆనాటి విదేశీ పాలకులను తరిమివేసి స్వదేశి ముసుగులో విదేశీ శాసన కర్తలను పెంచి పోషిస్తున్నామని, నేటి రాజకీయ వేశ్య దళారులు  ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను తాకట్టు పెట్టేస్తున్నారని, 2000/-కు ఓటును అమ్మేసుకుంటు బిడ్డల భవిష్యత్ ను కూడా అమ్మేస్తున్నామని గ్రహించలేక పోతున్నామని ఆయన వాపోయారు. 


విభజన అనంతరం ఎంతగానో అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ నేడు అన్యాయ మైపోతుందని, అహంకారాలను, ఆధిపత్య ధోరణి విధానాలను విడిచి పెట్టి ఒకే ఎజెండా అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, భద్రత అనే నినాదం తో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను కాపాడుకోవాల్సిన గురుతర భాద్యత ప్రతి ఆంధ్రుడు పైన వుందని, ఉద్యమ రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు ఏకం కావాల్సిన పరిస్థితులు నేడు ఆసన్న మైనవని, పిల్చే గాలినుండి, తినే ఆహరం వరకు కార్పొరేట్ శక్తులు కలుషితం చేసే సాయని, మన ఆరోగ్యాలతో రాజకీయ కీచకులు, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు కలుషిత చదరంగం ఆడుతున్నాయని, మనం మౌనం గా వుంటే మన బిడ్డలకు 20 ఏళ్లకే ఆయుస్సు నిడుతుందని ఆయన తీవ్ర ఆందోళన చెందారు.


ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని లేదు, శాశ్వతంగా హై కోర్టు లేదు, శాసనసభ, సచివాలయం ఉంటుందో లేదో తెలియదని, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేవు అని, ప్రజలకు ఏ విధమైన సదుపాయాలు, భద్రత లేక పోయిన పన్నులు మాత్రం భారిగా వసూలు చేస్తుంటారని, నాణ్యమైన విధ్యుత్ సరఫరా వుండదని, విధ్యుత్ కోతలతో విద్యుత్ సరఫరా జరిపిస్తు ఏటా రెండు,  మూడు సార్లు ఇష్టాను సారం విధ్యుత్ చార్జీలు పెంచి సామాన్యులను, మధ్య తరగతి వారిని అధికారికంగా దోచుకుంటున్నారని,

ప్రజలకు  ఉపాధి మార్గాలను చూపకుండా ధరలపై పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా ధరలు పెంచుతు దోపిడీ పాలన సాగిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.


యుద్ధప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోను రక్షించుకోవటానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఒక్కటే మార్గమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై కేసీఆర్ వంటి విష నాగులు కాలకూట విషం చిమ్ముతున్నాయని, ప్రస్తుత పాలకుల బలహీనతల కారణంగా ఆంధ్రులు అన్యాయ మైపోతున్నారని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారిందని, మన ఆరోగ్యాలపై కూడా శాస్త్రీయపరమైన కుట్రలు చేస్తు మన రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తున్నారని, ప్రశ్నించే శక్తిని కోల్పోతున్నామని, పాలకులు, కార్పొరేట్ శక్తుల కుట్రలకు అధిక శాతం ప్రజలు జీవితాలు ఆసుపత్రులుకు పరిమితమైపోతున్నాయని, ప్రస్తుతం మన బలహీనతలు కావొచ్చును, మౌనం కావొచ్చును అక్రమార్కులకు వరంగా మారిందని, ప్రజల జీవితాలకు శాపంగా వుంటుందని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. 


మన భవిష్యత్ కు మనమే మార్గ దర్శకులమని భావించి, భయం, బలహీనతలను వదిలి, మన భవిష్యత్, మన భద్రత, మన ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక్క లక్ష్యం తో రణమా  ! మరణమా అనే ఉక్కు సంకల్పం తో ఉద్యమిద్దాం సిద్ధం కండి అని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. 


సభకు అర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు  అధ్యక్షత వహించారు. 


ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ దుడ్డె త్రినాద్, ఎండి హుస్సేన్, సిమ్మా దుర్గారావు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, 

పి. ప్రసాద్, కె. భాస్కర్, మోర్తా ప్రభాకర్ తదితరులు పాల్గొనియున్నారు. 


--మేడా శ్రీనివాస్, MA, LLM, MA(Jour), 

వ్యవస్థాపక అధ్యక్షులు, 

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్

మొబైల్ నెం :9248777222

Comments