ప్రాణం కాపాడతారా... వదిలేస్తారా!!...

 అమరావతి (ప్రజా అమరావతి);


ప్రాణం కాపాడతారా... వదిలేస్తారా!!...తక్షణమే స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


బ్లాక్ ఫంగస్ సోకిన యువతికి సకాలంలో స్పందించి ప్రాణం కాపాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో కదిలిన ఒంగోలు GGH హాస్పిటల్ వైద్యులు...


మంత్రి ఆళ్ల నాని ఫోన్ కాల్ తో క్షణాల్లో బ్లాక్ ఫంగస్ తో ప్రాణాపాయంతో కొట్టు మిట్టడుతున్న పద్మ కు ఒంగోలు GGH హాస్పిటల్ లో జాయిన్ చేసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములు...


క్షణాల్లో ఒక పేద మహిళ కు సకాలంలో వైద్యం అందించే ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


శర వేగంగా పద్మ కు వైద్య చికిత్స అందిస్తున్న ఒంగోలు GGH వైద్యులు...


ప్రాణంపై ఆశ వదులుకున్న పద్మ ను ఆదుకొని తక్షణమే స్పందించి వైద్య సదుపాయం కల్పించిన ప్రాణ ధాత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ధన్యవాదములు తెలిపిన పద్మ కుటుంబ సభ్యులు... 🙏🙏


ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెo దిన ఒక ఆటో డ్రైవర్ భార్య పద్మ కు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకింది...


ఒంగోలు లోని వసుధ కళ్యాణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేరి చికిత్స పొందిన పద్మ...


అయితే ప్రైవేట్ హాస్పిటల్ లో రెండున్నర లక్షలు తీసుకొని వైద్యం అందించకుండా బ్లాక్ ఫంగస్ పెషేంట్ ను 5వ తేది శనివారం డిచార్జీ చేసి ప్రేవేటు ఆసుపత్రి వైద్యులు చేతులు ఎత్తేశారు..  


దీనితో దిక్కు తోచని పరిస్థితిలో ప్రాణాన్ని అర చేతిలో పెట్టుకొని తీవ్ర అనారోగ్యంతో ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లిన పద్మ కుడాక్టర్స్ నిబంధనలు పేరుతో చుక్కలు చూపించారు...


ఈ పరిస్థితిలో బ్లాక్ ఫంగస్ సోకిన పద్మ ప్రాణ భయంతో దిక్కు తోచని స్థితిలో ఒంగోలు లోని తన పుట్టింటికి వెళ్లి ఆవేదనతో రోదిస్తున్నారు...


ఒంగోలులో వైస్సార్సీపీ కార్యకర్త నరాల రమణ రెడ్డి కి బ్లాక్ ఫంగస్ సోకిన పద్మ కుటుంబ సభ్యులు ఫోన్ లో వైద్య సహాయం కోరారు...


వెంటనే ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ కి పెషేంట్ పద్మ ను వైద్యం కోసం పంపిస్తే నిబంధనలు పేరుతో ఆధార్ కార్డు లో కృష్ణా జిల్లా అని ఉందని ఒంగోలు GGH వైద్యులు జాయిన్ చేసుకోకుండా నిరాకరించారు...


దీనితో తిరుపతిలో ఉన్న దిశా పేపర్ జర్నలిస్ట్ కాశీ విశ్వనాధ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి విజ్ఞాపన చేస్తూ బ్లాక్ ఫంగస్ సోకిన పద్మ ను ఆదుకోవాలని సోషల్ మీడియా లో ట్రోల్ చేశారు...


బ్లాక్ ఫంగస్ సోకిన పద్మ కు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో ఆదివారం మధ్యాహ్నం 3గంటలు ప్రాంతంలో వచ్చిన కధనంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తక్షణమే స్పందించి ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములతో ఫోన్ లో మాట్లాడి వెంటనే పద్మ ను హాస్పిటల్ లో జాయిన్ చేసుకొని మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు...


మంత్రి ఆళ్ల నాని ద్రుష్టికి వచ్చిన నిముషాలల్లో బ్లాక్ ఫంగస్ సోకిన పద్మ ఒంగోలు GGH లో జాయిన్ కావడానికి చర్యలు తీసుకున్నారు...


మానవతతో స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేద వాళ్లు కు కొండంత అండని నిరూపించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...