సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :

 


*ర్నూలు* (ప్రజా అమరావతి);


*తేద


*సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :-*


*రెండేళ్ల పరిపాలనలో నవరత్నాల పథకం అమలులో వైయస్సార్ ఆసరా పథకం, సున్నా వడ్డీ పథకం, వైయస్సార్ చేయూత :-*


*వైయస్సార్ ఆసరా పథకం కింద 2019-20 కర్నూలు జిల్లాలోని డి ఆర్ డి ఎ, మెప్మా పరిధిలోని 51,244 డ్వాక్రా సంఘాలకు 306.6 కోట్ల రూపాయలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం :-*


*సున్న వడ్డీ పథకం కింద 2019-20 కర్నూలు జిల్లాలోని డి ఆర్ డి ఎ, మెప్మా పరిధిలోని 61,572 డ్వాక్రా సంఘాలకు  రూ.105.14 కోట్లు, 2020-21లో 73,535 డ్వాక్రా సంఘాలకు రూ 94.73 కోట్ల రూపాయలు జమ :-*


*వైయస్సార్ చేయూత పథకం కింద కర్నూలు జిల్లాలోని డిఆర్ డిఎ పరిధిలోని 1,98,480 మంది లబ్దిదారులకు 372.15 కోట్లు జమ*


*డ్వాక్రా అక్కాచెల్లెళ్లను లక్షాధికారులను చేసే దిశగా ప్రభుత్వం అడుగులు :-*


*జగనన్న మాట - బంగారు బాట :-*


*అక్కాచెల్లెమ్మలను మోములో చిరునవ్వు :-*


*ఆడపడుచులకు అండగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి :-*


*సంక్షేమమే ఊపిరిగా అభివృద్ధి అజెండాగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పోరాడే తత్వం... ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే స్వభావం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజాయితీకి నిదర్శనం. ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అతివలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది.*


*ఆపత్కాలంలో చేసిన సాయం ఎవరికైనా అక్కరకె వస్తుంది. డ్వాక్రా అక్కచెల్లెళ్ల ఇబ్బందులు ఆనాడు స్వయానా చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు  రూపొందించిన పథకాలు వైయస్సార్ ఆసరా పథకం, సున్న వడ్డీ పథకం, వైయస్సార్ చేయూత పథకాలు. ముఖ్యమంత్రి మహిళల సంక్షేమానికి ఆర్థిక పురోగతికి పెద్దపీట వేస్తూ మాటలతో కాకుండా చేతులతో అందరి చేత అతిథిదేవోభవ అనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నెరవేరుస్తా ఉన్నారని డ్వాక్రా మహిళలు సంతోషపడుతున్నారు.*


*వైఎస్సార్ ఆసరా పథకం :-* 


వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా  2019-20 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు జిల్లాలోని డి ఆర్ డి ఎ, మెప్మా పరిధిలోని 51,244 డ్వాక్రా సంఘాలకు 306.6 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలు ఖాతాలో జమ చేసింది. 


*సున్న వడ్డీ పథకం :-* 


సున్న వడ్డీ పథకం కింద 2019-20 కర్నూలు జిల్లాలోని డి ఆర్ డి ఎ, మెప్మా పరిధిలోని 61,572 డ్వాక్రా సంఘాలకు  రూ.105.14 కోట్ల రూపాయలు జమ చేయగా, డి ఆర్ డి ఏ, మెప్మా పరిధిలో 2020-21లో 73,535 డ్వాక్రా సంఘాలకు రూ 94.73 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. 


*వైయస్సార్ చేయూత పథకం :-* 


వైయస్సార్ చేయూత పథకం కింద కర్నూలు జిల్లాలోని డిఆర్ డిఎ పరిధిలోని 1,98,480 మంది లబ్దిదారులకు 372.15 కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. 


*జగనన్న మాటలతో కాకుండా చేతులతో అందరి చేత అతిథిదేవోభవ అనిపిస్తున్నారు :-* 


నా పేరు ఎస్ శిరిన్, నేను కర్నూల్ నగరంలోని బుధవారపేటలో నివసిస్తున్నాను. బిస్మిల్లా పొదుపు సంఘంలో సభ్యురాలిని. ఆంధ్ర బ్యాంకులో మా సంఘం తరఫున మూడు లక్షల రూపాయల రుణం తీసుకున్నాం. మా సంఘానికి ఆసరా పథకం ద్వారా రెండు లక్షల 80 వేల రూపాయలు వర్తించింది. మొదటి విడత కింద మా సంఘానికి ప్రభుత్వం డబ్బులు జమ చేశారు. సున్నా వడ్డీ పథకం కింద మా సంఘానికి 18 వేల రూపాయలు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఇంటిలోనే ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకొని చిన్నపాటి వ్యాపారం చేస్తున్నాను. ప్రతి నెల 15 వేల రూపాయలు ఆదాయం వస్తుంది.  జగనన్న హౌసింగ్ కాలనీలు ఇల్లు మంజూరు అయింది. సుమారు నా కుటుంబానికి 5 లక్షల విలువైన స్థలం జగనన్న ప్రభుత్వంలో వచ్చింది. జగనన్న మాటలతో కాకుండా చేతులతో అందరి చేత అతిథిదేవోభవ అనిపిస్తున్నారు. *-చిన్నపాటి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ స్టోర్ ను నిర్వహిస్తున్న ఎస్ శిరిన్, మహిళా, కర్నూలు నగరం, కర్నూలు జిల్లా.*


*ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుతున్న మా ముఖ్యమంత్రి మా మహిళాల పాలిట దేవుడు :-* 


నా పేరు ఖైరున్, నేను కర్నూలు నగరంలో నివసిస్తున్న. మేము మా పొదుపు సంఘంలో బ్యాంకు నుంచి 3 లక్షల రుణం తీసుకున్నము. బ్యాంకుల్లో తీసుకున్న ఐదు నెలలకి వైయస్సార్ ఆసరా పథకం కింద రెండు లక్షల 80 వేల రూపాయలు వర్తించాయి. సున్నా వడ్డీ పథకం కింద పదివేల రూపాయలు మా సంఘానికి డబ్బులు ఏమయ్యాయి. వ్యక్తిగతంగా నాకు 18 వందల రూపాయలు జమ అయ్యాయి. బ్యాంకులో ఇచ్చిన రుణంతో నేను కర్నూల్ నగరంలో మా వీధిలో బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాను. నెలకు 20 వేల రూపాయలు ఆదాయం వస్తుంది. జగనన్న హౌసింగ్ కాలనీ లో నాకు ఇల్లు కూడా మంజూరు అయింది. ఇంతకన్నా ఇంకేమి కావాలి. ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుతున్న మా ముఖ్యమంత్రి మా మహిళాల పాలిట దేవుడు. *-బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్ వ్యాపారం చేస్తున్న ఖైరున్ మహిళా, కర్నూలు నగరం, కర్నూలు జిల్లా.*


*మహిళల సంక్షేమానికి ఆర్థిక పురోగతికి పెద్దపీట వేస్తున్న మా జగనన్న :-*  


నా పేరు తహెరా భాను, నేను కర్నూలు నగరంలోని బుధవారపేటలో నివసిస్తున్న. కర్నూల్ నగరంలోని ఆంధ్ర బ్యాంక్ నుంచి 3 లక్షల రూపాయలు రుణం ఫాతిమా సంఘం తరఫున గ్రూప్ సభ్యులము కలిసి తీసుకున్నాము. రెండు లక్షల నలభై వేల రూపాయలు వైయస్సార్ ఆసరా పథకం వర్తించింది. సున్న వడ్డీ పథకం 18,000 రూపాయలు మా గ్రూప్ లో జమ అయ్యాయి. నేను మా వీధిలో కిరాణా దుకాణం పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాను. కిరాణా షాప్ లో నెలకు 15 వేల నుంచి 20 వేల రూపాయల ఆదాయం వస్తుంది. నా కాళ్ళ మీద నేను నిలబడికునే విధంగా ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేసింది. నాకు జగనన్న ప్రభుత్వంలో ఆరు లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో చాలా రకాలుగా మా కుటుంబానికి ఆర్థిక సహాయం అందింది. మహిళల సంక్షేమానికి ఆర్థిక పురోగతికి పెద్దపీట వేస్తున్న మా జగనన్న. *-కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తహెరా భాను,  కర్నూలు నగరం బుధవారపేట, కర్నూలు జిల్లా.*


*జగనన్నకు మా ఆడపడుచులు రుణపడి ఉంటాం :-* 


నా పేరు ఎస్.షాకిరా, నేను కర్నూలు నగరంలోని పెద్దదర్గా దగ్గర నివసిస్తున్నాను. ప్రభుత్వం తరఫున నేను బ్యాంకు లింకేజీ ద్వారా మా గ్రూప్ అంతా కలిసి 3 లక్షల రూపాయలు ఆంధ్ర బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాము. మా గ్రూపుకు వైయస్సార్ ఆసరా  పథకం కింద రెండు లక్షల 80 వేల రూపాయలు వర్తించింది. బిస్మిల్లా పొదుపు సంఘానికి 18వేల రూపాయలు సున్నా వడ్డీ పథకం కింద గ్రూప్ కు జమయ్యాయి. వ్యక్తిగతంగా నాకు 18 వందల  రూపాయలు వచ్చాయి. జగనన్న ప్రభుత్వంలో ఆరు లక్షల స్థలం మంజూరు అయ్యింది. ఇంతకంటే ఇంకేమి కావాలి. ప్రభుత్వం అందించిన సొమ్మును ఇష్టం వచ్చిన అవసరాలకు లేదా వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నా. కర్నూలు నగరంలోని మా విధిలో చీరలు వ్యాపారం చేస్తున్న. నెలకు 15 వేల నుంచి 20 వేల రూపాయలు ఆదాయం వస్తుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. *-చీరలు వ్యాపారం చేస్తున్న ఎస్.షాకిరా, కర్నూలు నగరం, కర్నూలు జిల్లా.*


*అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుకొనేలా జగనన్న ఆర్థిక సహాయం :-* 


నా పేరు నూర్జహాన్, కర్నూల్ నగరంలోని బుధవారపేటలో నివసిస్తున్నా. నగరంలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ నుంచి బిస్మిల్లా పొదుపు స్వయం సహాయక సంఘం నుంచి మూడు లక్షలు రుణం బ్యాంకు లింకేజీ కింద తీసుకున్నాము. మా వీధిలోని కిరాణా దుకాణం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాను. నెలకు 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఆసరా పథకం కింద 28 వేల రూపాయలు పొదుపు సంఘానికి వర్తించింది. 18 వేల రూపాయలు సున్నా వడ్డీ పథకం కింద మా గ్రూపుకు జమయ్యాయి. వైయస్సార్ చేయూత పథకం కింద 18వేల 750 రూపాయలు వ్యక్తిగత ఖాతాకు జగనన్న ప్రభుత్వం జమ చేసింది. జగనన్న ప్రభుత్వంలో ఆరు లక్షల స్థలం మంజూరు అయ్యింది. పియం స్వనిది  కూడా నాకు వర్తించింది. అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, వ్యాపారవేత్తలుగా మారి స్వావలంబన సాధించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం  ఐటీసీ, హెచ్‌యూఎల్‌, అమూల్‌, అల్లన లాంటి దిగ్గజ సంస్థలతో, వివిధ బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని జగనన్న ప్రభుత్వం మాలాంటి మహిళలకు ఆర్థిక సహకారం అందిస్తుంది. *-కిరాణా దుకాణం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న నూర్జహాన్, కర్నూల్ నగరం బుధవారపేట, కర్నూలు జిల్లా.*


Comments