రెండేళ్లు పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా కలెక్టర్ జి.వీర పాండియన్ కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

 రెండేళ్లు పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా  కలెక్టర్ జి.వీర పాండియన్  కు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు*



కర్నూల్, జూన్ 7 (ప్రజా అమరావతి)


: జిల్లా కలెక్టర్ గా సోమవారం నాటికి రెండేళ్ల కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ జి వీరపాండియన్ కు శుభాకాంక్షలు తెలిపారు ..పుష్ప గుచ్చాలు, మొక్కలు అంద చేసి, శాలువాలతో సన్మానించి  కలెక్టర్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.. ప్రజాసంక్షేమం కోసం జిల్లా కలెక్టర్ నిరంతర శ్రామికుడు లా పనిచేశారని, జిల్లా  యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేస్తూ అధికారులను ముందుకు నడిపించారని ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు . మొదటి విడత కోవి డ్  సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో కేసులు వచ్చినప్పటికీ ,సమర్థవంతంగా పనిచేసి పక్కా ప్రణాళిక తో , జిల్లాలో అనతికాలంలోనే కేసులు తగ్గించగలిగారన్నారు.. అలాగే రెండో విడతలో కూడా ప్రమాద తీవ్రతను గుర్తించి ముందస్తు ఏర్పాట్లు చేయడంతో, ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో కేసుల తీవ్రతను తగ్గించేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారనీ,  సకాలంలో వైద్యం అందించడం, మౌలిక వసతులు కల్పించడంలో  జిల్లా కలెక్టర్ సఫలీకృతం అయ్యారని వారు తెలిపారు ..స్వయంగా కలెక్టర్ కొవి డ్  బారిన పడ్డప్పటికీ,   హోమ్  isolation లో ఉండి జిల్లా యంత్రాంగాన్ని నడిపించారన్నారు..


 అలాగే  సంక్షేమ కార్యక్రమాలు కుంటు పడకుండా , ప్రజా ప్రతినిధులు , అధికారులతో సమన్వయంతో పని చేసి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించారని అధికారులు శుభాకాంక్షలు తెలిపారు


 శుభాకాంక్షలు తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్,  జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డి అర్ ఓ పుల్లయ్య, డిఅర్డిఏ పిడి వెంకటేశులు, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, బిసి కార్పొరేషన్ ఈడి శిరీష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చంద్రశేఖర్, సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, మార్కెటింగ్ శాఖ ఎ.డి.సత్యనారాయణ చౌదరి, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర రెడ్డి, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివ రెడ్డి,

జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సోమ శివారెడ్డి, రెవెన్యు అసోసి యేషన్ సభ్యులు,   స్పెషల్  డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, కర్నూలు ఆర్డిఓ హరి ప్రసాద్, మరియు తహశీల్దార్లు.జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు,

జిల్లా పరిషత్ ముఖ్య ప్రణాళిక అధికారి  వెంకటసుబ్బయ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ భాస్కర్ నాయుడు తదితరులు ఉన్నారు..



Comments