విశాఖపట్నం (ప్రజా అమరావతి);
విశాఖపట్నంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే శ్రీ గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్ మీట్:
ప్రభుత్వం ఎంతో విలువైన ప్రజల ఆస్తిని కాపాడుతోంది
కబ్జాకు గురైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటోంది
ఇప్పటికే 430 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాం
ఆ భూముల విలువ దాదాపు రూ.4 వేల కోట్లు
ఇది ఏ విధంగా కూడా కక్ష సాధింపు కానే కాదు
వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్
గత ఎన్నికల్లో మా పార్టీకి ప్రజలు స్పష్టంగా పట్టం కట్టారు
మొత్తం 175 సీట్లలో 151 స్థానాలు గెల్చుకున్నాం
ఆ తర్వాత అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించాం
మాకు ఓడిపోయిన టీడీపీ నాయకుల అవసరం లేదు
దీనిపై విపక్షనేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు
చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా భూదందాలు
ఎక్కడికక్కడ ప్రభుత్వ భూముల కబ్జా. అన్నింటికీ ఆయనే కర్త
అయినా ఇప్పుడు ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు
విశాఖలో మీడియాతో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్
విశాఖపట్నం:
ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్ పాయింట్స్:
ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంది:
‘కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఏ ఒక్క పథకం కూడా ఆపలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే 86 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించిన ప్రభుత్వం ఇది. ఈ విషయాన్ని రెండేళ్ల పాలన పూరై్తన సందర్భంగా సీఎం గారు స్వయంగా చెప్పారు. విభజన వల్ల రాష్ట్రానికి టయర్–1 సిటీ లేకుండా పోయింది. అయితే అలాంటి నగరాలతో పోటీ పడే స్థాయి కేవలం విశాఖకు మాత్రమే ఉందని సీఎం గారు చెప్పారు. అలాంటి నగరంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’.
ఆనాడే పోరాడారు:
‘గతంలో విపక్షనేతగా ఉన్నప్పుడు కూడా ఇదే విషయంపై నాడు సీఎం శ్రీ వైయస్ జగన్, విశాఖలో భారీ ధర్నా చేశారు. విశాఖలో టీడీపీ నాయకులు చేసిన కబ్జాలు, దోచుకున్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆనాడు చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దాదాపు 430 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన భూములను ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఒక పాలసీగా జగన్ గారి ప్రభుత్వం పని చేస్తోంది’.
ఆయనే ప్రధాన కర్త:
‘దీనిపై టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. విశాఖలో జరిగిన భూదోపిడి, ప్రభుత్వ భూముల కబ్జాకు ప్రధాన కర్త టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. వీరందరికీ భూములు దోచుకోవడానికి లైసెన్సులు ఇచ్చాడని చెప్పాలి. గత 5 ఏళ్లలో దోపిడి యథేచ్ఛగా కొనసాగింది. ఎక్కడికక్కడ కబ్జాల పర్వం కొనసాగింది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, పార్టీని కబ్జా చేశాడు. అదే ఇప్పటి వరకు కొనసాగింది. సైకిల్ గుర్తును కూడా కబ్జా చేశాడు. పార్టీ నాయకులను భూకబ్జాలకు ప్రోత్సహించాడు’.
ఫాదర్ ఆఫ్ కరప్షన్:
‘పక్కన తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు రేపో మాపో కారు ఎక్కబోతున్నాడు. ఇక్కడ ఈఎస్‌ఐ కుంభకోణంలో రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేశాడు. చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్‌గా మారాడు. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ చంద్రబాబు. ఏరోజూ ఈ తప్పు మేము చేయలేదు. మేము భూకబ్జాలకు పాల్పడలేదు. మా పార్టీ నాయకులకు సంబంధం లేదు అని చెప్పలేదు. ఎంతసేపూ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప’.
ఆ భూమి తమదే అని చెప్పారా?:
‘కొన్ని నెలల క్రితం గీతమ్ యూనివర్సిటీ కబ్జా చేసిన దాదాపు రూ.1000 కోట్ల విలువైన 40 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమి సెంటు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండొద్దని సీఎం గారు చెప్పారు. గీతమ్ వర్సిటీ స్వాధీనంలో ఉన్న భూమి ప్రభుత్వానిది కాదని, తమదే అని ఎవ్వరూ చెప్పలేదు. లోకేష్ తోడల్లుడు కూడా చెప్పలేదు. ఎంతసేపూ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప. కానీ భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటే మాత్రం వెంటనే చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సులోకి వస్తాడు. ఆయన కొడుకు ట్వీట్లు చేస్తాడు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు’.
‘విశాఖలో వెలగపూడి రామకృష్ణ యథేచ్ఛగా భూముల కబ్జా చేసి, ఆయనే సవాళ్లు చేస్తున్నారు. రుషికొండలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి, ప్రభుత్వానికి కాదా?’.
ఆస్తులు కాపాడుతున్నాం. గుర్తించండి:
‘ఇవాళ విశాఖలో అత్యంత ప్రధాన, ఖరీదైన భూములున్నాయి. ఇలాంటి నగరంలో, నగర పరిసరాల్లో వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుని, ప్రజల ఆస్తులు కాపాడుతోంది. దీన్ని గుర్తించండి.
కేవలం టీడీపీ నాయకులు కబ్జా చేస్తేనే కాదు, మా పార్టీ నేతలు ఆ పని చేసినా, కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో ఎవ్వరినీ విడిచి పెట్టే ప్రసక్తి లేదు. టీడీపీ నాయకులు మీ చేతుల్లో భూముల పెట్టుకుని, మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని ఎందుకు అంటున్నారు’.
మేము తప్పు చేసి ఉంటే..:
‘మీరు గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నారు. అప్పుడు మా పార్టీ నేతలు ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే, ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆ భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?. మేము తప్పు చేసి ఉంటే, చర్య తీసుకోమని, కేసులు పెట్టమని కూడా చెప్పాం’.
ఆయనే సమాధానం చెప్పాలి:
‘విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన విలువైన భూముల రికార్డులు పోయాయని హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు చెప్పారు. అప్పుడు చంద్రబాబు గారు ఇక్కడే బస్సులో పడుకున్నారు. అప్పుడు భారీ ఈదురుగాలులు వీచాయి తప్ప, భారీ వర్షాలు కురవలేదు. కాబట్టి, నాడు ఆ రికార్డులు ఎలా పోయాయన్నది చంద్రబాబు గారికే తెలియాలి. ఎందుకంటే ఆయన అప్పుడు స్వయంగా ఇక్కడి కలెక్టరేట్ వద్ద పడుకున్నాడు’.
‘విశాఖలో మూడేళ్లుగా యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతున్నాయని, నాడు చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఉన్న అయ్యన్నపాత్రుడు, అప్పటి సిట్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి, భూములు తిరిగి స్వాథీనం చేసుకుంటే, విమర్శలు చేస్తున్నారు. దీనిపై మాట్లాడానికి నిజానికి టీడీపీ వారెవరికీ అర్హత లేదు. ఇక్కడ ఏ స్కామ్ జరిగినా, భూకబ్జా జరిగినా దాని వెనుక చంద్రబాబు గారే ఉన్నారు’.
వారి అవసరం మాకు లేదు:
‘మా పార్టీ గెల్చిన తర్వాత, ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు ఆశీర్వదించారు. గత మూడు నెలల్లో జరిగిన ఎన్నికల్లో మాకు 100కు 95 మార్కులు ఇచ్చారు. ఆ పార్టీ నాయకులను పార్టీలోకి తీసుకోవడం కోసం కూలగొడుతున్నామని, భూములు స్వాధీనం చేసుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. 175 సీట్లలో మా పార్టీ 151 సీట్లు గెల్చుకుంది. మాకు టీడీపీ నాయకులు అవసరం లేదు’.
ప్రజలు స్వాగతిస్తున్నారు:
‘మా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి గారు విశాఖ జిల్లాను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకే ఆయన పలు చర్యలు తీసుకుంటున్నారు. అవి మీకు నచ్చకపోవచ్చు. కానీ ప్రజలు స్వాగతిస్తున్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను కాపాడుతుంటే కాదనే వారెవరు?. కాబట్టి దీనిపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం’.
కక్ష సాధింపు కానే కాదు:
‘బికినీ ఫెస్టివల్ కోసం చంద్రబాబుకు విశాఖ నగరం కావాలి. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామంటే వద్దంటున్నారు. కానీ సీఎం శ్రీ వైయస్ జగన్ గారు, విశాఖ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టాం తప్ప, ఏ విధంగా కక్ష సాధింపు కాదు’.
‘ఆ పార్టీ నాయకులు మాకు అస్సలు అవసరం లేదు. అలాంటప్పుడు వారిని ఎందుకు రమ్మంటాము. మా పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు గెల్చారు. మా సీఎం గారు డిస్టింక్షన్‌ల పాసయ్యారు. అలాంటి ఆయనకు ఫెయిల్ అయిన క్యాండిడేట్లు ఎందుకు? వారితో సప్లిమెంట్ రాయించడం కోసమా?’.
‘చివరికి మా పార్టీ నాయకులు తప్పు చేసినా, జగన్‌మోహన్‌రెడ్డి గారు ఉపేక్షించరు. తప్పనిసరిగా చర్య తీసుకుంటారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొంత భూమి కోసం దళిత మహిళను వివస్త్రను చేసినా ఆయన ఏ చర్య తీసుకోలేదు’.
ఆస్తి పన్నుపై అసత్యాలు:
‘ఆస్తి పన్నుపై ఎన్ని సార్లు చెప్పినా పదే పదే విమర్శలు చేస్తున్నారు. 10 శాతానికి మించి ఆస్తి పన్ను పెరగదని, అదే విధంగా వాణిజ్య సముదాయాలకు 15 శాతం కంటే తక్కువే పన్ను పెరుగుతుందని స్పష్టంగా చెప్పినా, అసత్యాలు చెబుతూ విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు’..
అంటూ గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్‌మీట్ ముగించారు.
addComments
Post a Comment