ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి


అమరావతి (ప్రజా అమరావతి);


జగనన్న తోడు రెండోదశ పథకాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి



*బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ.*


*జగనన్న తోడు పధకంలో ఏపీలోనే అత్యధిక లబ్ధిదారులు*

*యూపీ, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇక్కడే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ*

*అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో  6 లక్షల మంది, మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటకలో కేవలం లక్షమంది, తమిళనాడులో మూడు లక్షల మంది మాత్రమే ఈ పథకం లబ్ధిదారులు*

*ఏపీలో మాత్రం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 9 లక్షలు* 


వివిధ సంక్షేమ పధకాలకు సంబంధించి మీరు ఏదేతై ప్లాన్ చేశారో.. వాటి అమలు తేదీలను ముందుగానే ప్రకటించారు. ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. లబ్ధిదారుల స్పందన, వాళ్లు  కృతజ్ఞతలు చెబుతున్న తీరు, మీ పట్ల కనపరుస్తున్న అభిమానమే ఇందుకు నిదర్శనం. మీ పథకాల ద్వారా  లక్షలాదిమంది ప్రజల హృదయాలను చేరుకున్నారు. జగనన్న తోడు పథకమే కాదు ప్రతి పథకంలోనూ లబ్ధిదారులు మీపై ఇంతే కృతజ్ఞత చూపిస్తున్నారు. నా హోదా, వివరాలు తెలపకుండానే నేను అనేకమందితో మాట్లాడుతూ... నిజంగా మీకు ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అందుతున్నాయా అని అడిగాను. లబ్దిదారులు మీ పట్ల గొప్ప ప్రేమను కనపరుస్తున్నారు. అంతే కాకుండా మీరు అందిస్తున్న పారదర్శకమైన పాలన, పథకాల అమలు చేస్తున్న తీరు పై మిగిలిన రాష్ట్రాలు స్టడీ చేయడంతో పాటు ఈ విధానాలను అనుసరిస్తున్న తీరు మీరు అందిస్తున్న మంచి పాలనకు సాక్ష్యం. ఉన్నతస్ధాయి అధికారుల నుంచి క్షేత్రస్ధాయి వరకు పథకాల అమలులో అనుసరిస్తున్న విధానం... పారదర్శకమైన పరిపాలన నిజంగా ప్రశంసనీయం. మీ పాలనలో అట్టడుగున ఉన్న వారికి కూడా ఫలాలు అందుతున్నాయి. జగనన్న తోడు పధకానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలతో పోల్చిచూస్తే... మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటకలో కేవలం 1 లక్షమందికి ఈ పథకం అందుతుండగా... తమిళనాడులో మూడు లక్షలు మాత్రమే ఉంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ పథకం ద్వారా లబ్ధిదారుల సంఖ్య 6 లక్షలు దాటకపోగా... ఏపీలో మాత్రం మనం దాదాపు 9 లక్షలకు చేరుకున్నాం. ఇది మీ పాలనకు నిదర్శనం. చాలా రాష్ట్రాలు మీ పథకాలను అనుసరిస్తున్నాయి.

Comments